వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘వికసిత కృషి సంకల్ప్ అభియాన్’ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
May 29th, 06:45 pm
దేశంలోని రైతుల కోసం ఈ రోజు జగన్నాథ స్వామి ఆశీస్సులతో ‘వ్యవసాయాభివృద్ధి సంకల్ప కార్యక్రమం’ (వికసిత కృషి సంకల్ప్ అభియాన్) పేరిట విశిష్ట పథకానికి శ్రీకారం చుడుతున్నాం. రుతుపవనాలు వచ్చేశాయి... ఖరీఫ్ సాగుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మరో 12 నుంచి 15 రోజుల్లో శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు, ప్రగతిశీల రైతులతో కూడిన 2,000 బృందాలు దేశవ్యాప్తంగా గ్రామ సందర్శనకు బయల్దేరుతాయి. ఈ కార్యక్రమంపై 700కుపైగా జిల్లాల్లోని లక్షలాది రైతులకు ఈ బృందాలు అవగాహన కల్పిస్తాయి. ఈ విశిష్ట కార్యక్రమం, దీనిపై విస్తృత ప్రచారం ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత వ్యవసాయ రంగ ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ రైతులందరితోపాటు ప్రచార బృందాలకు నా శుభాకాంక్షలు.వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 29th, 06:44 pm
ప్రధాన మంత్రి శ్రీ నరంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికసిత కృషి సంకల్ప్ అభియాన్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ వికసిత కృషి సంకల్ప్ అభియాన్ రైతులకు, వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన ఒక ముఖ్యమైన కార్యక్రమమని అన్నారు. వర్షాకాలం దగ్గరపడుతున్న కొద్ది, ఖరీఫ్ సీజన్ ఏర్పాట్లు చేయటం మొదలవుతున్న ప్రస్తుత తరుణంలో వచ్చే 12 నుంచి 15 రోజుల పాటు 2000 మంది శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు, ప్రగతిశీల రైతులతో కూడిన బృందాలు 700 లకు పైగా జిల్లాల్లో సందర్శించి లక్షల మంది రైతులను చేరుకుంటారని తెలిపారు. ఈ బృందాల్లో ఉన్న వారికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన భారత వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు వారికి ఉన్న అంకితభావాన్ని ప్రశంసించారు.25 మే 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 122 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
May 25th, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం... నేడు యావద్దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంఘటితమై ఉంది. ఆగ్రహంతో ఉంది. సంకల్పబద్ధంగా ఉంది. నేడు ప్రతి భారతీయుడి సంకల్పం ఉగ్రవాదాన్ని అంతం చేయడమే. మిత్రులారా! 'ఆపరేషన్ సిందూర్' సమయంలో మన సైన్యాలు చూపిన పరాక్రమం ప్రతి హిందుస్థానీ శిరస్సును ఉన్నతంగా నిలిపింది. సరిహద్దు దాటి, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంలో మన సైన్యాలు చూపిన ఖచ్చితత్వం, స్పష్టత అద్భుతం. 'ఆపరేషన్ సిందూర్' ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటానికి కొత్త నమ్మకాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది.మన యువత ప్రతి రంగంలో దేశం గర్వించేలా చేస్తున్నారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
July 31st, 11:30 am
మిత్రులారా! జులై 31న అంటే ఈ రోజున దేశవాసులం అందరం అమరవీరుడు షహీద్ ఉధమ్ సింగ్ జీకి వందనం చేస్తున్నాం. దేశం కోసం ప్రాణాలర్పించిన అలాంటి గొప్ప విప్లవకారులందరికీ నా వినయపూర్వకమైన నివాళులు అర్పిస్తున్నాను.