హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుటుంబంతో ప్రధానమంత్రి భేటీ
May 10th, 10:07 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.,. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుటుంబ సభ్యులతో ఈ రోజు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు.ప్రపంచ సవాళ్ల నడుమ ప్రతి భారతీయునికి ప్రధాని మోదీ గట్టి విజ్ఞప్తి
May 10th, 08:39 pm
హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ఇటీవలి సంఘర్షణలు, సరఫరా గొలుసు అంతరాయాల వల్ల తలెత్తిన ప్రపంచ ఆర్థిక సవాళ్ల గురించి మాట్లాడారు. భారతదేశ స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి సామూహిక జాతీయ బాధ్యత అవసరమని ఆయన పిలుపునిచ్చారు. దిగుమతులపై ఒత్తిడిని తగ్గించి, విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసేందుకు, ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించాలని, ప్రజా రవాణాను వినియోగించుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పౌరులను కోరారు.హైదరాబాద్‌లో సింధు ఆస్పత్రిని ప్రారంభించిన ప్రధానమంత్రి
May 10th, 07:10 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హైదరాబాద్‌లో సింధు ఆస్పత్రిని ప్రారంభించారు. నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల మెరుగుకు ఈ ఆస్పత్రి చేస్తున్న కృషి అభినందనీయమని ప్రధానమంత్రి ఈ సందర్భంగా అన్నారు.కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అనుసరిస్తున్న కుటుంబ రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారు: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ
May 10th, 06:05 pm
తెలంగాణలోని హైదరాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు; ఈ సందర్భంగా ఆయన ప్రపంచ వేదికపై భారత్ పెరుగుతున్న స్థాయి, బీజేపీ సాధించిన ఇటీవలి ఎన్నికల విజయాల ప్రాముఖ్యత, అలాగే ప్రస్తుతం నెలకొన్న ప్రపంచ ఆర్థిక మరియు భౌగోళిక-రాజకీయ సవాళ్ల నేపథ్యంలో దేశం యొక్క సమిష్టి బాధ్యత గురించి మాట్లాడారు.హైదరాబాద్‌లో ప్రధాని మోదీ భారీ ర్యాలీ: స్వయం సమృద్ధి మరియు 'వికసిత తెలంగాణ'పై దృష్టి
May 10th, 06:00 pm
తెలంగాణలోని హైదరాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు; ఈ సందర్భంగా ఆయన ప్రపంచ వేదికపై భారత్ పెరుగుతున్న స్థాయి, బీజేపీ సాధించిన ఇటీవలి ఎన్నికల విజయాల ప్రాముఖ్యత, అలాగే ప్రస్తుతం నెలకొన్న ప్రపంచ ఆర్థిక మరియు భౌగోళిక-రాజకీయ సవాళ్ల నేపథ్యంలో దేశం యొక్క సమిష్టి బాధ్యత గురించి మాట్లాడారు.అనువాదం: హైదరాబాద్‌లో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
May 10th, 03:45 pm
సైబరాబాద్‌కు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ సామర్థ్యం ఉంది. తెలంగాణ, దేశం సాధిస్తోన్న వేగవంతమైన అభివృద్ధికి ఇది ఒక ప్రధాన కేంద్రం. అందుకే తెలంగాణను దేశపు అతిపెద్ద తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నేడు సైబరాబాద్ నుంచి ఎన్నో భారీ ప్రాజెక్టులను ప్రారంభించాం. ఈ రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరిగిన ఈ ప్రాజెక్టుల ద్వారా ఇక్కడ వేలాది కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర అనుసంధానత కూడా మరింత బలోపేతం అవుతుంది. ఈ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సుమారు ₹9,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన సహా దేశానికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 10th, 03:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తెలంగాణలోని తెలంగాణలోని హైదరాబాద్‌లో దాదాపు ₹9,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనతోపాటు మరికొన్నిటిని దేశానికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ- జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యంగల కూడలిగా హైదరాబాద్ నగర పరిణామాత్మక ప్రాశస్త్యాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. తెలంగాణ సహా యావద్దేశాన్నీ శరవేగంగా పురోగమింపజేయడంలో ఈ ప్రాంతం కీలక పోషిస్తున్నదని ప్రస్ఫుటంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేడు ప్రారంభించిన వివిధ భారీ ప్రాజెక్టులు ఈ రాష్ట్రాన్ని ఓ ప్రధాన తయారీ కూడలిగా నిలుపుతాయని ఆయన పేర్కొన్నారు. నేటి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలతో వేలాది కొత్త ఉపాధి అవకాశాల సృష్టి సహా ప్రాంతీయ అనుసంధానం బలోపేతం కాగలదన్నారు. ప్రగతికి దోహదం చేసే ఈ ప్రాజెక్టులన్నీ రాష్ట్ర ప్రజలకూ ఎంతో ప్రయోజనం కల్పిస్తాయంటూ వారికి అభినందనలు తెలిపారు.మే 10న కర్ణాటక, తెలంగాణలో పీఎం పర్యటన
