జనవరి 10, 11 తేదీల్లో గుజరాత్‌లోని సోమనాథ్‌లో నిర్వహించే సోమనాథ స్వాభిమాన పర్వంలో పాల్గొననున్న ప్రధాని

January 09th, 12:10 pm

జనవరి 10, 11 తేదీల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్‌లోని సోమనాథ్‌లో పర్యటిస్తారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వంలో పాల్గొంటారు. జనవరి 10న రాత్రి 8 గంటలకు సోమనాథ ఆలయంలో నిర్వహించే ఓంకార మంత్రోచ్ఛారణలో పాల్గొంటారు. అలాగే డ్రోన్ ప్రదర్శనను వీక్షిస్తారు.

బాగేశ్వర్ ధామ్ వైద్య, వైజ్ఞానిక పరిశోధన సంస్థ శంకుస్థాపన సందర్భంగా ప్రధాని ప్రసంగం

February 23rd, 06:11 pm

కార్యక్రమానికి విచ్చేసిన మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్ గారూ, ముఖ్యమంత్రి భాయ్ మోహన్ యాదవ్ గారూ, జగద్గురు పూజ్య రామభద్రాచార్య గారూ, భాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి శ్రీ ధీరేంద్ర శాస్త్రి గారూ, సాధ్వి రితంబర గారూ, స్వామి చిదానంద సరస్వతి గారూ, మహంత్ శ్రీ బాలక్ యోగేశ్చర దాస్ గారూ, ఈ ప్రాంత పార్లమెంటు సభ్యుడు శ్రీ విష్ణుదేవ్ శర్మ గారూ, ఇతర ప్రముఖులూ... ప్రియమైన సోదరీ సోదరులారా!

బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి

February 23rd, 04:25 pm

బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మధ్య ప్రదేశ్‌లోని ఛతర్‌పుర్ జిల్లా గఢా గ్రామంలో శంకుస్థాపన చేశారు. ఇంత తక్కువ సమయంలోనే రెండో సారి బుందేల్‌ఖండ్‌కు రావడం తనకు దక్కిన సౌభాగ్యం అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మిక కేంద్రం బాగేశ్వర్ ధామ్ త్వరలోనే ఆరోగ్య కేంద్రంగా కూడా రూపుదాల్చుతుందని ఆయన అన్నారు. బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్‌ను 10 ఎకరాలలో ఏర్పాటు చేస్తారని, మొదటి దశలో 100 పడకల సదుపాయం అందివస్తుందని ఆయన తెలిపారు. ఈ పవిత్ర కార్యానికిగాను శ్రీ ధీరేంద్ర శాస్త్రిని ఆయన అభినందిస్తూ, బుందేల్‌ఖండ్ ప్రజలకు తన శుభాకాంక్షలు తెలిపారు.

కెనడాలో హిందూ ఆలయంపై దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ

November 04th, 08:34 pm

కెనడాలోని హిందూ దేవాలయంపై ఇటీవల జరిగిన దాడిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. దానితోపాటు భారత దౌత్యవేత్తలు ఎదుర్కొంటున్న బెదిరింపులనూ ఆయన తీవ్రంగా పరిగణించారు. కెనడా ప్రభుత్వం చట్టాలను సక్రమంగా అమలు చేసి న్యాయబద్ధంగా వ్యవహరించాలని కోరిన ప్రధాని, ఈ విషయంలో దేశ దృఢ సంకల్పాన్ని స్పష్టం చేశారు.