ఐబీఎస్ఏ నాయకుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన
November 23rd, 12:45 pm
ఐబీఎస్ఏ కేవలం మూడు దేశాల వేదిక మాత్రమే కాదు. ఇది మూడు ఖండాలను, మూడు ప్రధాన ప్రజాస్వామ్య శక్తులను, మూడు ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థలను కలిపే ఒక కీలకమైన వేదిక. ఇది మన వైవిధ్యం, భాగస్వామ్య విలువలు ఉమ్మడి ఆకాంక్షలలో పాతుకుపోయిన లోతయిన, శాశ్వతమైన భాగస్వామ్యం కూడా.జోహాన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఐబీఎస్‌ఏ నేతల సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి
November 23rd, 12:30 pm
ఈ సమావేశం సరైన సమయంలో నిర్వహిస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇది ఆఫ్రికా గడ్డపై జరిగిన తొలి జీ20 శిఖరాగ్ర సమావేశ సందర్భంలోనే జరగడం మంచి విషయమన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలు వరుసగా నాలుగు జీ20 సమావేశాలకు అధ్యక్షత వహించడం దీనికి ఒక కారణమని ప్రధానమంత్రి తెలిపారు. వీటిలో చివరి మూడు జీ20 సమావేశాలను ఐబీఎస్ఏ సభ్య దేశాలే నిర్వహించాయని గుర్తుచేశారు. ఫలితంగా మానవ కేంద్రిత అభివృద్ధి, బహుపాక్షిక సంస్కరణలు, సుస్థిర వృద్ధిపై దృష్టి సారిస్తూ అనేక ముఖ్య కార్యక్రమాలు చేపట్టామని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.జి20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి మోదీ దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ చేరుకున్నారు
November 21st, 06:25 pm
ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ చేరుకున్నారు. ప్రధానమంత్రి 20వ జి20 నాయకుల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా, ఆయన ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహిస్తారు మరియు భారతదేశం-బ్రెజిల్-దక్షిణాఫ్రికా (IBSA) నాయకుల సమావేశంలో కూడా పాల్గొంటారు.దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరే ముందు ప్రధానమంత్రి ప్రకటన
November 21st, 06:45 am
దక్షిణాఫ్రికా అధ్యక్షతన జోహెన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న జీ20 నాయకుల 20వ సదస్సులో పాల్గొనాలన్న శ్రీ సిరిల్ రామఫోసా ఆహ్వానం మేరకు 2025 నవంబర్ 21 నుంచి 23 వరకు ఆ దేశంలో పర్యటిస్తాను.