అభివృద్ధి పనులు, దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ వాక్సినేషన్ ప్రారంభం సందర్భంగా అజ్మీర్‌లో ప్రధాని ప్రసంగం
February 28th, 12:00 pm
తీర్థరాజ్ పుష్కర్, సావిత్రీ అమ్మవారికి నిలయమైన ఈ పవిత్ర క్షేత్రంలో ఈ రోజు మీ మధ్యన నిలిచి ఆశీస్సులు పొందే అవకాశం నాకు లభించింది. సుర్‌సురాలోని తేజాజీధామ్‌కూ, పృథ్వీరాజ్ చౌహాన్ పుణ్యభూమి అయిన అజ్మీర్‌కూ ఈ వేదిక నుంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.రాజస్థాన్‌లోని అజ్మీర్ వేదికగా దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా ప్రచారం, రూ. 17,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 28th, 11:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అజ్మీర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాజస్థాన్ అభివృద్ధి ప్రయాణంలో ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా సుర్సురాలోని తేజాజీ ధామ్ వంటి ప్రాంతీయ సాంస్కృతిక వారసత్వ కేంద్రాలకు, హైఫా విముక్తిలో కీలక పాత్ర పోషించిన మేజర్ దల్పత్ సింగ్ వీరత్వానికి నివాళులర్పించారు. మేజర్ దల్పత్ సింగ్ ధైర్యసాహసాలు నేటికీ ఇజ్రాయెల్‌లో గౌరవం పొందుతున్నాయని ప్రధానమంత్రి తెలిపారు.ఫిబ్రవరి 28న రాజస్థాన్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి
February 27th, 03:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 28న రాజస్థాన్ లోని అజ్మేర్‌లో పర్యటిస్తారు. రూ.16,680 కోట్లకు పైగా ఖర్చుతో అమలు చేసే అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ఉదయం సుమారు 11:30 గంటల వేళలో ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా ఒక జనసభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టులు పట్టణాభివృద్ధి, తాగునీటి సరఫరా, రోడ్లు, సాగునీరు, ఇంధనం, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు సహా కీలక రంగాలకు చెందినవి.