ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో శ్రీ సత్య సాయి బాబా జన్మ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి ప్రసంగం
November 19th, 11:00 am
పవిత్రమైన పుట్టపర్తి నేలపై నేడు మీ అందరి మధ్య ఉండటం నాకు ఒక భావోద్వేగంతో కూడిన ఆధ్యాత్మిక అనుభూతి. కొద్దిసేపటి క్రితం బాబా సమాధి వద్ద నివాళులు అర్పించే అవకాశం నాకు లభించింది. ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు పొందడం ఎల్లప్పుడూ నా హృదయాన్ని భావోద్వేగంతో నింపే అనుభవం.ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో శ్రీ సత్య సాయిబాబా శతజయంత్యుత్సవాల్లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
November 19th, 10:30 am
ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాల సందర్భంగా భక్తకోటిని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. ‘సాయిరాం’ అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టిన ప్రధానమంత్రి.. ఈ పవిత్ర పుట్టపర్తి క్షేత్రంలో భక్తులందరి నడుమ ఉండడం ఒక భావోద్వేగభరిత, ఆధ్యాత్మిక అనుభవమని పేర్కొన్నారు. కొద్దిసేపటి కిందటే బాబా సమాధి వద్ద పుష్పాంజలి ఘటించే అవకాశం తనకు దక్కిందన్నారు. బాబా పాదాలకు నమస్కరించి, ఆయన ఆశీస్సులను పొందినట్లు చెప్పారు. బాబా ఆశీస్సులు ఎప్పుడు అందించినా మనసు భావోద్వేగానికి లోనవుతుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.న్యూఢిల్లీలో పార్లమెంటు సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన ఫ్లాట్ల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
August 11th, 11:00 am
శ్రీ ఓం బిర్లా గారూ, మనోహర్ లాల్ గారూ, కిరణ్ రిజిజు గారూ, మహేశ్ శర్మ గారూ, గౌరవ పార్లమెంటు సభ్యులూ, లోక్‌సభ ప్రధాన కార్యదర్శి గారూ, సోదరీ సోదరులారా!పార్లమెంటు సభ్యుల కోసం న్యూఢిల్లీలో నూతనంగా నిర్మించిన నివాస సముదాయాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 11th, 10:30 am
పార్లమెంట్ సభ్యుల కోసం న్యూఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్‌లో టైప్-7 బహుళ అంతస్థుల్లో కొత్తగా నిర్మించిన 184 ఫ్లాట్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ఇటీవలే కర్తవ్య భవన్‌గా పిలిచే కామన్ సెంట్రల్ సెక్రటేరియట్‌ను కర్తవ్య పథ్‌లో ప్రారంభించానని, అలాగే పార్లమెంట్ సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ను ప్రారంభించే అవకాశం తనకు లభించిందని అన్నారు. కాంప్లెక్సులోని నాలుగు టవర్లకు నాలుగు విశిష్ట నదులు - కృష్ణా, గోదావరి, కోసి, హుగ్లీ పేర్లు పెట్టినట్లు తెలిపారు. లక్షలాది మందికి జీవితాన్నిచ్చే ఈ నదులు, ఇప్పుడు ప్రజా ప్రతినిధుల జీవితాల్లోకి కొత్త ఆనందాల ప్రవాహానికి స్ఫూర్తిని ఇస్తాయని తెలిపారు. నదుల పేర్లు పెట్టే ఈ సంస్కృతి ఏకత్వమనే దారంతో దేశాన్ని కలిపి ఉంచుతుందని పేర్కొన్నారు. ఢిల్లీలో పార్లమెంటు సభ్యుల జీవన సౌలభ్యాన్ని ఈ కొత్త కాంప్లెక్స్ పెంచుతుందని, అలాగే ఎంపీలకు ఢిల్లీలో ప్రభుత్వం నివాసాలను పొందడం ఇప్పుడు సులభతరం అవుతుందని పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫ్లాట్ల నిర్మాణంలో పాలు పంచుకున్న ఇంజినీర్లు, శ్రామికులను ప్రశంసించారు. వీటిని పూర్తి చేయడంలో వారు కనబరిచిన అంకితభావాన్ని, చేసిన కృషిని మెచ్చుకున్నారు.ఢిల్లీలో పార్లమెంటు సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన ఫ్లాట్‌లను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
