కర్ణాటకలోని హసన్‌లో ప్రమాదం వల్ల ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం
September 13th, 08:36 am
కర్ణాటక రాష్ట్రం హసన్‌లో సంభవించిన ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి తలా రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున పరిహారం అందజేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.