Fulfilling public aspirations is the core objective of this budget and the resolution of this government: PM Modi

March 09th, 10:30 am

PM Modi addressed the post-budget webinars today, focusing on the theme “Sabka Saath Sabka Vikas-Fulfilling Aspirations of People”. In his remarks, the PM highlighted India’s prowess in the past decade in health, education, sports and tourism. He emphasised the importance of synergy between various stakeholders to accelerate national progress and solidify the foundation of a Viksit Bharat.

PM Modi addresses Post Budget Webinar on the theme “Sabka Saath Sabka Vikas-Fulfilling Aspirations of People”

March 09th, 10:15 am

PM Modi addressed the post-budget webinars today, focusing on the theme “Sabka Saath Sabka Vikas-Fulfilling Aspirations of People”. In his remarks, the PM highlighted India’s prowess in the past decade in health, education, sports and tourism. He emphasised the importance of synergy between various stakeholders to accelerate national progress and solidify the foundation of a Viksit Bharat.

ప్రధానమంత్రి మలేషియా పర్యటన సందర్భంగా ఒప్పందాలు, ప్రకటనలు

February 08th, 11:05 am

భారత్ - మలేషియా ప్రభుత్వాల మధ్య ఆడియో - విజువల్ సహనిర్మాణ ఒప్పందం

మలేషియా ప్రధానితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా భారత ప్రధాని ప్రకటన

February 08th, 08:35 am

ముందుగా నాకు ఆత్మీయంగా స్వాగతం పలికిన నా ఆప్తమిత్రుడు, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గతేడాది ఆసియాన్ సదస్సు సందర్భంగా మలేషియాను సందర్శించలేకపోయాను. కానీ వీలైనంత తొందరలోనే మలేషియాకు వస్తానని నా ప్రియమిత్రుడికి అప్పట్లో మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం.. 2026లో నా తొలి విదేశీ పర్యటనలో భాగంగా ఈ రోజు మలేషియాలో ఉన్నాను.

మలేషియాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధికారిక పర్యటన సందర్భంగా విడుదల చేసిన భారత్, మలేషియా ఉమ్మడి ప్రకటన

February 08th, 08:30 am

మలేషియా ప్రధానమంత్రి శ్రీ దాతో సెరీ అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 7 నుంచి 8 వరకు మలేషియాలో అధికారిక పర్యటన చేపట్టారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య శతాబ్దాల నాటి నాగరికత సంబంధాలపై ఆధారపడిన ఉన్న లోతైన స్నేహం, సుదీర్ఘ ప్రజల మధ్య బంధాలను తెలియజేసింది. భారత్-మలేషియా 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని' మరింత పటిష్ఠం చేయటం, విస్తరించడానికి ఇరు దేశాల నాయకులకు ఉన్న ఉమ్మడి నిబద్ధతను ఈ పర్యటన పునరుద్ఘాటించింది.

ఇథియోపియా ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు చేపట్టిన ప్రధానమంత్రి

December 17th, 12:02 am

పరిమిత, ప్రతినిధి స్థాయి విధానాల్లో జరిగిన చర్చల్లో వారు పాల్గొన్నారు. శతాబ్దాల నాటి నాగరికత పునాదులపై ఏర్పడి, ప్రజాసంబంధాలతో బలోపేతమైన ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించారు. వీటికి ప్రాధాన్యమిస్తూ.. భారత్-ఇథియోపియా సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచడానికి నాయకులిద్దరూ అంగీకరించారు. గ్లోబల్ సౌత్ భాగస్వాములుగా సమ్మిళిత ప్రపంచాన్ని నిర్మించడానికి రెండు దేశాల కృషిని కొనసాగించాలని నిర్ణయించారు. 2023లో జీ20కి అధ్యక్షత వహిస్తున్న సమయంలో ఆఫ్రికన్ యూనియన్‌కు ఈ కూటమిలో సభ్యత్వం ఇవ్వడం భారతదేశానికి దక్కిన గౌరవమని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో భారత్‌కు సంఘీభావం ప్రకటించడంతో పాటు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం సాగిస్తున్న పోరాటాన్ని బలోపేతం చేసిన ఇథియోపియాకు కృతజ్ఞతలు తెలియజేశారు.

పర్యావరణం, కాప్-30లతో పాటు ప్రపంచ ఆరోగ్యం అంశాలపై బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సు.. ప్రసంగించిన ప్రధానమంత్రి

July 07th, 11:38 pm

పర్యావరణం, కాప్-30, ప్రపంచ ఆరోగ్యసంరక్షణ’’ అంశాలపై సోమవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలతో పాటు పాలుపంచుకోవాల్సిందంటూ ఆహ్వానాన్ని అందుకున్న దేశాలు కూడా పాల్గొన్నాయి. ప్రపంచ భవిష్యత్తును పరిగణనలోకి తీసుకొని ఇలాంటి అధిక ప్రాధాన్యం కలిగిన అంశాలపై కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు బ్రెజిల్‌కు ఆయన తన ధన్యవాదాలు తెలిపారు. వాతావరణ మార్పును ఇంధన సమస్యల పరిష్కారం అనే ఒకే అంశంతో ముడిపెట్టి చూడడం భారతదేశం దృక్పథం కాదని, జీవనానికి ప్రకృతికి మధ్య సమతూకాన్ని ప్రభావితం చేసే అంశం ఇదని తమ దేశం భావిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. వాతావరణ పరంగా న్యాయాన్ని ఏర్పరచడం అంటే అది ఒక నైతిక బాధ్యత అని, దీనిని తప్పక నిర్వర్తించాల్సిందేనని భారత్ సంకల్పించిందని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. పర్యావరణ సంరక్షణ దిశలో కార్యాచరణను చేపట్టడానికి భారత్ ఎంతో చిత్తశుద్ధితో ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ప్రజానుకూల, భూగ్రహానికి మిత్రపూర్వక ప్రగతిసాధక విధానాలను ప్రోత్సహించడానికి తీసుకొంటున్న వివిధ కార్యక్రమాలను గురించి ఆయన సమగ్రంగా సభకు వివరించారు. ఈ సందర్భంగా మిషన్ లైఫ్ (పర్యావరణ అనుకూల జీవనం), 'ఏక్ పేడ్ మా కే నామ్' (తల్లి పేరు మీద ఒక మొక్కను నాటడం), అంతర్జాతీయ సౌరశక్తి కూటమి, సమర్థవంతమైన విపత్తు సన్నద్ధ కూటమి (కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రేజీలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్), హరిత హైడ్రోజన్ మిషన్, ప్రపంచ జీవ ఇంధన వేదిక, పులుల సంరక్షణ కూటమి (బిగ్ క్యాట్స్ అలయన్స్) తదితర కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.

పర్యావరణం, కాప్-30, ప్రపంచ ఆరోగ్య అంశాలపై ఏర్పాటైన బ్రిక్స్ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

July 07th, 11:13 pm

బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతాల్లో భాగంగా పర్యావరణ, ఆరోగ్య భద్రత అంశాలకు బ్రెజిల్ అత్యధిక ప్రాధాన్యతనివ్వడం నాకు సంతోషం కలిగిస్తోంది. ఇవి పరస్పర సంబంధం గల అంశాలే కాక మానవాళి సంక్షేమానికి, ఉజ్జ్వల భవిష్యత్తుకూ ఎంతో ముఖ్యమైనవి.