విశిష్ట‌ విప్లవకారుడు శ్రీ మంగళ్ పాండేకి ప్రధానమంత్రి నివాళి

July 19th, 10:55 am

విశిష్ట విప్లవకారుడు శ్రీ మంగళ్ పాండే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళి అర్పించారు. బ్రిటిష్ పాల‌కుల‌పై తిరుగుబాటులో శ్రీ పాండే ప్ర‌ద‌ర్శించిన‌ ధైర్యసాహసాలు భార‌తీయులంద‌రికీ గర్వకారణమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆయన శౌర్యగాథ త‌ర‌త‌రాల‌కూ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

తిరు కె. కామరాజ్ జయంతి సందర్భంగా నివాళి అర్పించిన ప్రధాని

July 15th, 12:20 pm

తిరు కె. కామరాజ్ జయంతి సందర్బంగా.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. దేశ స్వాతంత్ర్యోద్యమ దిగ్గజంగా, దేశ వికాసం కోసం జీవితాన్ని అంకితం చేసిన అసాధారణ ప్రజా నాయకుడిగా ఆయన సేవలను శ్రీ మోదీ స్మరించుకున్నారు. విద్య, సమ్మిళిత అభివృద్ధి, బడుగు వర్గాల సంక్షేమం పట్ల తిరు కె. కామరాజ్ అచంచల నిబద్ధత భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన కొనియాడారు.

మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన ప్రధాని

June 28th, 10:38 am

మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళులర్పించారు. దేశ చరిత్రలోనే ఒక క్లిష్టమైన కాలంలో భారత ప్రగతికి పీవీ నరసింహారావు గారు చేసిన కృషి ఎనలేనిదని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు.

బంకిం చంద్ర చటోపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నివాళులు

June 26th, 12:50 pm

మహనీయుడైన బంకిం చంద్ర ఛటోపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఆయన రచనలు తరతరాల భారతీయ ప్రజల్లో దేశభక్తిని, సాంస్కృతిక గర్వాన్ని రగిలించాయని అన్నారు. ఒక మహోన్నత సాహిత్యవేత్తగా ఆయనను ప్రధానమంత్రి స్మరించుకున్నారు.

రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్‌కు ప్రధానమంత్రి నివాళులు

June 26th, 12:46 pm

రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆయనకు నివాళులర్పించారు. సాహూ మహారాజ్‌ తన జీవితాన్ని అణగారిన, శ్రమ దోపిడీకి గురైన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అంకితం చేశారని ప్రధానమంత్రి కొనియాడారు. ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆదర్శాలు రాబోయే తరాలకు, దేశానికి మార్గదర్శకంగా నిలుస్తాయని శ్రీ మోదీ పేర్కొన్నారు.

అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించిన వారికి నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

June 25th, 10:53 am

అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామిక విలువలను రక్షించిన వారందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శ్రద్ధాంజలి ఘటించారు. భారతదేశ చరిత్రలో అత్యంత నిరాశామయ అధ్యాయాలలో ఎమర్జెన్సీ ఒకటి అని ఆయన అన్నారు. ఆ సమయం... మౌనంగా ఉండిపోకుండా, రాజ్యాంగంలోని ఆదర్శాలను నిలబెట్టిన అసంఖ్యాక పౌరుల అసాధారణ ధైర్య, సాహసాలను, ధీరత్వాన్ని చాటిందని కూడా ఆయన అన్నారు.

మాజీ ప్రధాని పండిత్ జవహర్‌లాల్ నెహ్రూకు నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

May 27th, 08:33 am

మాజీ ప్రధాని పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.

ఆది శంకరాచార్యకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

April 21st, 01:09 pm

భారత్ మహనీయ ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరైన ఆది శంకరాచార్య జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆది శంకరాచార్య లోతైన బోధనలు, ఆలోచనలు, అద్వైత వేదాంత తత్త్వం ప్రపంచవ్యాప్తంగా ఎందరికో మార్గదర్శకంగా ఉన్నాయని శ్రీ మోదీ అన్నారు. ఆధ్యాత్మిక చింతనను పునరుత్తేజితం చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నాలూ, దేశమంతటా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కేంద్రాలూ కలకాలం స్ఫూర్తినిస్తాయన్నారు. ‘‘ఆయన జ్ఞ‌ానం మనకు దారి దీపంగా నిలవాలనీ, సత్యం, దయలతో పాటు సకల వర్గాల శ్రేయస్సుకు పాటుపడాలన్న మన నిబద్ధతను బలోపేతం చేయాలనీ కోరుకుంటున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.

బసవ జయంతి సందర్భంగా జగద్గురు బసవేశ్వరకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

April 20th, 09:43 am

బసవ జయంతి సందర్భంగా జగద్గురు బసవేశ్వరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

పార్లమెంటు భవన సముదాయంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌కు ప్రధాని నివాళి

April 14th, 11:33 am

ఈ రోజు ఉదయం పార్లమెంటు భవన సముదాయంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

జలియన్‌వాలా బాగ్ అమరులకు ప్రధానమంత్రి నివాళులు

April 13th, 09:39 am

జలియన్‌వాలా బాగ్‌లో తమ ధైర్య సాహసాల్ని చాటి అమరులైన వారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్మరించుకుంటూ, నివాళులు అర్పించారు. వారు చేసిన త్యాగం మన ప్రజల అజేయ స్ఫూర్తికి ఒక శక్తిమంతమైన ప్రమాణంగా నిలిచి ఉంటుందని శ్రీ మోదీ అన్నారు.

