అధికరణలు 370, 35(ఎ) రద్దుకు ఏడేళ్లు... చరిత్రాత్మక నిర్ణయాన్ని గుర్తు చేసుకున్న ప్రధాని

August 05th, 02:25 pm

అధికరణలు 370, 35(ఎ)లను రద్దు చేస్తూ తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయానికి నేటితో ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా... ఆ కీలక ఘట్టాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. సమ్మిళిత అభివృద్ధి దిశగా భారత్ ప్రయాణంలో కీలకమైన మైలురాయిగా 2019 ఆగస్టు 5ను ఆయన అభివర్ణించారు.

మైసూరులో ‘వివేక స్మారక’- స్వామి వివేకానంద సాంస్కృతిక యువజన కేంద్రం ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

August 01st, 04:53 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కర్ణాటకలోని మైసూరులో స్వామి వివేకానంద సాంస్కృతిక యువజన కేంద్రం- ‘వివేక స్మారక’ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు, భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలకు ఈ సందర్భంగా తొలుత అభివాదం చేయడంతోపాటు నగర ఆరాధ్య దైవమైన శ్రీ చాముండేశ్వరీ దేవికి ఆయన భక్తిపూర్వకంగా ప్రణమిల్లారు.

కర్ణాటకలోని మైసూరులో స్వామి వివేకానంద సాంస్కృతిక యువజన కేంద్రం- ‘వివేక స్మారక’కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం

August 01st, 04:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కర్ణాటకలోని మైసూరులో స్వామి వివేకానంద సాంస్కృతిక యువజన కేంద్రం- ‘వివేక స్మారక’ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు, భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలకు ఈ సందర్భంగా తొలుత అభివాదం చేయడంతోపాటు నగర ఆరాధ్య దైవమైన శ్రీ చాముండేశ్వరీ దేవికి ఆయన భక్తిపూర్వకంగా ప్రణమిల్లారు.

చండీగఢ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

July 17th, 02:08 pm

చండీగఢ్ అనేది కేవలం ఒక నగరం మాత్రమే కాదు. అది దేశ ప్రగతికి ఒక అద్భుతమైన నమూనా. క్రమబద్ధమైన అభివృద్ధి, మెరుగైన జీవన విధానం, సులభతర జీవనానికి ఈ నగరం పేరుగాంచింది. ఇక్కడి అత్యుత్తమ వైద్య సదుపాయాలు, అన్నింటికంటే ముఖ్యంగా చండీ మాత ఆశీస్సులు ఈ నగరానికి అదనపు బలాన్ని ఇస్తున్నాయి. అందుకే చండీగఢ్ సర్వతోముఖాభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం ఎల్లప్పుడూ అగ్ర ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. మీకు గుర్తుండే ఉంటుంది, దాదాపు ఏడాదిన్నర క్రితం మన దేశ న్యాయ వ్యవస్థలో ఒక చారిత్రాత్మక సంస్కరణను తీసుకువచ్చాం. కేవలం శిక్షించడమే లక్ష్యంగా ఉన్న పాత శిక్షాస్మృతి స్థానంలో, న్యాయం అందించడమే పరమావధిగా ఉండే భారతీయ న్యాయ సంహితను ప్రవేశపెట్టాం. ఈ చారిత్రక చట్టాల అమలు ప్రక్రియను మన చండీగఢ్ నుంచే ప్రారంభించడం నాకు ఎంతో గర్వంగా అనిపించింది.

చండీగఢ్‌లో ఆరోగ్య సంరక్షణ.. విద్య.. రహదారి మౌలిక సదుపాయాలు సహా ₹4,700 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

July 17th, 01:45 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు చండీగఢ్‌లో ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాలు సహా ₹4,700 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. క్రమబద్ధ జాతీయ ప్రగతికి ఈ నగరం ఒక ఆదర్శప్రాయ నమూనాగా నిలుస్తున్నదని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. దేశంలో దీనికిగల ప్రత్యేక స్థానాన్ని ప్రస్తావిస్తూనే- మెరుగైన జీవనశైలితో పాటు జీవన సౌలభ్య కల్పనలో నగరానికిగల ప్రాచుర్యాన్ని పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతంపై చండీమాత కృప మెండుగా ఉందంటూ- దీని నిరంతర, వ్యవస్థీకృత ప్రగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. “ప్రస్తుత ప్రభుత్వం చండీగఢ్ ప్రగతికి సదా అగ్ర ప్రాధాన్యం ఇస్తోంది” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.

జూలై 17న హర్యానా, చండీగఢ్, పంజాబ్‌లో పీఎం పర్యటన

July 15th, 06:40 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూలై 17న హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఉదయం సుమారు 11 గంటలకు జింద్ రైల్వేస్టేషన్‌లో జింద్-సోనిపట్ మధ్య నడిచే భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఉదయం 11:30 గంటలకు జింద్‌లోని ఏకలవ్య స్టేడియంలో దాదాపు రూ.14,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తారు.

