రోజ్‌గార్ మేళాలో భాగంగా నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధాని ప్రసంగం
January 24th, 11:30 am
2026 సంవత్సరం ప్రారంభం మీ జీవితాల్లో సరికొత్త సంతోషాలకు నాంది పలుకుతోంది. దీనికి తోడు నిన్ననే వసంత పంచమి ముగిసింది.. మీ జీవితాల్లోనూ కొత్త వసంతం మొదలవుతోంది. రాజ్యాంగం పట్ల విధులతో మిమ్మల్ని అనుసంధానిస్తున్న సమయమిది. యాదృచ్ఛికంగా ఇప్పుడు దేశంలో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నిన్న జనవరి 23న నేతాజీ సుభాష్ జయంతి సందర్భంగా పరాక్రమ్ దివస్ జరుపుకున్నాం. రేపు జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని, అనంతరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఈ రోజుకూ ఓ ప్రత్యేకత ఉంది. ‘జన గణ మన’ను జాతీయ గీతంగా, ‘వందేమాతరా’న్ని జాతీయ గేయంగా రాజ్యాంగం ఆమోదించినది ఈ రోజునే. ఈ విశేషమైన రోజున 61 వేలకు పైగా యువత తమ జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు.18వ రోజ్‌గార్ మేళానుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
January 24th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు 18వ రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల జీవితాల్లో కొత్త సంతోషాలను తెస్తూ, రాజ్యాంగపరమైన బాధ్యతలతో దేశ పౌరులను అనుసంధానిస్తూ 2026 సంవత్సరం ప్రారంభమైందన్నారు. ఇది గణతంత్ర మహోత్సవ వేళ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా దేశం పరాక్రమ్ దివస్ జరుపుకొందని, రేపు అంటే జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం, ఆ వెంటనే గణతంత్ర దినోత్సవం వస్తున్నాయని శ్రీ మోదీ గుర్తు చేశారు. ‘జన గణ మన’ను జాతీయ గీతంగా, ‘వందేమాతరా’న్ని జాతీయ గేయంగా రాజ్యాంగం ఆమోదించిన ఈ రోజు కూడా ఎంతో విశేషమైనదని ప్రధానమంత్రి చెప్పారు. ఈ విశేషమైన రోజున 61 వేలకు పైగా యువత ప్రభుత్వోద్యోగాలకు నియామక పత్రాలను స్వీకరించి.. తమ జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నియామక పత్రాలను దేశ నిర్మాణానికి ఆహ్వానంగానూ, అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను మరింత వేగంగా ఆవిష్కరించే ప్రతినగానూ శ్రీ మోదీ అభివర్ణించారు. చాలా మంది యువత దేశ భద్రతను బలోపేతం చేస్తారనీ, విద్య - ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను శక్తిమంతం చేస్తారని, ఆర్థిక సేవలు - ఇంధన భద్రతనూ పటిష్టం చేస్తారని, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యువత అందరికీ ఈ సందర్భంగా ప్రధానమంత్రి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.న్యూఢిల్లీ కర్తవ్య పథ్‌లో కర్తవ్య భవన్ ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
August 06th, 07:00 pm
ఆగస్టు నెల విప్లవాల మాసం. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఈ చరిత్రాత్మక ఘట్టం! నవ భారత నిర్మాణం దిశగా ఒక్కో విజయమూ సాకారమవుతోంది. ఇక్కడే దేశ రాజధాని ఢిల్లీలో కర్తవ్య పథ్, కొత్త సంసద్ భవన్ (పార్లమెంట్ భవనం), కొత్త రక్షా భవన్ (రక్షణ కార్యాలయ సముదాయం), భారత్ మండపం, యశోభూమి, అమరవీరుల స్మారకార్థం జాతీయ యుద్ధ స్మారక చిహ్నం, నేతాజీ సుభాష్ బాబు విగ్రహం, ఇప్పుడు ఈ కర్తవ్య భవన్‌లను నిర్మించాం. ఇవి కేవలం కొత్త భవనాలో లేదా సాధారణ మౌలిక సదుపాయాలో మాత్రమే కాదు... ఈ భవనాల్లోనే ఈ అమృతకాలంలో ‘వికసిత భారత్’ కోసం విధానాలు రూపుదిద్దుకోబోతున్నాయి. ‘వికసిత భారత్’ కోసం కీలక నిర్ణయాలను ఇందులోనే తీసుకోబోతున్నారు. వచ్చే దశాబ్దాల్లో ఈ భవనాలే దేశం దశా దిశా నిర్ణయించబోతున్నాయి. కర్తవ్య భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరికీ, దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజినీర్లు, కార్మికులందరికీ కూడా ఈ వేదికపై నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో కర్తవ్య భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని
August 06th, 06:30 pm
ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ఈరోజు కర్తవ్య భవన్-3 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆగస్టు 15 కంటే ముందే క్రాంతికారక మాసమైన ఈ నెల మరో చారిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యంగా నిలుస్తోందని అన్నారు. ఆధునిక భారత్ నిర్మాణంతో ముడిపడి ఉన్న కీలక మైలురాళ్లను దేశం ఒకదాని తర్వాత ఒకటి దాటుతోందని ప్రధానంగా చెప్పారు. ఢిల్లీ గురించి మాట్లాడుతూ మౌలిక సదుపాయాల విషయంలో ఇటీవల జరిగిన పురోగతిని తెలియజేశారు. ఈ సందర్భంగా కర్తవ్య పథ్, కొత్త పార్లమెంట్ భవనం, కొత్త రక్షణ కార్యాలయాల సముదాయం, భారత్ మండపం, యశోభూమి, అమరవీరులకు సంబంధించిన జాతీయ యుద్ధ స్మారక చిహ్నం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహంతో పాటు ప్రస్తుత ప్రారంభోత్సవం జరుగుతోన్న కర్తవ్య భవన్‌లను ప్రస్తావించారు. ఇవి కేవలం కొత్త భవనాలు లేదా సాధారణ మౌలిక సదుపాయాలు కాదని ప్రధానంగా చెబుతూ.. అమృత్ కాలంలో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని రూపొందించే విధానాలు వీటిలో తయారౌతాయని అన్నారు. రాబోయే దశాబ్దాల్లో దేశం ప్రయాణించే మార్గం కూడా వీటిలోనే నిర్ణయం అవుతుందని పేర్కొన్నారు. కర్తవ్య భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ ఆయన అభినందనలు తెలిపారు. నిర్మాణంలో పాల్గొన్న ఇంజినీర్లు, కార్మికులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.రోజ్‌గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా పాల్గొన్న ప్రధాని: 71,000కు పైగా నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
December 23rd, 11:00 am
మంత్రిమండలిలో నా సహచరులు, దేశంలో వివిధ ప్రాంతాల ప్రముఖులు, నా యువ మిత్రులారా.రోజ్‌గార్ మేళా ద్వారా ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో నూతనంగా నియమితులైన 71,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలను అందజేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
December 23rd, 10:30 am
ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో రోజ్‌గార్ మేళా ద్వారా నియామకాలు పొందిన 71,000 మందికి పైగా యువతకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు నియామకపత్రాలను అందించి, వారిని ఉద్దేశించి ప్రసంగించారు. యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రాధాన్యమిస్తున్న ప్రధానమంత్రి అంకితభావానికి ఈ రోజ్ గార్ మేళా అద్దం పడుతుంది. జాతి నిర్మాణం, స్వయం సాధికారత సాధించేందుకు తోడ్పడేలా యువతకు అర్థవంతమైన అవకాశాలను ఇది అందిస్తుంది.Be it COVID, disasters, or development, India has stood by you as a reliable partner: PM in Guyana
November 21st, 02:15 am
PM Modi and Grenada PM Dickon Mitchell co-chaired the 2nd India-CARICOM Summit in Georgetown. PM Modi expressed solidarity with CARICOM nations for Hurricane Beryl's impact and reaffirmed India's commitment as a reliable partner, focusing on development cooperation aligned with CARICOM's priorities.భారత్- కరికమ్ రెండో శిఖరాగ్ర సమావేశం
November 21st, 02:00 am
భారత్-కరికమ్ రెండో శిఖరాగ్ర సమావేశాన్ని జార్జ్‌టౌన్‌లో నిన్న నిర్వహించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కరికమ్ కు ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న గ్రెనడా ప్రధాని శ్రీ డికన్ మిషెల్‌లు ఈ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించారు. శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీకి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. భారత్- కరికమ్ తొలి శిఖరాగ్ర సమావేశాన్ని 2019లో న్యూయార్క్ లో నిర్వహించారు. గయానా అధ్యక్షుడు, గ్రెనెడా ప్రధానిలకు తోడు శిఖరాగ్ర సమావేశంలో పాలుపంచుకొన్నా వారిలో..ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో 51,000 మందికి పైగా కొత్తగా నియమితులైన వారికి నియామక పత్రాల పంపిణీ;
October 28th, 01:05 pm
ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకం జరిగిన 51,000 మందికి పైగా యువతీయువకులకుప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 29న ఉదయం పదిన్నర గంటలకు దృశ్య మాధ్యమం (వీడియో కాన్ఫరెన్సింగ్) ద్వారా నియామక పత్రాలను అందించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు.'కర్మయోగి సప్తాహ్' - జాతీయ అభ్యాస వారోత్సవాలను ప్రారంభించిన ప్రధానమంత్రి