పార్లమెంటు ప్రాంగణంలో మహాత్మా పూలేకు నివాళులర్పించిన ప్రధానమంత్రి

April 11th, 11:48 am

నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పార్లమెంటు ప్రాంగణంలో ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

ప్రకాశ్ పర్వ్ వేళ శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ కి ప్రధానమంత్రి గౌరవ పూర్వక శ్రద్ధాంజలి

April 07th, 10:52 am

ఈ రోజు పవిత్ర ప్రకాశ్ పర్వ్.. ఈ సందర్భంగా, శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ కి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవ ప్రపత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు.

శ్రీమద్ సుధీంద్ర తీర్థ స్వామీజీకి నివాళి అర్పించిన ప్రధాని

March 31st, 10:58 am

శ్రీమద్ సుధీంద్ర తీర్థ స్వామీజీ జన్మ శతాబ్ది సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళి అర్పించారు. శ్రీమద్ సుధీంద్ర తీర్థ స్వామీజీ సేవ, ఆధ్యాత్మికతలకు జీవితాన్ని అంకితం చేశారని, సమాజంపై చెరగని ముద్ర వేశారని శ్రీ మోదీ కొనియాడారు. పూజ్య స్వామీజీ అనేక సంస్థలను, పరిశోధన కేంద్రాలను స్థాపించారని, ప్రజల్లో విద్యావ్యాప్తిని పెంచడానికి ఎంతో నిబద్ధతతో కృషి చేశారని ప్రధానమంత్రి అన్నారు.

శ్యా‌మ్‌జీ కృష్ణ వర్మ వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

March 30th, 09:50 am

భరత మాత వీర పుత్రుడు శ్యామ్‌జీ కృష్ణ వర్మ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. శ్యామ్‌జీ కృష్ణ వర్మ విప్లవాత్మక ఆలోచనలతో స్వాతంత్య్ర ఉద్యమానికి ఒక కొత్త చైతన్యాన్ని అందించారని శ్రీ మోదీ అన్నారు. ‘‘ఆయన జీవితం, ఆయన ఆదర్శాలు దేశానికి సేవలను అందించే దిశగా ప్రతి ఒక్క తరానికీ స్ఫూర్తిని ఇస్తున్నాయ’’ని శ్రీ మోదీ అన్నారు.

దండి యాత్రలో పాల్గొన్న వారికి ప్రధానమంత్రి నివాళులు సత్యానిదే జయమని చాటిచెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

March 12th, 10:34 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. 1930వ సంవత్సరం ఇదే రోజు మొదలైన దండి యాత్రలో పాల్గొన్న మహనీయులందరికీ నివాళులు అర్పించారు.

గొప్ప సామాజిక సంస్కర్త శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్‌కు నివాళులర్పించిన ప్రధానమంత్రి

February 15th, 02:49 pm

మహా సామాజిక సంస్కర్త శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆయనకు ఘన నివాళులర్పించారు. “సత్యం, అహింస, ఉన్నతమైన నైతిక విలువల సందేశాన్ని వ్యాప్తి చేయడం ద్వారా ఆయన సమాజంలో సరికొత్త చైతన్యాన్ని నింపారు. ఆయన స్ఫూర్తిదాయకమైన జీవితం దేశ ప్రజలకు ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తుంది” అని ఆయన అన్నారు.

పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జీకి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

February 11th, 10:19 am

పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జీ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆదర్శాలూ, విలువలపై ఆధారపడిన ఆయన ఆలోచనలూ దేశంలో ప్రతి తరానికీ మార్గదర్శనం చేస్తున్నాయని శ్రీ మోదీ అన్నారు.

మహనీయుడు సంత్ శ్రీ గురు రవిదాస్ మహారాజ్ గారికి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి

February 01st, 09:15 am

మహనీయుడు సంత్ శ్రీ గురు రవిదాస్ మహారాజ్ గారి జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. శ్రీ గురు రవిదాస్ మహారాజ్ గారు న్యాయాన్నీ, కరుణనీ ఇతర అన్ని భావనల కన్నా మిన్నగా తలచారనీ, ప్రజల సంక్షేమానికి మేం అమలు చేస్తున్న పథకాలకు కూడా ఈ భావనలే ఆధారంగా ఉన్నాయనీ శ్రీ మోదీ వివరించారు. ‘‘ఆయన వెలిగించిన సామాజిక సామరస్యం, సద్భావనల జ్యోతి దేశ ప్రజలు నడిచే దారిని ఎప్పటికీ ప్రకాశవంతం చేస్తూనే ఉంటాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

జాతిపిత మహాత్మాగాంధీకి రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

January 30th, 01:54 pm

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. బాపూజీ ఆశయాలు దేశ ప్రయాణానికి మార్గనిర్దేశం చేస్తాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామనీ, న్యాయం, సామరస్యం, మానవ సేవతో కూడిన భారతదేశ నిర్మాణానికి మా నిబద్ధతను ప్రకటిస్తున్నాం అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.