అనువాదం: 17వ పౌర సేవల దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం
April 21st, 11:30 am
నా మంత్రివర్గ సహచరులు డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, శ్రీ శక్తికాంత దాస్ గారు, డాక్టర్ సోమనాథన్ గారు, ఇతర సీనియర్ అధికారులు, దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్‌కు చెందిన సహచరులు, మహిళలు, పెద్దలు.. !17వ సివిల్ సర్వీసెస్ డే కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
April 21st, 11:00 am
ఈ రోజు న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో 17వ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సివిల్ సర్వెంట్లనుద్దేశించి ప్రసంగించారు. ప్రజాపాలన (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్)లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రధానమంత్రి శ్రేష్ఠత అవార్డులను ప్రదానం చేశారు. సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన శ్రీ మోదీ, సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంవత్సరం రాజ్యాంగం 75వ సంవత్సరాల వేడుకలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా సివిల్ సర్వీసెస్ డే మరింత విశిష్ఠతను సంతరించుకుందన్నారు. అలనాడు 1947 ఏప్రిల్ 21న సర్దార్ పటేల్ చేసిన ప్రకటనను ఉటంకిస్తూ, సర్దార్ సివిల్ సర్వెంట్లను ‘భారత దేశ ఉక్కు కవచం’గా అభివర్ణించారని గుర్తు చేశారు. పూర్తి అంకితభావంతో పని చేస్తూ, క్రమశిక్షణ, నిజాయితీ, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టే పాలనా యంత్రాంగాన్ని పటేల్ కోరుకున్నారని చెప్పారు. వికసిత్ భారత్ ఆశయ సాకారంలో సర్దార్ పటేల్ ఆదర్శాలు దారిదీపాలంటూ, పటేల్ దార్శనికత, వారసత్వానికి హృదయపూర్వక నివాళి అర్పించారు.సిల్వస్సాలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
March 07th, 03:00 pm
మీరంతా ఎలా ఉన్నారు? ఈ రోజు ఇక్కడ చాలా ఉత్సాహం కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చే అవకాశం ఇచ్చిన కేంద్రపాలిత ప్రాంత సిబ్బందికి నా కృతజ్ఞతలు. చాలా మంది పాత మిత్రులకు నమస్కారం చెప్పే అవకాశం వచ్చింది.కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ, దామన్ దివేలోని సిల్వస్సాలో రూ.2580 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 07th, 02:45 pm
కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ, దామన్ దివేలోని సిల్వస్సాలో రూ.2580 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. అంతకుముందు సిల్వస్సాలో నమో ఆస్పత్రిని కూడా ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, దాద్రా నగర్ హవేలీ, దామన్ దివే కేంద్రపాలిత ప్రాంతంతో అనుసంధానం కావడానికి, సన్నిహితంగా పనిచేయడానికి అవకాశం ఇచ్చినందుకు అక్కడి అంకితభావం కలిగిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. అక్కడి ప్రజలతో తనకు ఉన్న సాన్నిహిత్యం, దీర్ఘకాలిక సంబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఈ ప్రాంతంతో తన అనుబంధం దశాబ్దాల నాటిదని తెలిపారు. 2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ ప్రాంతం సాధించిన పురోగతిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దాద్రా నగర్ హవేలీ, దామన్ దివే సామర్థ్యాన్ని ఆధునికత, పురోగతి దిశగా మార్చిన విధానాన్ని ఆయన వివరించారు.బాగేశ్వర్ ధామ్ వైద్య, వైజ్ఞానిక పరిశోధన సంస్థ శంకుస్థాపన సందర్భంగా ప్రధాని ప్రసంగం
February 23rd, 06:11 pm
కార్యక్రమానికి విచ్చేసిన మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్ గారూ, ముఖ్యమంత్రి భాయ్ మోహన్ యాదవ్ గారూ, జగద్గురు పూజ్య రామభద్రాచార్య గారూ, భాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి శ్రీ ధీరేంద్ర శాస్త్రి గారూ, సాధ్వి రితంబర గారూ, స్వామి చిదానంద సరస్వతి గారూ, మహంత్ శ్రీ బాలక్ యోగేశ్చర దాస్ గారూ, ఈ ప్రాంత పార్లమెంటు సభ్యుడు శ్రీ విష్ణుదేవ్ శర్మ గారూ, ఇతర ప్రముఖులూ... ప్రియమైన సోదరీ సోదరులారా!బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
February 23rd, 04:25 pm
బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మధ్య ప్రదేశ్‌లోని ఛతర్‌పుర్ జిల్లా గఢా గ్రామంలో శంకుస్థాపన చేశారు. ఇంత తక్కువ సమయంలోనే రెండో సారి బుందేల్‌ఖండ్‌కు రావడం తనకు దక్కిన సౌభాగ్యం అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మిక కేంద్రం బాగేశ్వర్ ధామ్ త్వరలోనే ఆరోగ్య కేంద్రంగా కూడా రూపుదాల్చుతుందని ఆయన అన్నారు. బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్‌ను 10 ఎకరాలలో ఏర్పాటు చేస్తారని, మొదటి దశలో 100 పడకల సదుపాయం అందివస్తుందని ఆయన తెలిపారు. ఈ పవిత్ర కార్యానికిగాను శ్రీ ధీరేంద్ర శాస్త్రిని ఆయన అభినందిస్తూ, బుందేల్‌ఖండ్ ప్రజలకు తన శుభాకాంక్షలు తెలిపారు.కార్గిల్‌లో మనం కేవలం యుద్ధంలో గెలవలేదు; మేము సత్యం, సంయమనం మరియు సామర్ధ్యం యొక్క అద్భుతమైన బలాన్ని ప్రదర్శించాము: లడఖ్‌లో ప్రధాని మోదీ
July 26th, 09:30 am
లడఖ్‌లో 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా విధి నిర్వహణలో అత్యున్నత త్యాగం చేసిన ధైర్యవంతులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. కార్గిల్‌లో మనం యుద్ధంలో విజయం సాధించడమే కాదు, 'సత్యం, సంయమనం మరియు బలానికి అద్భుతమైన ఉదాహరణను అందించాము' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి; లద్దాఖ్ లో జరిగిన శ్రద్ధాంజలి సమారోహ్ లో ప్రధాన మంత్రి పాల్గొన్నారు
July 26th, 09:20 am
కర్తవ్య పాలనలో సర్వోన్నత త్యాగానికి వెనుదీయని వీర సైనికులకు ఈ రోజు ఇరవై అయిదో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లద్దాఖ్ లో శ్రద్ధాంజలి ఘటించారు. ‘శ్రద్ధాంజలి సమారోహ్’ లో కూడా ఆయన పాల్గొన్నారు. సైన్యంలో దిగువ స్థానాల నుంచి ఉన్నతిని సాధించి అధికారి శ్రేణికి ఎదిగిన సభ్యులు (ఎన్‌సిఒ స్) చదివిన ‘గౌరవ్ గాథ: బ్రీఫింగ్ ఆన్ కార్గిల్ వార్’ ను ప్రధాన మంత్రి విన్నారు. ‘అమర్ సంస్మరణ్: హట్ ఆఫ్ రిమెంబ్రెన్స్’ ను ఆయన సందర్శించారు. వీర భూమిని కూడా ప్రధాన మంత్రి సందర్శించారు.