మణిపూర్‌లోని చురచంద్‌పూర్ లో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
September 13th, 12:45 pm
భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై! గవర్నర్ శ్రీ అజయ్ భల్లా, రాష్ట్ర ప్రభుత్వ పాలనాధికారులు, ఈ కార్యక్రమానికి హాజరైన మణిపూర్ కు చెందిన నా సోదరీసోదరులారా, మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం!మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లో ₹7,300 కోట్లకుపైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన
September 13th, 12:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లో ₹7,300 కోట్లకుపైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- ధైర్యం, దృఢ దీక్షకు మణిపూర్ ప్రసిద్ధమని, ఇక్కడి పర్వతాలు ప్రకృతి రాష్ట్రానికి ప్రసాదించిన అమూల్య కానుకలని అభివర్ణించారు. ప్రజల నిరంతర కృషికి ఇవి ప్రతీకలని కూడా ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల స్ఫూర్తికి అభివందనం చేస్తూ- తాను పాల్గొంటున్న కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. వారు తనపై కురిపిస్తున్న ప్రేమాదరాలకు ధన్యవాదాలు అర్పించారు.