May 09th, 11:17 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మే 10, 2026న కర్ణాటక, తెలంగాణల్లో పర్యటిస్తారు. ఉదయం సుమారు 11 గంటలకు బెంగళూరులో జరిగే ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాల్లో ప్రధానమంత్రి పాల్గొని, సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత ప్రధానమంత్రి హైదరాబాద్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో దాదాపు రూ.9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం సుమారు 3:45 గంటలకు హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు.ఇండియా-కెనడా సీఈఓ ఫోరమ్‌లో ప్రధానమంత్రి ప్రసంగం
March 02nd, 02:30 pm
ఇండియా-కెనడా సీఈఓ ఫోరమ్‌లో మీ అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి కార్నీ సానుకూల ఆలోచనలను పంచుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.తమిళనాడులోని మధురైలో వివిధ మౌలిక సదుపాయాల పనుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
March 01st, 03:30 pm
పవిత్రమైన, చారిత్రక నగరమైన మధురైని సందర్శించడం గౌరవంగా భావిస్తున్నాను. మీనాక్షి అమ్మవారికీ, భగవాన్ సుందరేశ్వరుడికీ భక్తిపూర్వక ప్రణామాలు. తమిళనాడు అభివృద్ధి ప్రస్థానంలో నేటి ఈ కార్యక్రమం గర్వించదగ్గ ఘట్టం. దాదాపు రూ. 4,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశాం. పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేసుకున్నాం. ఈ ప్రాజెక్టులు రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తాయి. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఉద్యోగావకాశాలను కల్పించి, లక్షలాది జీవితాల్లో మార్పును తెస్తాయి. రైతులు మార్కెట్లకు చేరుకోవడానికి మెరుగైన రోడ్లు, భక్తులకూ పర్యాటకులకూ సులభతరమైన ప్రయాణం, వ్యాపారులకు వేగవంతమైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. నాణ్యమైన మౌలిక సదుపాయాలను నిర్మించడమంటే ప్రజలను సాధికారత దిశగా నడిపించడమే.మదురైలో రూ.4,400 కోట్లకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభం సహా దేశానికి అంకితం, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
March 01st, 03:00 pm
“గడచిన పన్నెండేళ్లుగా తమిళనాడు హైవే నెట్‌వర్క్‌లో కేంద్ర ప్రభుత్వం గణనీయ పెట్టుబడులు పెట్టింది. ఈ క్రమంలో 2014 నుంచి 4 వేల కిలోమీటర్లకు పైగా హైవేలు నిర్మితమయ్యాయి” అని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో మరక్కణం-పుదుచ్చేరి సెక్షన్ 4 వరుసల రహదారితోపాటు తీరప్రాంత పర్యాటకం, వాణిజ్యల బలోపేతానికి రూ.2,100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే, పరమకుడి-రామనాథపురం మార్గాన్ని 4 వరుసలుగా విస్తరించేందుకు రూ.1,800 కోట్లకు పైగా పెట్టుబడి పెడతారని పేర్కొన్నారు. ఈ రెండో ప్రాజెక్ట్ వల్ల రామేశ్వరం, ధనుష్కోటి వంటి ప్రదేశాలకు ప్రయాణ సౌలభ్యం గణనీయంగా మెరుగవుతుందని చెప్పారు. అంతేకాకుండా వ్యవసాయ, సముద్ర ఉత్పత్తుల నిరంతర రవాణాకు భరోసా ఇస్తుందని ఆయన తెలిపారు.Cabinet approves the widening of National Highway-167 in Telangana worth Rs.3175.08 crore
February 14th, 01:00 pm
The Cabinet Committee on Economic Affairs, chaired by PM Modi, has approved the widening of National Highway-167 from Gudebellur to Mahabubnagar on the Hyderabad-Panaji Economic Corridor to 4-lane standards in Telangana, worth Rs. 3175.08 crore. It will provide seamless connectivity to key economic, social and logistics nodes across Telangana and provide employment opportunities.హైదరాబాద్‌లో శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో వీడియో అనుసంధానం ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం
