ఫిబ్రవరి 28న రాజస్థాన్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి
February 27th, 03:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 28న రాజస్థాన్ లోని అజ్మేర్‌లో పర్యటిస్తారు. రూ.16,680 కోట్లకు పైగా ఖర్చుతో అమలు చేసే అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ఉదయం సుమారు 11:30 గంటల వేళలో ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా ఒక జనసభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టులు పట్టణాభివృద్ధి, తాగునీటి సరఫరా, రోడ్లు, సాగునీరు, ఇంధనం, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు సహా కీలక రంగాలకు చెందినవి.