గుజరాత్‌లోని హజీరాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను సందర్శించిన ప్రధానమంత్రి
June 05th, 10:08 pm
గుజరాత్‌లోని హజీరాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శించారు. ‘భారత్‌లో తయారీ’ కార్యక్రమం కింద రక్షణ రంగంలో దేశం సాధిస్తున్న అభివృద్ధి, పెరుగుతున్న సామర్థ్యాలను ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు.Prime Minister visits L&T complex at Hazira, Gujarat
June 05th, 08:10 pm
PM Modi visited the Larsen & Toubro (L&T) complex in Hazira, Gujarat, where he witnessed pioneering innovations being developed across multiple sectors. During the visit, he appreciated the company’s significant contribution towards strengthening India’s self-reliance in the defence sector.గుజరాత్‌లోని సూరత్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 05th, 04:30 pm
విశేష ప్రజాదరణ గల గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ సి.ఆర్.పాటిల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ భాయ్ హర్ష్ సంఘ్వి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జగదీష్ విశ్వకర్మ, ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు సహా నా ప్రియమైన సూరత్ నగర సోదరీసోదరులారా!గుజరాత్‌లోని సూరత్‌లో ₹18,800 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. దేశానికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 05th, 04:16 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లోని సూరత్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు దేశానికి అంకితం.. శంకుస్థాపన చేశారు. అనంతరం భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ- తమకు అకుంఠిత మద్దతునిచ్చిన గుజరాత్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నేను తొలిసారి సూరత్ వచ్చాను. ఈ గడ్డమీది నుంచి యావత్ రాష్ట్ర ప్రజలకు శిరసాభివందనం చేస్తూ అభినందనలు తెలుపుతున్నాను” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.జూన్ 5న సూరత్, దమన్‌లలో ప్రధానమంత్రి పర్యటన
June 04th, 10:03 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 26న గుజరాత్, దమన్‌లలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం సుమారు రెండున్నర గంటలకు, ప్రధానమంత్రి సూరత్ జిల్లా హజీరాలో పర్యటించి, అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక కార్యకలాపాలతో పాటు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్ని సమీక్షిస్తారు. సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు, సూరత్‌లో సుమారు రూ.18,800 కోట్ల ఖర్చుతో పూర్తి చేసిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, దేశ ప్రజలకు అంకితమివ్వడంతో పాటు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్బంగా జన సమూహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.అహమదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ కు, సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టు కు భూమి పూజ చేసిన ప్రధాన మంత్రి
January 18th, 10:30 am
అహమదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ కు, సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా భూమి పూజ ను నిర్వహించారు. ఈ సందర్భం లో గుజరాత్ గవర్నర్, కేంద్ర హోమ్ మంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి లతో పాటు కేంద్ర గృహ నిర్మాణం & పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి కూడా హాజరయ్యారు.అహమదాబాద్ మెట్రో ప్రాజెక్టు తాలూకు ఫేజ్- 2, సూరత్ మెట్రో ప్రాజెక్టు ల భూమి పూజ సందర్బం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 18th, 10:30 am
గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ గారు, కేంద్ర మంత్రిమండలి లో నా సహచరులు అమిత్ శాహ్ గారు, హర్ దీప్ సింగ్ పురీ గారు, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ గారు, గుజరాత్ ప్రభుత్వ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అహమదాబాద్ కు, సూరత్ కు చెందిన నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా, నమస్కారం.హజీరా వద్ద రో-పాక్స్ టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
November 08th, 10:51 am
ఏదైనా ఒక ప్రాజెక్టు ప్రారంభం అవడం ద్వారా ఆ ప్రాంతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (వ్యాపారానుకూల వాతావరణం), ఈజ్ ఆఫ్ లివింగ్ (ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటం)లో ఎలాంటి సానుకూల మార్పు వస్తుందో చెప్పడానికి ఈ ప్రాజెక్టు ఓ చక్కటి ఉదాహరణ. ఇప్పుడే నాకు నలుగురైదుగురు సోదరులు, సోదరీమణులతో మాట్లాడేందుకు అవకాశం లభించింది. తీర్థయాత్రల విషయంలో, వారి వాహనాలకు తక్కువ నష్టం జరగడం, తక్కువ సమయంలో ప్రయాణం పూర్తవడం, వ్యవసాయ ఉత్పత్తి పెరగడం, వ్యవసాయంలో నష్టాన్ని తగ్గించడం, స్వచ్ఛమైన పళ్లు, కూరగాయల ఉత్పత్తి.. సూరత్ మార్కెట్‌కు తరలించడం వంటి సౌకర్యాలను వారు నాతో పంచుకున్నారు. దీని వల్ల వ్యాపార సౌలభ్యం పెరగడంతోపాటు పనుల్లో వేగం పెరుగుతుంది. మొత్తంమీద సంతోషకర వాతావరణం ఏర్పుడుతుందని నేను విశ్వసిస్తున్నాను. వ్యాపారులు, చిరువ్యాపారులు, ఉద్యోగులు, కూలీలు, రైతులు, విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరూ ఈ అద్భుతమైన అనుసంధానతతో లబ్ధి పొందబోతున్నారు. మనవారి మధ్య దూరం తగ్గుతున్నకొద్దీ మనస్సు సంతృప్తి లభిస్తుంది.హజారియా ఆర్.ఒ. -పాక్స్ టెర్మినల్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి.
November 08th, 10:50 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ హజారియాలో ఆర్ఒ-పాక్స్ టెర్మినల్‌ను, హజారియా,- గుజరాత్‌లోని ఘోఘా మధ్య ఆర్ ఒ -పాక్స్ ఫెర్రి సర్వీసును జెండా ఊపి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికంగా ఈ సేవలను ఉపయోగించుకునే వారితో మాట్లాడారు. షిప్పింగ్ మంత్రిత్వశాఖను మినిస్ట్రీ ఆఫ్ పొర్ట్స్, షిప్పింగ్, వాటర్‌వేస్‌గా మార్పు చేశారు.హజీరా లో రో-పాక్స్ టర్మినల్ ను ఈ నెల 8న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి; హజీరా, ఘోఘా ల మధ్య రో-పాక్స్ ఫెరీ సేవకు ఆయన పచ్చజెండాను చూపి ప్రారంభిస్తారు
November 06th, 03:41 pm
హజీరా లో ప్రారంభిస్తున్న రో-పాక్స్ టర్మినల్ 100 మీటర్ల పొడవుతో, 40 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. దీని నిర్మాణానికి సుమారుగా 25 కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. పరిపాలన కార్యలయ భవనం, వాహనాలను నిలిపి ఉంచేందుకు స్థలం, సబ్ స్టేశన్, వాటర్ టవర్ మొదలైన విస్తృత శ్రేణి సౌకర్యాలు ఈ టర్మినల్ లో ఉంటాయి.వైబ్రంట్ గుజరాత్ సమిట్ 2019 కోసం రేపు గుజరాత్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
January 16th, 08:03 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు- అనగా, 2019 వ సంవత్సరం జనవరి 17వ తేదీ- మొదలుకొని మూడు రోజుల పాటు గుజరాత్ లో పర్యటించనున్నారు. ఈ కాలం లో ఆయన గాంధీనగర్ ను, అహమదాబాద్ ను మరియు హజీరా ను సందర్శిస్తారు.