November 26th, 10:10 am
నేను పార్లమెంటుకు చేరుకోవాల్సి ఉన్నందున సమయం చాలా తక్కువగా ఉంది. గౌరవ రాష్ట్రపతితో ఒక కార్యక్రమం ఉంది. అందువల్ల ఎక్కువసేపు మాట్లాడకుండా నేను కొన్ని అంశాలను త్వరగా పంచుకుని... నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఈ రోజు నుంచి భారత విమానయాన రంగం కొత్త ఊపును పొందబోతోంది. ఈ కొత్త శాఫ్రాన్ కేంద్రం భారత్‌ను ప్రపంచ ఎంఆర్వో కేంద్రంగా నిలపడంలో సహాయపడుతుంది. ఈ ఎంఆర్వో కేంద్రం హైటెక్ ఏరోస్పేస్ ప్రపంచంలో యువతకు కొత్త అవకాశాలనూ సృష్టిస్తుంది. నేను ఈనెల 24న సాఫ్రాన్ బోర్డు యాజమాన్యాన్ని కలిశాను. నేను వారిని ఇంతకు ముందు కూడా కలిశాను. ప్రతి చర్చలోనూ భారత్ పట్ల వారి నమ్మకం, ఆశను నేను చూశాను. భారత్‌లో శాఫ్రాన్ పెట్టుబడి అదే వేగంతో కొనసాగుతుందని నాకు నమ్మకం ఉంది. ఈ రోజు ఈ కేంద్రం కోసం కృషి చేసిన టీం శాఫ్రాన్‌కు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.హైదరాబాద్‌లోని ‘శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా’ కేంద్రాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధానమంత్రి
November 26th, 10:00 am
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన జీ.ఎం.ఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ సెజ్‌లో ఉన్న శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (ఎస్ఏఈఎస్ఐ) కేంద్రాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. “నేటి నుంచి భారత విమానయాన రంగం కొత్త పుంతలు తొక్కనుంది. శాఫ్రాన్ కంపెనీకి చెందిన ఈ కొత్త కేంద్రం భారత్‌ను ఒక గ్లోబల్ ఎంఆర్ఓ (నిర్వహణ, మరమ్మత్తు, సమగ్ర మార్పు) కేంద్రంగా మార్చేందుకు సహాయపడుతుంది” అని వ్యాఖ్యానించారు. ఈ ఎంఆర్ఓ కేంద్రం అత్యాధునిక సాంకేతిక గల విమానాయన రంగంలో యువతకు కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తుందని ప్రధానమంత్రి ప్రముఖంగా చెప్పారు. నవంబర్ 24న శాఫ్రాన్ బోర్డు, అధికారుల బృందాన్ని కలిసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనికంటే ముందు కూడా వారితో జరిగిన ప్రతి చర్చలో భారత్ పట్ల వారికి ఉన్న విశ్వాసం, ఆశాభావాన్ని గమనించినట్లు పేర్కొన్నారు. దేశంలో శాఫ్రాన్ పెట్టుబడులు ఇదే వేగంతో కొనసాగుతాయని ఆశిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా శాఫ్రాన్ బృందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.నవంబర్ 26న ‘శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా’ కేంద్రాన్ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి
November 25th, 04:16 pm
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన జీ.ఎం.ఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ సెజ్‌లో ఉన్న శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (ఎస్ఏఈఎస్ఐ) కేంద్రాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 26న ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించనున్నారు.'వందేమాతరం' స్ఫూర్తి భారతదేశ అమర చైతన్యంతో ముడిపడి ఉంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
October 26th, 11:30 am
ఈ నెల మన్ కీ బాత్ ప్రసంగంలో, అక్టోబర్ 31న సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఛత్ పూజ పండుగ, పర్యావరణ పరిరక్షణ, భారతీయ కుక్క జాతులు, భారతీయ కాఫీ, గిరిజన సమాజ నాయకులు మరియు సంస్కృత భాష యొక్క ప్రాముఖ్యత వంటి ఆసక్తికరమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. 'వందేమాతరం' పాట 150వ సంవత్సరం గురించి ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు.అనువాదం: జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రసంగం
September 21st, 06:09 pm
