బెల్జియమ్ రాజు శ్రీ ఫిలిప్‌తో మాట్లాడిన ప్రధానమంత్రి

March 27th, 08:59 pm

బెల్జియమ్ రాజు శ్రీ ఫిలిప్‌తో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు మాట్లాడారు. యువరాణి ఆస్ట్రిడ్ సారథ్యంలో బెల్జియం ఎకనామిక్ మిషన్ ఇటీవల భారత్‌ను సందర్శించడాన్ని శ్రీ మోదీ ప్రశంసించారు. ఇప్పటికే దృఢంగా ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తృతపరుచుకోవడం, వాణిజ్యాన్నీ, పెట్టుబడినీ ప్రోత్సహించడంతోపాటు నవకల్పన, స్థిరత్వం కోసం పరస్పర సహకారాన్ని ముందుకు తీసుకుపోవడం అనే అంశాలపై బెల్జియమ్ రాజుతో ప్రధాని చర్చించారు.

బెల్జియమ్ యువరాణి ఆస్ట్రిడ్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ

March 04th, 05:49 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బెల్జియమ్ యువరాణి ఆస్ట్రిడ్‌తో ఈ రోజు సమావేశమయ్యారు. ఆమె ఈ నెల ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు భారత్‌లో పర్యటిస్తున్న ఒక ఉన్నత స్థాయి బెల్జియమ్ ఎకనామిక్ మిషన్‌కు సారథ్యం వహిస్తున్నారు.