వందేమాతరం 150 సంవత్సరాల ప్రత్యేక చర్చ సందర్భంగా లోక్ సభలో ప్రధానమంత్రి ప్రసంగం
December 08th, 12:30 pm
ఈ ప్రత్యేక సందర్భంలో సామూహికంగా చర్చించేందుకు ముందుకు వచ్చినందుకు మీకు, ఈ సభలోని గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని శక్తి, త్యాగస్పూర్తి, నిరాడంబరతను నింపిన ఆ మంత్రాన్ని, ఆ స్పష్టమైన పిలుపును గౌరవంగా గుర్తుచేసుకుంటూ.. ఈ సభలో వందేమాతరాన్ని స్మరించుకోవడం మనందరికీ గొప్ప గౌరవం. వందేమాతరం 150 సంవత్సరాల చారిత్రక ఘట్టానికి మనం సాక్షులుగా నిలబడటం చాలా గర్వకారణం. ఈ కాలం చరిత్ర విస్తృతి నుంచి లెక్కలేనన్ని సంఘటనలను మన ముందుకు తీసుకువస్తుంది. ఈ చర్చ ఖచ్చితంగా సభ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. కానీ మనం ఈ క్షణాన్ని సమష్టిగా ఉపయోగించుకుంటే రాబోయే తరాలకు, ప్రతి తరానికి కూడా నేర్చుకునే మూలంగా ఉపయోగపడుతుంది.జాతీయ గేయం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్ సభ ప్రత్యేక చర్చలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
December 08th, 12:00 pm
జాతీయ గేయం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రోజు లోకసభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ విశేష సందర్భంలో సమష్టి చర్చకు అంగీకరించిన గౌరవ సభ్యులందరికీ ప్రధానమంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యోద్యమానికి ఉత్తేజాన్నీ, ప్రేరణనూ అందించి.. త్యాగనిరతి - దృఢసంకల్పంతో కూడిన మార్గాన్ని నిర్దేశించిన ‘వందేమాతరం’ మంత్రాన్ని స్మరించుకుంటున్నామని, సభలో ఉన్న వారందరికీ ఇదో గొప్ప గౌరవమని ఆయన వ్యాఖ్యానించారు. వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన ఈ చరిత్రాత్మక సందర్భం దేశానికి గర్వకారణమని శ్రీ మోదీ అన్నారు. ఈ వేళ అనేక చారిత్రక సంఘటనలు మన కళ్లెదుట కదలాడేలా నిలుపుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ చర్చ సభ అంకితభావాన్ని చాటడమే కాకుండా, భావి తరాలు అవగాహన పెంచుకునే జ్ఞానసంపదగా నిలుస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సభ్యులంతా ఈ చర్చను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.రాజ్యసభ చైర్మన్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్ సత్కార కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
December 01st, 11:15 am
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ సభలోని గౌరవనీయ సభ్యులందరికీ ఇది గర్వకారణమైన రోజు. ఈ సందర్భంగా మీకు మా సాదర స్వాగతం... మీ మార్గదర్శకత్వాన ఈ సభలో కీలకాంశాల చర్చకు, తద్వారా దేశాన్ని ప్రగతి పథంలో నడపడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం. ఆ విధంగా మీ అమూల్య మార్గదర్శనం లభించడం మాకందరికీ ఒక గొప్ప అవకాశం. ఈ మేరకు సభ తరపున, నా తరపున మీకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గౌరవనీయ సభ్యులందరూ ఈ ఎగువ (రాజ్య)సభ మర్యాదను సదా పరిరక్షిస్తారని, చైర్మన్‌గా మీ గౌరవాన్ని ఎప్పుడూ కాపాడుతారని వాగ్దానం చేస్తున్నాను.. ఇది మీకు నేనిస్తున్న హామీ.రాజ్యసభ చైర్మన్ శ్రీ సి.పి. రాధాకృష్ణన్ సన్మాన సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యలు
December 01st, 11:00 am
రాజ్యసభకు తొలిసారి అధ్యక్షత వహించిన ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్వాగతం పలికారు. గౌరవ రాజ్యసభ సభ్యులందరికీ ఈ రోజు గర్వకారణమని ప్రధానమంత్రి అభివర్ణించారు. చైర్మన్‌కు సాదర స్వాగతం పలుకుతూ.. “సభ తరఫున, నా తరఫున మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నా అభినందనలు, శుభకామనలు. అత్యున్నతమైన ఈ సభా మర్యాదను గౌరవ సభ్యులందరూ ఎప్పటి మాదిరే కాపాడతారని, మీతో వారంతా విజ్ఞతతో వ్యవహరిస్తారని అనుకుంటున్నాను. ఇందుకు నాదీ హామీ” అని శ్రీ మోదీ భరోసా ఇచ్చారు.Sri Guru Teg Bahadur Ji's life, sacrifice and character are a tremendous source of inspiration: PM Modi in Kurukshetra