August 10th, 10:44 am
ఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్‌లో పార్లమెంటు సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన 184 టైప్–VII బహుళ అంతస్తుల ఫ్లాట్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 ఆగస్టు 11న ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు.రూ. 2,000 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వ పథకం "గ్రాంట్ ఇన్ ఎయిడ్ టు నేషనల్ కోపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ)కు కేబినెట్ ఆమోదం
July 31st, 03:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం గ్రాంట్ ఇన్ ఎయిడ్ టు నేషనల్ కోపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ) ’ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ కేంద్ర ప్రభుత్వ పథకాన్ని రూ. 2,000 కోట్ల వ్యయంతో 2025-26 నుంచి 2028-29 వరకు నాలుగేళ్ల కాలానికి (ఏటా రూ. 500 కోట్లు) అమలు చేయనున్నారు.ఆంధ్రప్రదేశ్ (తిరుపతి), ఛత్తీస్ గఢ్ (భిలాయ్), జమ్మూ కాశ్మీర్ (జమ్మూ), కర్ణాటక (ధార్వాడ్), కేరళ (పలక్కడ్) లోని అయిదు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల విద్యా, మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని విస్తరించేందుకు మంత్రివర్గం ఆమోదం
May 07th, 12:10 pm
ఆంధ్రప్రదేశ్ (ఐఐటి తిరుపతి), కేరళ (ఐఐటి పలక్కడ్), ఛత్తీస్‌గఢ్ (ఐఐటి భిలాయి), జమ్మూ కాశ్మీర్ (ఐఐటి జమ్మూ), కర్ణాటక (ఐఐటి ధార్వాడ్) లలో ఏర్పాటైన అయిదు కొత్త ఐఐటీలలో విద్య, మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని విస్తరించేందుకు (ఫేజ్-బి నిర్మాణం) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.ముద్ర యోజన లబ్ధిదారులతో ప్రధానమంత్రి సంభాషణ
April 08th, 01:03 pm
ప్రధానమంత్రి ముద్ర యోజన ప్రారంభమై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పథకం లబ్ధిదారులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ముచ్చటించారు. న్యూఢిల్లీలోని 7, లోకకల్యాణ్ మార్గ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. అతిథులను ఇంటికి ఆహ్వానించడంలో సాంస్కృతిక ప్రాధాన్యాన్ని, వారి రాక తీసుకొచ్చే పవిత్రత గురించి చెబుతూ ఈ కార్యక్రమానికి హాజరైన వారికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. తమ అనుభవాలను పంచుకోవాలని వారిని కోరారు. పెంపుడు జంతువులకు సంబంధించిన ఉత్పత్తులు, ఔషధాలు, సేవలు అందించే వ్యాపారితో శ్రీ మోదీ సంభాషించారు. ఈ సందర్భంగా కష్ట సమయాల్లో తమ సామర్థ్యాన్ని నమ్మిన వారికి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం గురించి ప్రధాని వివరించారు. తమకు రుణం మంజూరు చేసిన బ్యాంకు అధికారులను ఆహ్వానించి.. తమ ప్రగతిని వారికి చూపించాలని సూచించారు. ఇలాంటి చర్యలు కలలను నిజం చేసుకోవాలనుకొనే వారికి తోడ్పాటును అందించాలనే అధికారుల నిర్ణయానికి మరింత విశ్వాసాన్ని జోడిస్తాయని అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా లబ్ధిదారులు సాధించిన వృద్ధిని, విజయాన్ని చూసి వారు గర్వపడతారని మోదీ అన్నారు.శ్రీలంక అధ్యక్షునితో... సంయుక్త పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
