భారత్-నార్డిక్ మూడో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఐస్‌లాండ్ ప్రధానితో సమావేశమైన ప్రధానమంత్రి

May 19th, 06:44 pm

భారత్-నార్డిక్ మూడో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఓస్లో వేదికగా ఐస్‌లాండ్ ప్రధానమంత్రి శ్రీమతి క్రిస్ట్రన్ ఫ్రోస్టాడోట్టిర్‌తో సమావేశమయ్యారు.

భారత్‌-నార్డిక్‌ 3వ సదస్సు సందర్భంగా సంయుక్త మీడియా ప్రకటనలో ప్రధానమంత్రి ప్రకటన

May 19th, 04:25 pm

ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన, బహుపక్షవాదం పట్ల ఉమ్మడి నిబద్ధతే మనల్ని సహజ భాగస్వాములుగా చేస్తోంది. సాంకేతికత, సుస్థిర రంగాల్లో మనకున్న ఉమ్మడి ప్రాధాన్యతలు.. ఇరుదేశాల సంబంధాల్లో అపారమైన అవకాశాలను కల్పిస్తున్నాయి. అందువల్లే నార్డిక్ దేశాలతో మన సంబంధాల్లో శక్తిని, వేగాన్ని పెంచేందుకు ఎనిమిదేళ్ల కిందట ఈ వేదికను ఏర్పాటు చేశాం.

ప్రధానమంత్రి యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీ పర్యటన (మే 15 - 20, 2026)

May 11th, 09:00 pm

ప్రధానమంత్రి మోదీ మే 15 నుండి మే 20, 2026 వరకు యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కలిసి వివిధ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు. నెదర్లాండ్స్‌లో, ప్రధానమంత్రి మోదీ రాజు విల్లెం-అలెగ్జాండర్‌ను కలిసి, ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్‌తో చర్చలు జరుపుతారు. స్వీడన్‌లో, ఆయన ప్రధానమంత్రి క్రిస్టర్‌సన్‌తో చర్చలు జరుపుతారు. నార్వేలో, ఆయన రాజు హెరాల్డ్ Vను కలిసి, ప్రధానమంత్రి జోనాస్ గార్ స్టోర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం, ఆయన ఇటలీని సందర్శించి ప్రధానమంత్రి జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు.

‘భారత-నార్డిక్’ రెండో శిఖరాగ్ర సదస్సు

May 04th, 07:44 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘భారత-నార్డిక్‌’ రెండో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఆయనతోపాటు డెన్మార్క్‌, ఐస్‌లాండ్‌, నార్వే, స్వీడన్‌, ఫిన్లాండ్‌ దేశాల ప్రధానమంత్రులు- మెట్టీ ఫ్రెడరిక్సన్‌, కాట్రిన్‌ జాకబడోట్టిర్‌, జోనాస్‌ గార్‌స్టోర్‌, మగ్దలీనా ఆండర్సన్‌, సనామారిన్‌ కూడా ఇందులో పాలుపంచుకున్నారు.

ఐస్ లాండ్ ప్రధాని తో ప్రధాన మంత్రి సమావేశమయ్యారు

May 04th, 03:04 pm

రెండో ఇండియా-నార్డిక్ సమిట్ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోపెన్ హేగన్ లో ఐస్ లాండ్ ప్రధాని శ్రీ కెట్ రీన్ జేకోబ్ స్దోతిర్ తో ఒక ద్వైపాక్షిక సమావేశం లో పాల్గొన్నారు.

భార‌త‌దేశం మ‌రియు నార్డిక్ దేశాల మ‌ధ్య శిఖ‌ర స‌మ్మేళ‌నం సంద‌ర్భంగా సంయుక్త ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌

April 18th, 12:57 pm

ఈ రోజు స్టాక్ హోమ్ లో భార‌త‌దేశ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, డెన్మార్క్ ప్ర‌ధాని శ్రీ లార్స్ లోకే రస్ ముసెన్, ఫిన్ లాండ్ ప్ర‌ధాని శ్రీ జుహా శిపిల, ఐస్‌లాండ్‌ ప్ర‌ధాని శ్రీ కత్రిన్ జాకబ్స్ దాతిర్ మరియు నార్వే ప్ర‌ధాని శ్రీ ఎర్‌నా సోల్‌బ‌ర్గ్, స్వీడ‌న్ ప్ర‌ధాని శ్రీ స్టీఫ‌న్ లోఫ్‌వెన్ లు ఒక శిఖ‌ర స‌మ్మేళ‌నంలో పాలుపంచుకొన్నారు. ఈ శిఖ‌ర స‌మ్మేళ‌నానికి స్వీడిష్ ప్ర‌ధాని మ‌రియు భార‌త‌దేశ ప్ర‌ధాన‌ మంత్రి ఆతిథేయి లుగా వ్య‌వ‌హ‌రించారు.

డెన్మార్క్, ఐస్లాండ్, ఫిన్లాండ్ మరియు నార్వే ప్రధాన మంత్రులతో చర్చలు జరిపిన ప్రధాని మోదీ

April 17th, 09:05 pm

స్వీడన్ పర్యటన సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డెన్మార్క్, ఐస్లాండ్, ఫిన్లాండ్ మరియు నార్వే ప్రధాన మంత్రులతో ఉత్పాదక చర్చలు జరిపారు. ప్రధాని మోదీ పలువురు నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరిపి, పలు దేశాలతో భారతదేశం యొక్క సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేందుకు ఉద్దేశించినది.

PM greets the people of Iceland on Iceland's National Day

June 17th, 11:01 am