November 25th, 04:40 pm
PM Modi addressed an event commemorating the 350th Shaheedi Diwas of Sri Guru Teg Bahadur Ji at Kurukshetra in Haryana. He remarked that Sri Guru Teg Bahadur Ji considered the defense of truth, justice, and faith as his dharma, and he upheld this dharma by sacrificing his life. On this historic occasion, the Government of India has had the privilege of dedicating a commemorative postage stamp and a special coin at the feet of Sri Guru Teg Bahadur Ji.హర్యానాలోని కురుక్షేత్రలో శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 350వ షహీదీ దివస్‌లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 25th, 04:38 pm
హర్యానాలోని కురుక్షేత్రలో ఈ రోజు శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 350వ షహీదీ దివస్‌ను పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ... ఈ రోజు భారత వారసత్వ అద్భుత సంగమ దినమని అని వ్యాఖ్యానించారు. ఉదయం తాను రామాయణ నగరమైన అయోధ్యలో ఉన్నాననీ... ఇప్పుడు తాను గీతా నగరమైన కురుక్షేత్రలో ఉన్నానని ఆయన పేర్కొన్నారు. శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 350వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాధువులు, సంబంధిత సమాజం హాజరైనట్లు పేర్కొన్న ప్రధానమంత్రి... అందరికీ తన గౌరవప్రదమైన నమస్కారాలు తెలిపారు.22వ ఆసియాన్ - ఇండియా శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి ప్రారంభ ప్రసంగం
October 26th, 02:20 pm
నా ఆసియాన్ కుటుంబంతో మరోసారి కలిసే అవకాశం లభించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.Prime Minister’s participation in the 22nd ASEAN-India Summit in Kuala Lumpur
October 26th, 02:06 pm
In his remarks at the 22nd ASEAN-India Summit, PM Modi extended his heartfelt congratulations to Malaysian PM Anwar Ibrahim for ASEAN’s successful chairmanship. The PM said that ASEAN is a key pillar of India’s Act East Policy and expressed confidence that the ASEAN Community Vision 2045 and the vision of a Viksit Bharat 2047 will together build a bright future for all humanity.Bharat Ratna for Bhupen Da reflects our government's commitment to the North East: PM Modi in Guwahati, Assam
September 13th, 08:57 pm
PM Modi addressed the 100th birth anniversary of Bharat Ratna Dr. Bhupen Hazarika in Guwahati, Assam, calling it a remarkable day and a great privilege to be part of the celebrations. The PM shared, Bhupen Da, lovingly known as “Shudha Kantho,” gave voice to India’s unity, dreams and compassion of Mother India. “Bhupen Da’s entire life was dedicated to the nation’s goals,” PM Modi remarked, affirming the centenary year as a true tribute to his legacy.PM Modi addresses the 100th birth anniversary celebrations of Bharat Ratna Dr. Bhupen Hazarika in Guwahati, Assam
September 13th, 05:15 pm
PM Modi addressed the 100th birth anniversary of Bharat Ratna Dr. Bhupen Hazarika in Guwahati, Assam, calling it a remarkable day and a great privilege to be part of the celebrations. The PM shared, Bhupen Da, lovingly known as “Shudha Kantho,” gave voice to India’s unity, dreams and compassion of Mother India. “Bhupen Da’s entire life was dedicated to the nation’s goals,” PM Modi remarked, affirming the centenary year as a true tribute to his legacy.India and the UK are laying the foundation for a new chapter in our shared journey: PM Modi
July 24th, 04:00 pm