April 05th, 11:30 am
గౌరవనీయ అధ్యక్షులు దిసనాయకే గారు, ఇరు దేశాల ప్రతినిధులు, మీడియా మిత్రులారా, నమస్కారం!టీవీ9 సమ్మిట్ 2025లో ప్రధానమంత్రి ప్రసంగం
March 28th, 08:00 pm
గౌరవనీయ రామేశ్వర్ గారు, రాము గారు, బరుణ్ దాస్ గారు, మొత్తం టీవీ9 బృందానికి.. మీ నెట్‌వర్క్ వీక్షకులందరికీ, ఈ సమావేశానికి హాజరైన గౌరవనీయ అతిథులందరికీ నా శుభాకాంక్షలు. ఈ సమ్మిట్ నిర్వహిస్తున్న మీకు అభినందనలు.టీవీ9 సదస్సు-2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
March 28th, 06:53 pm
భారత్ మండపంలో ఈ రోజు నిర్వహించిన టీవీ9 సదస్సు-2025లోప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా తొలుత టీవీ9 బృందానికి, వీక్షకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ చానెల్‌కు ప్రాంతీయ వీక్షకులు విస్తృత సంఖ్యలో ఉండగా, ఇప్పుడు ప్రపంచవ్యాప్త ప్రేక్షకులు కూడా వారిలో భాగం కానున్నారని పేర్కొన్నారు. దూరవాణి మాధ్యమం (టెలికాన్ఫరెన్స్) ద్వారా కార్యక్రమంలో పాలుపంచుకున్న భారత ప్రవాసులకు సాదర స్వాగతం పలకడంతోపాటు అభినందనలు తెలిపారు.మార్చి 30న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రధానమంత్రి పర్యటన
March 28th, 02:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 30న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో పర్యటించనున్నారు. ఆయన నాగపూర్ వెళ్లి ఉదయం సుమారు 9 గంటలకు స్మృతి మందిర్‌లో దర్శన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత దీక్షాభూమిని సందర్శిస్తారు.Governance is not a platform for nautanki: PM slams AAP-da after BJP sweeps Delhi
February 08th, 07:00 pm
In a landmark victory, the BJP emerged victorious in the national capital after 27 years. Addressing enthusiastic Karyakartas at the BJP headquarters, PM Modi hailed the triumph as a win for development, vision and trust. “Today, the people of Delhi are filled with both enthusiasm and relief. The enthusiasm is for victory, and the relief is from freeing Delhi from the AAP-da”, PM Modi declared, emphasising that Delhi has chosen progress over an era of chaos.PM Modi addresses BJP Karyakartas at Party Headquarters after historic victory in Delhi
February 08th, 06:30 pm
In a landmark victory, the BJP emerged victorious in the national capital after 27 years. Addressing enthusiastic Karyakartas at the BJP headquarters, PM Modi hailed the triumph as a win for development, vision and trust. “Today, the people of Delhi are filled with both enthusiasm and relief. The enthusiasm is for victory, and the relief is from freeing Delhi from the AAP-da”, PM Modi declared, emphasising that Delhi has chosen progress over an era of chaos.స్వాభిమాన్ అపార్ట్‌మెంట్స్ లబ్ధిదారులతో ప్రధానమంత్రి సంభాషణ పాఠం
January 03rd, 08:30 pm
లబ్ధిదారు: అవును సర్, దొరికింది. మీకు మేం చాలా కృతజ్ఞులమై ఉంటాం. గుడిసెలో నుంచి మంచి చోటుకు మమ్మల్ని తీసుకువచ్చారు మీరు. ఇంత మంచి చోటు దొరుకుతుందని మేం ఎన్నడూ అనుకోలేదు, మా కలను మీరు నిజం చేశారు.. అవును, సర్.స్వాభిమాన్ గృహ సముదాయం లబ్ధిదారులతో ప్రధానమంత్రి సంభాషణ
January 03rd, 08:24 pm
‘అందరికీ ఇల్లు’ అందించాలనే తన నిబద్ధతకు అనుగుణంగా ఢిల్లీలోని అశోక్ విహార్‌లోని స్వాభిమాన్ గృహసముదాయంలో నిర్మించిన ఫ్లాట్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు సందర్శించారు. యధాస్థానంలో మురికివాడ పునరావాస ప్రాజెక్టులో భాగంగా జుగ్గీ జోప్రి (జేజే) క్లస్టర్లలోని నివాసితుల కోసం వీటిని నిర్మించారు. స్వాభిమాన్ అపార్ట్మెంట్ల లబ్ధిదారులతో ప్రధాని శ్రీ మోదీ ముచ్చటించారు.ఢిల్లీ ఓటర్లు నగరాన్ని 'ఆప్-డా' నుండి విముక్తి చేయాలని సంకల్పించారు: ప్రధాని మోదీ
January 03rd, 01:03 pm
పేద కుటుంబాలకు ఇళ్లు సహా కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టులను ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రతి పౌరుడికి పక్కా ఇంటి లక్ష్యాన్ని పునరుద్ఘాటిస్తూ, వృద్ధి, వ్యవస్థాపకత మరియు మహిళల నేతృత్వంలోని అభివృద్ధి సంవత్సరంగా 2025 కోసం భారతదేశ విజన్‌ను ఆయన నొక్కి చెప్పారు.ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
January 03rd, 12:45 pm
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు న్యూఢిల్లీలో పలు కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ శ్రీ మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2025వ సంవత్సరం భారత దేశ అభివృద్ధికి విస్తృత అవకాశాలను తీసుకువస్తుందని, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే లక్ష్యం వైపు దేశాన్ని ముందుకు తీసుకెళుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘ప్రస్తుతం రాజకీయ, ఆర్థిక సుస్థిరతలో ప్రపంచానికి భారత్ ఆదర్శంగా మారింది’’ అని ప్రధానమంత్రి అన్నారు. ఈ ఏడాది దేశ ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. దేశం ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా మారడం, అంకుర సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామిక రంగంలో యువతకు సాధికారత కల్పించడం, వ్యవసాయంలో నూతన రికార్డులు నెలకొల్పడం, మహిళా కేంద్ర అభివృద్ధిని ప్రోత్సహించడం, జీవన సౌలభ్యంపై దృష్టి సారించి ప్రతి పౌరునికీ నాణ్యమైన జీవితాన్ని అందించడమే 2025లో భారత్ లక్ష్యమని శ్రీ మోదీ వివరించారు.జనవరి 3 న ఢిల్లీలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధానమంత్రి
January 02nd, 10:18 am
‘అందరికీ ఇళ్లు’ అనే తన ఆలోచనకు అనుగుణంగా ఢిల్లీలోని అశోక్ విహార్‌లో నిర్మించిన స్వాభిమాన్ గృహసముదాయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శిస్తారు. యథాస్థానంలో మురికివాడ పునరావాస ప్రాజెక్టులో భాగంగా జుగ్గీ జోప్రి (జేజే) క్లస్టర్ల నివాసితుల కోసం వీటిని నిర్మించారు. జనవరి 3, 2025న దాదాపుగా మధ్యాహ్నం 12.10 గంటలకు వీటిని ప్రధాని సందర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.45 గంటలకు ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.భారత ప్రభుత్వ రంగ బ్యాంకులు మునుపెన్నడూ లేని విధంగా ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయి - మోదీ యుగం బ్యాంకింగ్ విజయ గాథ
December 18th, 07:36 pm
మోదీ యుగాన్ని దాని ముందువారి నుండి వేరుగా ఉంచే పోటీ ప్రయోజనం విజయవంతమైన విధానాలను కొనసాగించడమే కాకుండా సరైన సమయంలో జాతీయ ప్రయోజనాల కోసం వాటిని విస్తరించడం మరియు విస్తరించడం.