విజ్ఞానం, నైపుణ్యాలు, ఆరోగ్యం గురించి వివరించే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధాని

July 15th, 12:12 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంస్కృత శ్లోకాన్ని పంచుకున్నారు. విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడం, ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భారత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో దేశ యువత బలమైన శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారు. ఈ లక్షణాలు వ్యక్తులను శక్తిమంతం చేయడమే కాకుండా.. దేశాభివృద్ధికి గణనీయమైన రీతిలో తోడ్పాటును అందిస్తాయి.

ఆస్ట్రేలియాలో భారతీయ ప్రవాసుల సమావేశంలో ప్రధాని ప్రసంగం

July 09th, 03:22 pm

మనం సమావేశమైన ఈ నేల పరంపరానుగత యజమానులకు గౌరవాభివాదాలతో నేను ప్రసంగాన్ని మొదలుపెడుతున్నాను. వారి పూర్వీకులకూ, పెద్దలకూ వినమ్రపూర్వక అభివాదాలు తెలియజేస్తున్నాను. నవతరానికి శుభాకాంక్షలు.

ఆస్ట్రేలియాలోని భారతీయులతో సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

July 09th, 03:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మెల్బోర్న్‌లోని మార్వెల్ స్టేడియంలో ఆస్ట్రేలియాలోగల భారతీయులతో నిర్వహించిన భారీ సభలో వారినుద్దేశించి ప్రసంగించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి గౌరవనీయ ఆంథోనీ అల్బనీస్ కూడా గౌరవపూర్వకంగా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

India and Indonesia are connected not only by our history but also by a shared future: PM Modi at community programme in Jakarta

July 07th, 11:47 pm

Addressing the Indian community in Jakarta, PM Modi thanked the diaspora for their warm welcome and praised their contribution to Indonesia's progress and their role as a living bridge between the two nations. He spoke about India's rapid transformation and called upon the community to contribute towards the shared aspirations of Viksit Bharat 2047 and Indonesia Emas 2045.

జకార్తాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి

July 07th, 05:30 pm

ఈ సందర్భంగా ఆహూతులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి.. తమకు లభించిన ఉత్సాహభరిత స్వాగతానికి గాను భారతీయ సమాజానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధ్యక్షుడు ప్రబోవోకు ప్రధాని కృతజ్ఞతలు చెబుతూ... ఆయనను ఒక గొప్ప నాయకుడుగా, భారత దేశానికి నిజమైన మిత్రుడిగా అభివర్ణించారు. ఇండోనేషియా పురోగతి, శ్రేయస్సులో ప్రవాస భారతీయులు అందిస్తున్న సహకారాన్ని ఇరు దేశాల మధ్య మైత్రికి ప్రతీకగా అభివర్ణించారు. పరస్పర విశ్వాసం, భాగస్వామ్య వారసత్వం, సముద్ర అనుబంధాల ఆధారంగా ఇండోనేషియాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ప్రాచీన నాగరికత సంబంధాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. బాలి యాత్ర, వైశాఖ పూర్ణిమ తీర్థయాత్ర వంటి సంప్రదాయాలతో పాటు ప్రస్తుత నలంద విశ్వవిద్యాలయం ద్వారా కొనసాగుతున్న ఆధునిక అనుసంధానాలు ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న వైవిధ్యభరిత, ఉత్సాహభరిత సంబంధాలను నిరంతరం పెంపొందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

India-Indonesia Joint Statement on the State Visit by Prime Minister of India to Indonesia

July 07th, 05:15 pm

At the invitation of Indonesian President Prabowo Subianto, PM Modi is on a State Visit to Indonesia from 6-8 July 2026. PM Modi's visit reflects the shared commitment of the two leaders to achieve a substantial upward trajectory in the India-Indonesia Comprehensive Strategic Partnership. The two leaders held discussions at Istana Merdeka in Jakarta, covering the full spectrum of bilateral relations.

ఇండోనేషియా అధ్యక్షునితో ప్రధానమంత్రి అధికారిక చర్చలు

July 07th, 02:51 pm

నాయకులిద్దరూ నియంత్రిత, ప్రతినిధి స్థాయి విధానాల్లో జరిగిన అధికారిక చర్చల్లో పాల్గొన్నారు. వాణిజ్యం-పెట్టుబడులు, రక్షణ-భద్రత, సముద్ర రక్షణ సహకారం, డిజిటల్-ఆర్థిక సాంకేతికతలు, ఇంధనం, ఆరోగ్య సేవలు, ఫార్మాసూటికల్స్, అంతరిక్షం, కీలకమైన ఖనిజాలు, అరుదైన మూలకాలు, సంస్కృతి, పర్యాటకం, వ్యవసాయం, ప్రజా సంబంధాలతో సహా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన అన్ని అంశాలను వారు సమీక్షించారు. భారత్‌లోని ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) ఆధారంగా ఇండోనేషియా ఓపెన్ నెట్వర్క్ (ఐవోఎన్) ప్రారంభం కావడాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు. 2027 నాటికి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇండోనేషియాలో పర్యటించి వందేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఠాగూర్–దేవంతర సాంస్కృతిక, విద్యా దౌత్య సంవత్సరాన్ని రెండు దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తాయని ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు.

ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి సంయుక్త ప్రకటన నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రకటన

July 07th, 11:21 am

మన మధ్య 2018లో ఏర్పడిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం నేడు నూతన శిఖరాలకు చేరుకుంటోంది. అభివృద్ధి, భద్రత, సాంకేతికత, సంస్కృతి, విద్యతో సహా ప్రతి సహకార రంగంలోనూ గణనీయమైన పురోగతిని సాధిస్తున్నాం.

16వ భారత్-జపాన్ వార్షిక సదస్సు కోసం జపాన్‌లో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా వెలువడిన నిర్ణయాలు

July 02nd, 10:39 pm

సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు, ఏఐతో కూడిన సమాచార, కమ్యూనికేషన్ సాంకేతికత, స్వచ్ఛ సాంకేతికత, ఔషధాలు వంటి కీలక రంగాల్లో ఉమ్మడి దృఢత్వాన్ని పెంపొందించడం కోసం ప్రాజెక్ట్ ఆధారిత సహకారాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. ఈ కీలక రంగంలో పెరుగుతున్న భారత్-జపాన్ జీటూజీ (ప్రభుత్వాల మధ్య), బీటూబీ (వ్యాపారాల మధ్య) భాగస్వామ్యాన్ని 'ఇండియా-జపాన్ ఫ్యాక్ట్ షీట్ 2.0' స్పష్టంగా తెలియజేస్తుంది.

ఇండియా-జపాన్ 16వ వార్షిక సదస్సు సందర్భంగా సంయుక్త ప్రకటన

July 02nd, 10:22 pm

జూలై 1 నుంచి 3, 2026 వరకు జరిగే ఇండియా-జపాన్ 16వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు జపాన్ ప్రధానమంత్రి గౌరవ శ్రీమతి తకాయిచి సనాయె భారత్‌కు విచ్చేశారు. ప్రధానమంత్రి తకాయిచితో పాటు ఉన్నతాధికారులు, సీఈఓలు, పరిశ్రమల ప్రముఖులతో పాటు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత్ పర్యటనకు వచ్చింది. ప్రధానమంత్రి తకాయిచి భారతదేశంలో అధికారికంగా పర్యటించటం ఇదే తొలిసారి.

భారత్ - జపాన్ వాణిజ్య ఫోరంను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

July 02nd, 03:35 pm

కొద్దిసేపటి క్రితమే, హర్యానాలోని ఖార్ఖోడాలో మారుతి సుజుకి నూతన తయారీ కర్మాగారాన్ని మేం ప్రారంభించాం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుజుకి కార్లలో దాదాపు మూడింట రెండు వంతులు భారతదేశంలోనే తయారవుతున్నాయి. అవి 100 పైగా దేశాలకు ఎగుమతి కూడా అవుతున్నాయి.

వైద్యుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

July 01st, 12:22 pm

ఇవాళ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. దేశానికి వారు చేస్తున్న సేవలు, చూపుతున్న కరుణ, నిబద్ధతకు కృతజ్ఞతలు తెలిపారు.

మారిషస్ ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి

June 28th, 08:45 pm

మారిషస్ ప్రధాని డాక్టర్ నవీన్ చంద్ర రామ్‌గూలం‌తో మహేలోని విక్టోరియాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. సీషెల్స్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల నేపథ్యంలో నాయకులు భేటీ అయ్యారు. 2024 నవంబరులో ప్రధానిగా రామ్‌గూలం బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన ప్రధానమంత్రి మోదీతో సమావేశం కావడం ఇది నాలుగోసారి.

సీషెల్స్‌ అధ్యక్షుడితో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన

June 28th, 02:02 pm

అలాగే, “గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్” పురస్కార ప్రదానం నాతోపాటు 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవంగా పరిగణిస్తూ, మా దేశవాసులందరి తరఫున హర్షం ప్రకటిస్తున్నాను. ఈ సత్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తూ- వాతావరణ మార్పు సమస్యలను ఎదుర్కొంటున్న, పర్యావరణ పరిరక్షణను భావితరాల కోసం తమ కర్తవ్యంగా భావిస్తున్న దేశాలన్నింటికీ సగౌరవంగా అంకితం చేస్తున్నాను.