ఇంధన వనరుల భద్రతపై భారత్, కొరియా సంయుక్త ప్రకటన
April 20th, 10:56 pm
బహిరంగ, సమ్మిళిత, సంపన్న ఇండో-పసిఫిక్ ప్రాంతం కోసం ఉమ్మడి దార్శనికత కలిగిన ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వాములు భారత్, కొరియా.డీఎస్ఐఆర్ ‘సామర్థ్యాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి’ పథకానికి క్యాబినెట్ ఆమోదం:
September 24th, 05:38 pm
శాస్త్రీయ- పారిశ్రామిక పరిశోధన విభాగం/ శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (డీఎస్ఐఆర్/ సీఎస్ఐఆర్) ‘సామర్థ్యాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి’ పథకానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 15వ ఆర్థిక సంఘం కాలానికి, 2021-22 నుంచి 2025-26 వరకు మొత్తం వ్యయం రూ. 2277.397 కోట్లతో దీనిని చేపట్టారు.Mauritius is an important pillar of India’s ‘Neighbourhood First’ policy and Vision ‘Mahasagar’: PM Modi
September 11th, 12:30 pm
In his remarks at the joint press meet in Varanasi, PM Modi said that just like the uninterrupted flow of the Ganga in Kashi, the continuous stream of Indian culture has enriched Mauritius. He congratulated PM Ramgoolam and the people of Mauritius on the successful conclusion of the Chagos Agreement. The PM also announced a Special Economic Package for Mauritius to strengthen infrastructure, create jobs, and improve healthcare.రానున్న దశాబ్దంపై భారత్-జపాన్ ఉమ్మడి దృక్కోణం: ఎనిమిది లక్ష్యాలతో ప్రత్యేక వ్యూహాత్మక-ప్రపంచ భాగస్వామ్యానికి సారథ్యం
August 29th, 07:11 pm
ఇండో-పసిఫిక్ ప్రాంతంపై భారత్, జపాన్ దేశాలది ఉమ్మడి దృక్కోణం. ఈ ప్రాంతం చట్టబద్ధ పాలన సహిత స్వేచ్ఛ, సౌహార్దం, శాంతి, సౌభాగ్యాలతో ఘర్షణ రహితంగా పురోగమించాలన్నది రెండు దేశాల అభిమతం. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు పరస్పర సహాయకారిగా మెలగుతాయి. వనరులు, సాంకేతికత, ఉత్పత్తి వ్యయం రీత్యా పోటీతత్వంలో రెండింటికీ ప్రత్యేక బలాలున్నాయి. దీంతోపాటు సుదీర్ఘ సుహృద్భావ, చారిత్రక స్నేహబంధం ఉన్నందువల్ల ఇకపైనా జంటగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. రాబోయే దశాబ్దంలో మన దేశాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మార్పులు, అవకాశాలు అందిరానున్నాయి. వీటన్నిటి సద్వినియోగం దిశగా సంయుక్త సారథ్యానికి మేం సిద్ధంగా ఉన్నామని సందర్భంగా ప్రకటిస్తున్నాం. జాతీయ లక్ష్యాల సాధనతో్పాటు మన దేశాలను, భవిష్యత్తరం పౌరులను మునుపటికన్నా చేరువ చేయడానికి మా నాయకత్వం తోడ్పడుతుంది.భారత్-జపాన్ మానవ వనరుల బదిలీలు, సహకారానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక
August 29th, 06:54 pm
మానవ వనరులకు సంబంధించి భారత్, జపాన్ మధ్య 5 సంవత్సరాలలో కానున్న 5,00,000 మంది పరస్పర బదిలీల్లో 50,000 మంది నైపుణ్యం కలిగిన సిబ్బంది, ప్రతిభావంతులు ఉండనున్నారు.జపాన్ ప్రధానితో కలిసి భారత ప్రధాని సంయుక్త పత్రికా ప్రకటన
August 29th, 03:59 pm
ఈ రోజు మా చర్చ ఫలప్రదంగా, ప్రయోజనకరంగా సాగింది. రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగా, శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా.. మన భాగస్వామ్యం ఈ రెండు దేశాలకే కాకుండా ప్రపంచ శాంతి, స్థిరత్వానికి కూడా చాలా ముఖ్యమైనదని మేమిద్దరం అంగీకరిస్తున్నాం.6వ బిమ్స్ టెక్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
April 04th, 12:59 pm
ఈ సదస్సు కోసం ఘనమైన ఏర్పాట్లు చేసిన థాయిలాండ్ ప్రభుత్వానికి, గౌరవనీయ షినవత్ర గారికి నా కృతజ్ఞతలు.థాయ్‌లాండ్‌లో జరిగిన బిమ్స్‌టెక్ ఆరో సదస్సులో పాల్గొన్న ప్రధాని
April 04th, 12:54 pm
థాయ్‌లాండ్‌లో నిర్వహించిన బిమ్స్‌టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్) ఆరో సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. ఈ సదస్సుకు ప్రస్తుతం థాయ్‌లాండ్ అధ్యక్షత వహిస్తోంది. ‘‘బిమ్స్‌టెక్: సంక్షేమం, స్థిరత్వం, బహిరంగం’’ అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోంది. బిమ్స్‌టెక్ ప్రాంత నాయకుల ప్రాధాన్యాలు, ప్రజల ఆకాంక్షలను ఇది ప్రతిపలిస్తుంది. అలాగే అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న ఈ తరుణంలో ఉమ్మడి వృద్ధి సాధిండచంలో బిమ్స్‌టెక్ ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది.వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం దిశగా భారత్-మారిషస్ ఉమ్మడి ప్రణాళిక
March 12th, 02:13 pm
2025, మార్చ్ 11, 12వ తేదీల్లో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన మారిషస్ అధికార పర్యటన సందర్భంగా మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రాంగూలాం, శ్రీ మోదీల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లోని అన్ని పార్శ్వాల గురించి సమగ్రమైన, ఫలవంతమైన చర్చలు జరిగాయి.న్యూఢిల్లీలో సోల్ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
February 21st, 11:30 am
భూటాన్ ప్రధానమంత్రి, నా సోదరుడు దషో షెరింగ్ టోబ్‌గే, సోల్ (స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్‌షిప్) బోర్డు చైర్మన్ సుధీర్ మెహతా, వైస్ చైర్మన్ హన్స్ముఖ్ అధియా, జీవితాల్లో, ఆయా రంగాల్లో నాయకత్వాన్ని అందించడంలో విజయం సాధించిన ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలు, ఇంకా ఇక్కడ నేను చూస్తున్న అలాంటి గొప్ప వ్యక్తులు, అలాగే భవిష్యత్తు ఎదురుచూస్తున్న నా ఇతర యువ సహచరులారా…సోల్ నాయకత్వ సదస్సు మొదటి సంచికను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 21st, 11:00 am
స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ (సోల్) సదస్సు-2025 మొదటి సంచికను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నాయకులు, భవిష్యత్తులో నాయకులుగా ఎదగబోతున్న యువతకు శ్రీ మోదీ స్వాగతం పలికారు. కొన్ని కార్యక్రమాలు మనసుకు దగ్గరగా ఉంటాయని ఈ రోజు జరుగుతున్న సదస్సు కూడా అలాంటిదే అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘దేశ నిర్మాణానికి మెరుగైన పౌరులను తయారు చేయడం, ప్రతి రంగంలోనూ అద్భుతమైన నాయకులను తీర్చిదిద్దడం అవసరం’’ అని ప్రధాని అన్నారు. ప్రతి రంగంలోనూ గొప్ప నాయకులను తయారుచేయడం ప్రస్తుతం చాలా అవసరమని ఆయన తెలిపారు. ఈ దిశగా సాగుతున్న వికసిత్ భారత్ అభివృద్ధి ప్రయాణంలో స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్‌ను ఓ ముఖ్యమైన మైలురాయిగా వర్ణించారు. ఈ సంస్థ పేరుకి తగినట్టుగానే తనలో భారతీయ సామాజిక జీవన ఆత్మను నిలుపుకొని, దానిని కొనసాగిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఆధ్యాత్మిక అనుభవ సారాన్ని సోల్ అందంగా ప్రదర్శిస్తుందని ఆయన అన్నారు. సోల్ సంస్థకు సంబంధించిన అన్ని విభాగాలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంస్థకు భవిష్యత్తులో గుజరాత్‌లో ఉన్న గిఫ్ట్ సిటీలో విస్తృతమైన క్యాంపస్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.గయానాలోని భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
November 22nd, 03:02 am
