కోల్‌కతాలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

June 21st, 06:45 am

గౌరవనీయులైన పశ్చిమబెంగాల్‌ గవర్నర్ శ్రీ ఆర్.ఎన్.రవి, ఉత్సాహవంతులైన ముఖ్యమంత్రి శ్రీ సువేందు అధికారి, కేంద్ర ప్రభుత్వంలో నా సహచరుడు శ్రీ ప్రతాపరావు జాదవ్, వేదికను అలంకరించిన ఇతర ప్రముఖులు, ఈ కార్యక్రమానికి హాజరైన సభికులు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి యోగా వేడుకలో పాలుపంచుకుంటున్న వారు సహా నా ప్రియమైన దేశప్రజలారా... మీకందరికీ నమస్కారం!

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జాతీయ వేడుకలను

June 21st, 06:30 am

ఈ రోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కోల్‌కతాలోని రెడ్ రోడ్ వద్ద జాతీయ వేడుకలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. వేలాది యోగా సాధకులతో కలిసి కామన్ యోగా ప్రోటోకాల్ సెషన్‌లో శ్రీ మోదీ పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏడాదిలో పగటి సమయం ఎక్కువగా ఉండే రోజు జూన్ 21 అని శ్రీ మోదీ తెలిపారు. అలాగే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే అతిపెద్ద సామూహిక వేడుకల్లో ఈ రోజు ఒకటని వివరించారు.

మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ, డిజిటల్ సెన్సస్ 2027లో పాల్గొని దానిని విజయవంతం చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

April 26th, 11:30 am

ఈ నెల మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో, అణు, పవన విద్యుత్ రంగాలలో భారతదేశం సాధించిన ప్రగతిని ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. భగవాన్ బుద్ధుని బోధనలు, బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం, ప్రకృతి పరిరక్షణ, వెదురు రంగం, ప్రాచీన గ్రంథాలు, గణిత ఒలింపియాడ్ కార్యక్రమం వంటి పలు ముఖ్యమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. కొనసాగుతున్న డిజిటల్ సెన్సస్ ప్రచారం గురించి కూడా ప్రధాని మాట్లాడుతూ, ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఆస్ట్రియా ఛాన్సలర్‌తో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధాన మంత్రి వ్యాఖ్యలు

April 16th, 11:55 am

40 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా ఛాన్సలర్ భారతదేశ పర్యటనకు రావడం చాలా ముఖ్యమైన విషయం. 2026లో భారత్-ఐరోపా సమాఖ్య మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తర్వాత భారత్-ఈయూ సంబంధాలలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఛాన్సలర్ స్టాకర్ పర్యటన ద్వారా మేం భారత్-ఆస్ట్రియా సంబంధాలను ఒక నూతన యుగంలోకి తీసుకెళ్తున్నాం.

దేశ ప్రజలకీ, మానవ జాతికీ సేవ చేయడంలో పూర్తి అంకితభావం అవసరమని చెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

February 11th, 10:31 am

దేశ ప్రజలకీ, మానవ జాతికీ సేవ చేయడంలో పూర్తి అంకితభావం అవసరమని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.