మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

September 17th, 11:20 am

మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ గారు, కేంద్ర మంత్రివర్గ సహచరులు సోదరి సావిత్రి ఠాకూర్ గారు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, దేశంలోని ప్రతి మూల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వేదికపై ఉన్న ఇతర ప్రముఖులు, నా ప్రియమైన సోదరీ సోదరులారా!

మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవం

September 17th, 11:19 am

మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. జ్ఞానానికి అధిదేవత, ధార్ భోజ్‌శాలలో పూజలందుకొనే తల్లి - వాగ్దేవికి నమస్కరిస్తూ.. తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అలాగే ఈ రోజు దేవశిల్పీ, నైపుణ్యం, సృజనాత్మకతకు అధిపతి అయిన విశ్వకర్మ జయంతి అని చెబుతూ ఆయనకు శ్రీ మోదీ నమస్సులు అర్పించారు. హస్త కళా నైపుణ్యం, అంకితభావంతో దేశ నిర్మాణంలో పాలుపంచు కొంటున్న కోట్లాది సోదరీసోదరులంటే తనకు ఎనలేని గౌరవం ఉందన్నారు.

‘స్థానికులకు స్వరం’ – మన్ కీ బాత్ లో, ప్రధాన మంత్రి మోదీ స్వదేశీ గర్వంతో పండుగలను జరుపుకోవాలని కోరారు

August 31st, 11:30 am

ఈ నెల మన్ కీ బాత్ ప్రసంగంలో, వరదలు మరియు కొండచరియలు విరిగిపడిన వారికి సహాయం అందించిన భద్రతా దళాలు మరియు పౌరులకు ప్రధాన మంత్రి మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జమ్మూ & కాశ్మీర్‌లో క్రీడా కార్యక్రమాలు, సౌరశక్తి, ‘ఆపరేషన్ పోలో’ మరియు భారతీయ సంస్కృతి యొక్క ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి వంటి ముఖ్యమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. పండుగ సీజన్‌లో మేడ్-ఇన్-ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయడం మరియు పరిశుభ్రతను కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను ప్రధాని పౌరులకు గుర్తు చేశారు.

హైదరాబాద్విమోచన దినం మన దేశ చరిత్ర లో ఒక మహత్వపూర్ణమైన క్షణం: ప్రధాన మంత్రి

September 17th, 08:48 pm

హైదరాబాద్ విమోచన దినం మన దేశం యొక్క చరిత్ర లో మహత్వపూర్ణమైన క్షణం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.