మీ అందరితో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనతోపాటు ఇక్కడకు వచ్చినందుకు ముందుగా ఇర్ఫాన్ అలీ గారికి కృతజ్ఞతలు. వచ్చినదగ్గర నుంచీ నాపట్ల మీరు చూపిన ఆదరాభిమానాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నన్ను ఇంటికి ఆహ్వానించిన అధ్యక్షులు అలీ గారికి కృతజ్ఞతలు. నన్ను ఆత్మీయుడిగా భావించిన వారి కుటుంబానికి కూడా కృతజ్ఞతలు. ఆతిధిమర్యాదలు మన సంస్కృతిలో అంతర్భాగం. గత రెండు రోజులుగా ఇదే జ్ఞాపకానికి వస్తోంది. అధ్యక్షులు అలీగారు, వారి మామ్మగారు కూడా మొక్క నాటారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ పేరుతో మేం చేపట్టిన ఉద్యమంలో అది భాగం. అమ్మ పేరుతో ఒక మొక్కను నాటడం అని దానికి అర్థం. ఈ భావోద్వేగ క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.గయానాలో భారతీయ సంతతి సభ్యులను ఉద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం గయానాలోని ప్రవాస భారతీయులు అనేక రంగాలను ప్రభావితం చేస్తూ గయానా అభివృద్ధికి దోహదపడ్డారు: ప్రధానమంత్రి
November 22nd, 03:00 am
గయానాలోని జార్జ్ టౌన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భారతీయ సంతతి సభ్యులను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. గయానా అధ్యక్షుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీ, ప్రధాని మార్క్ ఫిలిప్స్, ఉపాధ్యక్షుడు భర్రాత్ జగ్దేవ్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ రామోతార్ తదితరులు పాల్గొన్నారు. సభనుద్దేశించి ప్రసంగిస్తూ అధ్యక్షుడికి శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తన రాక సందర్భంగా ప్రత్యేక ఆప్యాయతతో ఘనస్వాగతం పలకడంపై హర్షం వ్యక్తం చేశారు. తనపై చూపిన ఆప్యాయతానురాగాలపై అధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. “ఆతిథ్య స్ఫూర్తి మన సంస్కృతికి కేంద్ర బిందువు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా అధ్యక్షుడు, ఆయన మామ్మగారితో కలిసి తాను ఓ మొక్క నాటానని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇవి ఎప్పటికీ గుర్తుండిపోయే భావోద్వేగభరితమైన క్షణాలన్నారు.'కర్మయోగి సప్తాహ్' - జాతీయ అభ్యాస వారోత్సవాలను ప్రారంభించిన ప్రధానమంత్రి
October 19th, 06:57 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీ లోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో కర్మయోగి సప్తాహ్ - జాతీయ అభ్యాస వారోత్సవాలను ప్రారంభించారు.కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్- కామన్వెల్త్ అటార్నీ.. సొలిసిటర్స్ జనరల్స్ కాన్ఫరెన్స్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం
February 03rd, 11:00 am
ఈ సదస్సును ప్రారంభించడం నాకెంతో ఆనందదాయకం. ప్రపంచవ్యాప్తంగాగల ప్రముఖ న్యాయకోవిదులు ఈ సదస్సుకు హాజరు కావడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ఈ సందర్భంగా 140 కోట్ల మంది భారతీయుల తరపున మా అంతర్జాతీయ అతిథులందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను. అద్భుత భారతదేశంలోని ప్రతి అణువునూ ఆమూలాగ్రం ఆస్వాదించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.‘క్లియా’ కామన్వెల్త్ అటార్నీలు.. సొలిసిటర్స్ జనరల్ కాన్ఫరెన్స్-2024ను ప్రారంభించిన ప్రధానమంత్రి
February 03rd, 10:34 am
కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (క్లియా)-నిర్వహించిన కామన్వెల్త్ అటార్నీలు.. సొలిసిటర్స్ జనరల్ కాన్ఫరెన్స్ (సిఎఎస్‌జిసి)-2024ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభించారు. ‘‘న్యాయ ప్రదానంలో సీమాంతర సవాళ్లు’’ ఇతివృత్తంగా నిర్వహించబడుతున్న ఈ సదస్సులో న్యాయవ్యవస్థ పరివర్తన-న్యాయవాద వృత్తిపరమైన నైతిక కోణాలు వంటి చట్టం-న్యాయం సంబంధిత కీలకాంశాలు; కార్యనిర్వాహక వ్యవస్థ జవాబుదారీతనం; ఆధునిక న్యాయ విద్యపై పునఃసమీక్ష తదితరాలపై చర్చిస్తారు.ఎన్ పిడిఆర్ ఆర్, సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ –2023 తృతీయ సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ న రేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.