శక్తిని ఆరాధించే పండగ అయిన నవరాత్రి రేపు ప్రారంభమవుతుంది. మీ అందరికీ శుభాకాంక్షలు. నవరాత్రి మొదటి రోజే.. దేశం ఆత్మనిర్భర్ భారత్ వైపు మరో ముఖ్యమైన ముందడుగు వేస్తోంది. రేపు అంటే సెప్టెంబర్ 22న నవరాత్రి మొదటి రోజు నాడు సూర్యుడు ఉదయించే మాదిరిగానే తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు కూడా అమలులోకి రానున్నాయి. ఒక విధంగా దేశంలో రేపటి నుంచి జీఎస్టీ పొదుపు అనే పండగ ప్రారంభం కానుంది. ఈ జీఎస్టీ పండగ మీ పొదుపులను పెంచుతుంది.. మీరు కావలసిన వస్తువులను మరింత తక్కువ ధరకు కొనుక్కునేలా చూసుకుంటుంది. మన దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలు, నవ- మధ్యతరగతి, యువత, రైతులు, మహిళలు, దుకాణదారులు, వ్యాపారవేత్తలు, వ్యవస్థాపకులు.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ పొదుపు అనే పండగ నుంచి చాలా ప్రయోజనం పొందుతారు. అంటే ఈ పండగ సమయంలో ప్రతి ఒక్కరు తీపి కబురు ఉండటంతో పాటు దేశంలోని ప్రతి కుటుంబం ఆశీర్వాదం పొందుతుందన్న మాట. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలతో పాటు పొదుపనే ఈ పండగ విషయంలో దేశంలోని కోట్లాది కుటుంబాలకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంస్కరణలు భారతదేశ వృద్ధిని వేగవంతం చేస్తాయి. వ్యాపార సౌలభ్యాన్ని మరింత పెంచుతాయి.. పెట్టుబడులు పెట్టటాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చుతుంది.. అభివృద్ధికి సంబంధించిన పోటీలో ప్రతి రాష్ట్రాన్ని సమాన స్థానంలో నిలబెడుతుంది.జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 21st, 05:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో అనుసంధానం ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. శక్తిని పూజించే పండుగ నవరాత్రి ప్రారంభం సందర్భంగా పౌరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నవరాత్రి మొదటి రోజు నుంచే దేశం ఆత్మనిర్భర్ భారత్ ప్రచారంలో కీలక ముందడుగు వేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 22న సూర్యోదయం నుంచే దేశంలో తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అమలవుతాయన్నారు. ఇది భారత్ అంతటా జీఎస్టీ బచత్ ఉత్సవ ప్రారంభాన్ని సూచిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఈ పండుగ పొదుపును పెంచుతుందనీ.. ప్రజలు తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయడాన్ని సులభతరం చేస్తుందనీ ఆయన స్పష్టం చేశారు. ఈ పొదుపు పండుగ ప్రయోజనాలు పేదలు, మధ్యతరగతి, నవ మధ్యతరగతి, యువత, రైతులు, మహిళలు, దుకాణదారులు, వ్యాపారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సమానంగా చేరుతాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ పండుగ సీజన్‌లో ప్రతి కుటుంబం రెట్టింపు ఆనందాన్ని, మాధుర్యాన్ని పొందుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు, జీఎస్టీ పొదుపు పండుగ కోసం దేశంలోని కోట్లాది కుటుంబాలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంస్కరణలు దేశ వృద్ధిని వేగవంతం చేస్తాయని.. వ్యాపార కార్యకలాపాలనూ సులభతరం చేస్తాయని.. మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తాయని ప్రధానమంత్రి వివరించారు. అభివృద్ధి పోటీలో ప్రతి రాష్ట్రం సమాన భాగస్వామిగా మారుతుందనీ ఆయన ఆకాంక్షించారు.‘స్థానికులకు స్వరం’ – మన్ కీ బాత్ లో, ప్రధాన మంత్రి మోదీ స్వదేశీ గర్వంతో పండుగలను జరుపుకోవాలని కోరారు
August 31st, 11:30 am
ఈ నెల మన్ కీ బాత్ ప్రసంగంలో, వరదలు మరియు కొండచరియలు విరిగిపడిన వారికి సహాయం అందించిన భద్రతా దళాలు మరియు పౌరులకు ప్రధాన మంత్రి మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జమ్మూ & కాశ్మీర్‌లో క్రీడా కార్యక్రమాలు, సౌరశక్తి, ‘ఆపరేషన్ పోలో’ మరియు భారతీయ సంస్కృతి యొక్క ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి వంటి ముఖ్యమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. పండుగ సీజన్‌లో మేడ్-ఇన్-ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయడం మరియు పరిశుభ్రతను కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను ప్రధాని పౌరులకు గుర్తు చేశారు.హైదరాబాద్ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టంపట్ల ప్రధాని సంతాపం
May 18th, 12:00 pm
హైదరాబాద్‌లో అగ్ని ప్రమాద దుర్ఘటనలో ప్రాణనష్టంపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.