వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇండియా చిప్ లిమిటెడ్ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం
February 21st, 05:30 pm
అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యంతో భారత్ అత్యంత వేగంగా పని చేస్తోంది. ఆగేందుకు లేదా విశ్రమించేందుకు భారతదేశానికి సమయం లేదని నేను ఎర్రకోట నుంచి చెప్పాను. 2026 ప్రారంభం నుంచి భారత్ తన వేగాన్ని మరింత పెంచింది. జనవరి 12న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌లో లక్షలాది దేశ యువత పాల్గొన్నారు. దేశంలో అంకుర సంస్థల విప్లవానికి నూతన ఉత్సాహాన్ని జోడిస్తూ జనవరి 16న మనం జాతీయ అంకుర సంస్థల దినోత్సవం నిర్వహించుకున్నాం. ఇదే జనవరిలో నిర్వహించిన ఇండియా ఎనర్జీ సదస్సు ద్వారా తన సామర్థ్యంతో ప్రపంచం దృష్టిని భారత్ ఆకర్షించింది. ఆ తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ వికసిత్ భారత్‌కు కొత్త వేగాన్ని అందించింది. ఈ వారం కూడా భారత్‌కు చరిత్రాత్మకమైనదే. ప్రపంచంలో అనేక దేశాల అధినేతలు, సాంకేతిక ప్రపంచంలో దిగ్గజాలు అందరూ ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొన్నారు. భారతదేశ ఏఐ సామర్థ్యాన్ని ఈ సదస్సు ద్వారా ప్రపంచం చూసింది. మన దార్శనికతను అర్థం చేసుకొని, ప్రశంసించింది.ఉత్తరప్రదేశ్‌లోని హెచ్‌సిఎల్-ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో వీడియో అనుసంధానం ద్వారా పాల్గొన్న ప్రధానమంత్రి
February 21st, 05:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని హెచ్‌సిఎల్-ఫాక్స్‌కాన్ సెమీకండక్టర్ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో వీడియో అనుసంధానం ద్వారా పాల్గొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సదస్సు తర్వాత, ప్రపంచ సెమీకండక్టర్ కేంద్రంగా మారే దిశగా ముందుకు సాగుతున్న భారత్ ప్రయాణంలో ఈ కార్యక్రమం ఒక చరిత్రాత్మక విజయాన్ని సూచిస్తుంది.ఫిబ్రవరి 21న హెచ్‌సీఎల్ - ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని
February 20th, 06:50 pm
ఉత్తరప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌వే పారిశ్రామిక అభివృద్ధి అథారిటీ (వైఈఐడీఏ)లో హెచ్‌సీఎల్ - ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచర్ ప్రాజెక్టు ఇండియా చిప్ కంపెనీ భూమిపూజ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. 2026 ఫిబ్రవరి 21న సాయంత్రం 5 గంటల సమయంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఏఐ) రంగంలో పనిచేస్తున్న సీఈఓలు, నిపుణులతో ప్రధానమంత్రి సమావేశం
January 29th, 06:33 pm
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏఐ) రంగ నిపుణులు, సీఈఓలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలోని తమ లోక్ కళ్యాణ్ మార్గ్ నివాసంలోముచ్చటించారు. వచ్చే నెలలో (ఫిబ్రవరి 2026) జరగనున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.ఉత్తర్‌ప్రదేశ్‌లో సెమీకండక్టర్ యూనిట్ కు మంత్రిమండలి ఆమోదం
May 14th, 03:06 pm
భారత్ సెమీకండక్టర్ మిషన్‌లో భాగంగా మరో సెమీకండక్టర్ యూనిటును ఏర్పాటు చేయడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలిపింది.