న్యూజిలాండ్ ప్రధానితో సమావేశమైన ప్రధానమంత్రి
July 11th, 08:09 am
ఆక్లాండ్‌లోని గవర్నమెంట్ హౌస్‌లో న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవ క్రిస్టోఫర్ లక్సన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ రోజు గవర్నమెంట్ హౌస్‌కు విచ్చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి సాంప్రదాయిక మావోరీ స్వాగతం లభించింది. ఈ వేడుకలో శాంతి, గౌరవం, స్వాగతానికి ప్రతీకగా నిలిచే సాంప్రదాయిక మావోరీ ఆచారాలను ప్రదర్శించారు. సాంప్రదాయిక స్వాగతం అనంతరం, ప్రధానమంత్రి ఆ దేశ సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.భారత్-న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం: భవిష్యత్ ప్రణాళిక-2030
July 11th, 08:06 am
భారత్-న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై రెండు దేశాల ప్రధానమంత్రులు సంయుక్త ప్రకటన చేశారు. ఈ మేరకు న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్‌లో ఇవాళ సమావేశమైన అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ భాగస్వామ్యాన్ని మరో నాలుగేళ్లలో మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 2030 దాకా ఒక ఉమ్మడి ప్రణాళిక అమలుకు వారిద్దరూ ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా ఆరు మూలస్తంభాల ప్రాతిపదికన వివిధ రంగాలలో అనేక కార్యక్రమాలను అమలు చేస్తారు.ఒప్పందాల జాబితా: న్యూజిలాండ్‌లో ప్రధానమంత్రి అధికారిక పర్యటన
July 11th, 08:03 am
చర్చలు, సమన్వయం, సమాచారాన్ని పంచుకోవడం, ఉమ్మడి కార్యకలాపాల ద్వారా ఇండో-పసిఫిక్‌లో మెరుగైన నౌకా వాణిజ్య సహకారం కోసం ఒక విధాన ప్రణాళికను ఏర్పాటు చేస్తుంది.భారత్-న్యూజిలాండ్ సంయుక్త ప్రకటన
July 11th, 07:59 am
న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవనీయ క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జులై 10, 11 తేదీల్లో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో అధికారికంగా పర్యటిస్తున్నారు. గత 40 ఏళ్లలో భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ చరిత్రాత్మక ఘట్టం రెండు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహం, సహకారంలో ఒక కొత్త దిశకు మార్గనిర్దేశం చేస్తోంది.సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
June 28th, 05:00 pm
ఈ రోజే కొంచెం ముందు నాకు ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్’ పురస్కారాన్ని అందించి నన్ను గౌరవించినందుకు అధ్యక్షుడు ఎర్మినీ గారికి, సీషెల్స్ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతర కృషి చేస్తున్న వారందరికీ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇక్కడికి భారత్‌లోని 140 కోట్ల ప్రజల తరపున ఆత్మీయ శుభాకాంక్షలను, శుభాశీస్సులను తీసుకువచ్చాను.భారత్‌లో మారిషస్ ప్రధాని అధికారిక పర్యటన... ఈ సందర్భంగా కుదిరిన ఒప్పందాలు
September 11th, 02:10 pm
శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక విజ్ఞాన రంగంలో సహకార అంశంలో భారత ప్రభుత్వంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికీ, మారిషస్ లో టెర్షియరీ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ రీసెర్చి మంత్రిత్వశాఖ మధ్య అవగాహన ఒప్పందం.