సైన్యంలో చిరకాలం పనిచేసిన అనుభవజ్ఞుడు విశ్రాంత హవల్దార్ బల్‌దేవ్ సింగ్ మృతికి ప్రధానమంత్రి సంతాపం

January 08th, 10:45 pm

సైన్యంలో దీర్ఘకాలం పాటు పనిచేసి, పదవీవిరమణ పొందిన హవల్దార్ బల్‌దేవ్ సింగ్ మృతికి ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. దేశానికి బల్‌దేవ్ సింగ్ చేసిన స్మరణీయ సేవలను రాబోయే కాలాల్లోనూ ప్రజలు గుర్తుపెట్టుకొంటారని ప్రధాని అన్నారు. బల్‌దేవ్ సింగ్ సాహసానికీ, దృఢత్వానికీ సిసలైన ప్రతీకగా నిలిచారు, దేశం పట్ల ఆయనకున్న అచంచల అంకితభావం భావి తరాలకు సైతం ప్రేరణనిస్తూ ఉంటుందని శ్రీ మోదీ అన్నారు.