March 10th, 09:43 pm
విపత్తులనుంచి కోలుకునేలా చేయడంలో, విపత్తుల నిర్వహణ పనులలో నిమగ్నమైన వారందరికీ ముందుగా నా అభినందనలు. చాల సందర్భాలలో మీరు మీ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడడానికి మీరు అద్భుతమైన కృషి చేస్తుంటారు. ఇటీవవవల, టర్కీ, సిరియాలలో భారత బృందం కృషిని మొత్తం ప్రపంచం అభినందించింది. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం.విపత్తు ముప్పు తగ్గింపుపై జాతీయ వేదిక 3వ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
March 10th, 04:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో “విపత్తు ముప్పు తగ్గింపుపై జాతీయ వేదిక” (ఎన్‌పిడిఆర్ఆర్) 3వ సమావేశాన్ని ప్రారంభించారు. “మారుతున్న వాతావరణంలో స్థానిక ప్రతిరోధకత రూపకల్పన” ఇతివృత్తంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ‘సుభాష్ చంద్రబోస్ విపత్తు నిర్వహణ పురస్కారం-2023’ గ్రహీతలను ఆయన సత్కరించారు. ఈ గౌరవం పొందిన సంస్థలలో ‘ఒడిషా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ’ (ఒఎస్‌డిఎంఎ), మిజోరంలోని లుంగ్లీ ఫైర్ స్టేషన్ ఉన్నాయి. విపత్తు ముప్పు తగ్గింపు రంగంలో వినూత్న ఆలోచనలు, కార్యక్రమాలు, ఉపకరణాలు, సాంకేతికత పరిజ్ఞానాల సంబంధిత ప్రదర్శనను కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా, సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ తదితరులు పాల్గొన్నారు.It is our resolve that India becomes ‘Viksit Bharat’ by 2047: PM Modi in Rajya Sabha
February 09th, 02:15 pm
PM Modi replied to the motion of thanks on the President’s address to Parliament in the Rajya Sabha. The PM highlighted that the government has taken the significant step of achieving saturation in the Azadi Ka Amrit Kaal. He reiterated the efforts of the government where 100% of benefits reach every beneficiary in the country. “This is true secularism. This eliminates discrimination and corruption”, Shri Modi said.రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి ప్రధాన మంత్రి రాజ్యసభ లో ఇచ్చిన సమాధానం
February 09th, 02:00 pm
పార్లమెంటు ను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగాని కి ధన్యవాదాల ను తెలియజేసే తీర్మానాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న రాజ్య సభ లో సమాధానం ఇచ్చారు. రాష్ట్రపతి గారు ఆమె యొక్క ప్రసంగం లో ‘వికసిత్ భారత్’ తాలూకు దృష్టి కోణాన్ని ఆవిష్కరించడం ద్వారా ఉభయ సభల కు మార్గదర్శకత్వాన్ని వహించినందుకు ఆమె కు ప్రధాన మంత్రి ధన్యవాదాల ను పలుకుతూ, తన సమాధానాన్ని మొదలు పెట్టారు.