October 19th, 06:57 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీ లోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో కర్మయోగి సప్తాహ్ - జాతీయ అభ్యాస వారోత్సవాలను ప్రారంభించారు.‘కర్మయోగి శపథ్’-జాతీయ అభ్యాస వారాన్ని అక్టోబర్ 19న ప్రారంభించనున్న ప్రధానమంత్రి
October 18th, 11:42 am
‘‘కర్మయోగి శపథ్’’ – జాతీయ అభ్యాస వారాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు (అక్టోబర్ 19) ఉదయం 10.30 గంటలకు ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలోని డా. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది.రోజ్ గార్ మేళా లో 51,000 పై గా నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం
November 30th, 04:30 pm
దేశంలో లక్షలాది మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలన్న ప్రచారం కొనసాగుతోంది. నేడు 50 వేల మందికి పైగా యువతకు ప్రభుత్వ ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చారు. ఈ నియామక పత్రాలు అందుకోవడం మీ కృషి, ప్రతిభ ఫలితమే. మీకు, మీ కుటుంబానికి నా హృదయపూర్వక అభినందనలు.రోజ్ గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
November 30th, 04:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో రోజ్ గార్ మేళానుద్దేశించి ప్రసంగించి, నియామకప్రక్రియలో కొత్తగా ఎంపికైన 51,000 మందికి నియామకపత్రాలు పంపిణీ చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంపికైన ఈ అభ్యర్థులు ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/రెవిన్యూ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యా శాఖ; పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ; ఆర్థిక వ్యవహారాల శాఖ, రక్షణ శాఖ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ; కార్మిక, ఉపాధికల్పన శాఖ సహా వివిధ ప్రభుత్వ శాఖల్లో చేరనున్నారు.You are ‘Amrit Rakshak’ of this ‘Amrit Kaal: PM Modi at Rozgar Mela
August 28th, 11:20 am
PM Modi distributed more than 51,000 appointment letters to newly inducted recruits via video conferencing. Addressing the occasion, PM Modi congratulated the new appointees for their selection as ‘Amrit Rakshak’ during the Amrit Kaal. He Called them ‘Amrit Rakshak’ as the new appointees will not only serve the country but will also protect the country and the countrymen. PM Modi emphasized the responsibility that comes with the selection of Defence or Security and Police Forces and said that the Government has been very serious about the needs of the Forces.ఉపాధి సమ్మేళనంలో 51,000కుపైగా నియామక లేఖలు పంపిణీ చేసిన ప్రధానమంత్రి
August 28th, 10:43 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ కొత్తగా ఉద్యోగాలు పొందిన 51,000 మందికిపైగా యువతకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా నియామక లేఖలు పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా 45 చోట్ల నిర్వహించిన ఉపాధి సమ్మేళనం కింద తన పరిధిలోని కేంద్ర సాయుధ బలగాల (సిఎపిఎఫ్) కోసం దేశీయాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ వీరిని ఎంపిక చేసింది. తదనుగుణంగా వీరంతా కేంద్ర రిజర్వు పోలీసు దళం (సిఆర్‌పిఎఫ్), సరిహద్దు భద్రత దళం (బిఎస్‌ఎఫ్), సాయుధ సరిహద్దు భద్రత దళం (ఎస్‌ఎస్‌బి), అస్సాం రైఫిల్స్, కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సిఐఎస్‌ఎఫ్), ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు దళం (ఐటిబిపి), మాదక ద్రవ్య నిరోధం-నియంత్రణ సంస్థ (ఎన్‌సిబి), ఢిల్లీ పోలీసు విభాగాల్లో వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఆయా సంస్థలలో సబ్-ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ (సాధారణ విధులు); సహా సాధారణేతర విధులు నిర్వర్తించాల్సిన బాధ్యతలలో చేరుతారు.