During his official visit to the United Kingdom, PM Modi met with the UK PM Keir Starmer. The two leaders held a one-on-one meeting as well as delegation level talks and welcomed the signing of the historic India-UK Comprehensive Economic and Trade Agreement (CETA). They reviewed the entire gamut of the bilateral relationship and adopted the India-UK Vision 2035.బ్రిటన్ ప్రధానితో భారత ప్రధాని భేటీ
July 24th, 03:59 pm
బ్రిటన్‌లో ఈ నెల 23-24 తేదీల్లో అధికారిక పర్యటన సందర్భంగా ఆ దేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ కీర్ స్టార్మర్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు భేటీ అయ్యారు. బకింగ్‌హామ్‌షైర్‌లో ఉన్న చెకర్స్‌లోని బ్రిటన్ ప్రధాని నివాసానికి చేరుకున్న శ్రీ మోదీకి శ్రీ స్టార్మర్ హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. ఇరువురు నేతలూ ముఖాముఖి సమావేశంతోపాటు ప్రతినిధి బృంద స్థాయి చర్చలు నిర్వహించారు.అంతరిక్ష అన్వేషణపై జరిగిన అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని చేసిన ప్రసంగం
May 07th, 12:00 pm
గ్లోబల్ స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ కాన్ఫరెన్స్-2025లో మీ అందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. అంతరిక్షం కేవలం ఓ గమ్యస్థానం కాదు. అది ఆసక్తి, ధైర్యం, సమష్టి ప్రగతిని ప్రకటించే అంశం. భారతీయ అంతరిక్ష ప్రయాణం ఈ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. 1963లో ఓ చిన్న రాకెట్ ప్రయోగం నుంచి చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరుకున్న మొదటి దేశంగా ఎదిగేంత వరకు మా ప్రయాణం అత్యద్భుతం. మా రాకెట్లు పేలోడ్లను మించిన బరువును మోస్తున్నాయి. 1.4 బిలియన్ల మంది భారతీయుల కలలను అవి మోస్తున్నాయి. భారత్ సాధించిన విజయాలు శాస్త్ర రంగంలో గొప్ప మైలురాళ్లు. వీటన్నింటినీ మించి, మానవ స్ఫూర్తి... గురుత్వాకర్షణ శక్తిని అధిగమిస్తుందనడానికి ఇది గొప్ప రుజువు. 2014లో మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరుకొని భారత్ చరిత్ర సృష్టించింది. చంద్రుడిపై నీటి జాడను కనుగొనేందుకు చంద్రయాన్-1 తోడ్పడింది. చంద్రయాన్-2 అధిక స్పష్టత ఉన్న చంద్రుని ఛాయాచిత్రాలను మనకు పంపింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై మన అవగాహనను చంద్రయాన్–3 పెంచింది. మేం రికార్డు సమయంలో క్రయోజనిక్ ఇంజిన్లను తయారుచేశాం. ఒకే ప్రయోగంలో 100 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టాం. మా వాహక నౌకల ద్వారా 34 దేశాలకు చెందిన 400 ఉపగ్రహాలను కక్ష్యంలో ప్రవేశపెట్టాం. ఈ ఏడాది అంతరిక్షంలో రెండు ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియను పూర్తి చేశాం. ఇది పెద్ద విజయం.అంతరిక్ష శోధనపై అంతర్జాతీయ సదస్సు-2025 (జిఎల్ఇఎక్స్)లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
May 07th, 11:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అంతరిక్ష శోధనపై అంతర్జాతీయ సదస్సు-2025 (జిఎల్ఇఎక్స్)ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా తొలుత ప్రపంచవ్యాప్తంగాగల విశిష్ట ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, వ్యోమగాములను ఆయన స్వాగతించారు. అంతరిక్ష రంగంలో భారత్ అద్భుత పయనం గురించి జిఎల్ఇఎక్స్- 2025లో పాల్గొంటున్నవారికి ప్రముఖంగా వివరించారు. ““అంతరిక్షమంటే కేవలం ఒక గమ్యం కాదు.. ఉత్సుకత-సాహసం-సమష్టి ప్రగతిని ప్రస్ఫుటం చేసే సంకల్పం” అని ఆయన అభివర్ణించారు. భారత్ 1963లో ఓ చిన్న రాకెట్‌ను ప్రయోగించిన నాటినుంచి చంద్రుని దక్షిణ ధ్రువంపై పాదం మోపిన తొలి దేశం స్థాయి ఎదగడం వరకూ సాధించిన విజయాలు ఈ స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయని ఆయన స్పష్టం చేశారు. “భారతీయ రాకెట్లు తమ కార్యభారాన్ని మించి... అంటే- 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను మోస్తూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాయి” అని వ్యాఖ్యానించారు. అలాగే భారత అంతరిక్ష విజయాలు శాస్త్రవిజ్ఞానంలో కీలక ఘట్టాలని, సమస్యలను అధిగమించడంలో మానవాళి స్ఫూర్తికినిదర్శనాలని ఆయన పేర్కొన్నారు. భారత్ 2014నాటి తన తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరుకోవడం ద్వారా చారిత్రక విజయం సాధించిందని గుర్తుచేశారు. జాబిలిపై జలం జాడను పసిగట్టడంలో చంద్రయాన్-1 ప్రయోగం తోడ్పడిందని పేర్కొన్నారు. తదుపరి చంద్రయాన్-2 ప్రయోగం చంద్ర ఉపరితల సుస్పష్ట (అత్యధిక రిజల్యూషన్) చిత్రాలను అందించిందని, ఇక తాజా చంద్రయాన్-3 ప్రయోగం చంద్రుని దక్షిణ ధ్రువంపై మానవాళి అవగాహనను మరింత పెంచిందని విశదీకరించారు. “భారత్ రికార్డు సమయంలో క్రయోజెనిక్ ఇంజిన్లను రూపొందించింది. ఒకే రాకెట్ ద్వారా 100 ఉపగ్రహాలను ప్రయోగించింది.. భారత ప్రయోగ వాహనాల ద్వారా 34కుపైగా దేశాలకు చెందిన 400కు మించి ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలో నిలిపింది” అని వివిధ విజయాలను ప్రధాని ఏకరవు పెట్టారు. ఇదే క్రమంలో ఈ ఏడాది అంతరిక్షంలో రెండు ఉపగ్రహాల అనుసంధానం ద్వారా భారత్ సాధించిన తాజా విజయాన్ని ప్రస్తావిస్తూ- అంతరిక్ష పరిశోధనలో ఇదొక కీలక ముందడుగని పేర్కొన్నారు.బీహార్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
March 22nd, 09:06 am
దేశ చరిత్రలో రాష్ట్రానికిగల ఉన్నత స్థానాన్ని, రాష్ట్ర ప్రగతికిమారిషస్ అధికారిక పర్యటన నేపథ్యంలో ప్రధానమంత్రి ముందస్తు సందేశం
March 10th, 06:18 pm
నా మిత్రుడు, మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులాం ఆహ్వానం మేరకు ఆ దేశ 57వ జాతీయ దినోత్సవంలో పాలు పంచుకునేందుకు నేను రెండు రోజుల అధికారిక పర్యటన చేపట్టబోతున్నాను.గుజరాత్... వడ్‌నగర్ చరిత్ర 2500 ఏళ్ల కన్నా పురాతనం: ప్రధానమంత్రి
January 17th, 08:27 am
గుజరాత్‌లో వడ్‌నగర్ యశోభరిత చరిత్ర 2500 ఏళ్ల కన్నా పురాతనమైందనీ, దానిని పదిలపరచడంతోపాటు సంరక్షించడానికి ఇక్కడ అద్వితీయ ప్రయత్నాల్ని చేపట్టారనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వ్యాఖ్యానించారు.The bond between India & Guyana is of soil, of sweat, of hard work: PM Modi
November 21st, 08:00 pm
Prime Minister Shri Narendra Modi addressed the National Assembly of the Parliament of Guyana today. He is the first Indian Prime Minister to do so. A special session of the Parliament was convened by Hon’ble Speaker Mr. Manzoor Nadir for the address.గయానా పార్లమెంటునుద్దేశించి భారత ప్రధానమంత్రి ప్రసంగం
November 21st, 07:50 pm
గయానా పార్లమెంటు జాతీయ అసెంబ్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. అలా ప్రసంగించిన మొదటి భారత ప్రధానమంత్రి ఆయనే. ఈ ప్రసంగం కోసం స్పీకర్ శ్రీ మంజూర్ నాదిర్ పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.నేడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతదేశం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
October 27th, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నా జీవితంలో మరపురాని క్షణాలేవని మీరు నన్ను అడిగితే చాలా సంఘటనలు గుర్తుకు వస్తాయి. కానీ చాలా ప్రత్యేకమైన మరపురాని ఒక క్షణం ఉంది- అది గత సంవత్సరం నవంబర్ 15 వ తేదీన జరిగింది. ఆరోజు నేను భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా జార్ఖండ్‌లోని ఆయన జన్మస్థలమైన ఉలిహాతు గ్రామానికి వెళ్ళాను. ఈ యాత్ర నాపై చాలా ప్రభావం చూపింది. ఈ పుణ్యభూమి మట్టిని తలతో తాకే భాగ్యం పొందిన దేశ తొలి ప్రధానమంత్రిని నేనే. ఆ క్షణంలో స్వాతంత్య్ర పోరాటంలో ఉన్న శక్తి తెలిసిరావడమే కాకుండా ఈ భూ శక్తితో అనుసంధానమయ్యే అవకాశం కూడా వచ్చింది. ఒక సంకల్పాన్ని నెరవేర్చేందుకు చేసే సాహసం దేశంలోని కోట్లాది ప్రజల భవిష్యత్తును ఎలా మార్చగలదో నేను గ్రహించాను.