జి7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జర్మనీ చాన్సలర్‌తో ప్రధానమంత్రి సమావేశం

June 17th, 05:34 pm

ఈ సందర్భంగా భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్య పునరుజ్జీవనంపై వారిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో చాన్సలర్ భారత పర్యటనకు రాగా, భారత-ఐరోపా సమాఖ్య మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై సంతకాలు పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం ద్వైపాక్షిక సంబంధాల ప్రగతిని సమీక్షించారు. ఈ ఏడాదిలోనే భారత్-జర్మనీ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం నిర్వహించనుండగా, వాణిజ్యం-పెట్టుబడులు, రక్షణ-భద్రత, కాలుష్య రహిత సుస్థిర అభివృద్ధి, సాంకేతికత, ఆవిష్కరణలు, విద్య, రవాణా తదితర రంగాల్లో సహకార బలోపేతంపై నిబద్ధతను వారిద్దరూ పునరుద్ఘాటించారు. రక్షణ పారిశ్రామిక సహకారంపై వ్యూహాత్మక భవిష్యత్‌ ప్రణాళికపై సంతకాలు పూర్తి కావడంపై వారు హర్షం ప్రకటించారు. జర్మనీ మీదుగా ప్రయాణించే భారత పౌరులకు ట్రాన్సిట్ వీసా మినహాయింపు విధానానికి శ్రీకారం చుట్టడాన్ని స్వాగతించారు.