రాజ్యసభలో ప్రధాని ప్రసంగం
April 17th, 11:10 am
సభ తరఫునా, నా తరఫునా శ్రీ హరివంశ్ గారికి అభినందనలు, శుభాకాంక్షలు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా వరుసగా మూడోసారి ఎన్నికవడమే సభకు మీపై ఉన్న ప్రగాఢమైన విశ్వాసానికి నిదర్శనం. నిజానికి మీ అనుభవం ద్వారా గతంలో పొందిన ప్రయోజనాలకూ, అందరినీ కలుపుకొనిపోయిన మీ కృషికీ సభ ఈ విధంగా ఆమోదముద్ర వేసింది. అనుభవానికి, సహజమైన పనితీరుకు దక్కిన గౌరవమిది. ఆ సహజమైన పనిశైలికి ఇది ఆమోదం కూడా. హరివంశ్ గారి నేతృత్వంలో ఎంత ప్రభావవంతంగా సభ బలోపేతమైందో మనమంతా చూశాం. ఆయన సభ కార్యకలాపాలను నిర్వహించడమే కాదు.. తన జీవితానుభవాన్ని నిశితంగా ఉపయోగిస్తూ సభ గౌరవాన్ని ఇనుమడింపజేశారు. సభా వ్యవహారాలన్నింటా, నిర్వహణలో, సభ వాతావరణంలో పరిణతిని పెంచడంలో ఆయన అనుభవం ఎంతగానో తోడ్పడింది. డిప్యూటీ చైర్మన్ ఈ కొత్త పదవీకాలం కూడా అదే స్ఫూర్తితో, సమతౌల్యంతో, నిబద్ధతతో సాగుతుందన్న దృఢమైన విశ్వాసం నాకుంది. మనందరి కృషితో సభ గౌరవం మరింత ఇనుమడిస్తుందని ఆశిస్తున్నాను.రాజ్యసభను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
April 17th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాజ్యసభను ఉద్దేశించి ప్రసంగించారు. వరుసగా మూడోసారి రాజ్యసభకు డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించిన శ్రీ హరివంశ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. దీనిని చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఇది శ్రీ హరివంశ్‌పై సభకున్న విశ్వాసాన్ని, ఈ సభకు ఆయన తీసుకొచ్చిన విలువైన అనుభవాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ‘‘వరుసగా మూడోసారి ఎన్నిక కావడం.. ఆయన అనుభవానికి, సమ్మిళిత దృక్పథానికి, ఆయన పనితీరుకు సభ వేసిన ఆమోద ముద్ర’’ అని శ్రీ మోదీ తెలిపారు.రాజ్యసభకు శ్రీ హరివంశ్… శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
April 10th, 02:20 pm
శ్రీ హరివంశ్ ను గౌరవ రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసిన నేపథ్యంలో... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన భావి పార్లమెంటరీ పదవీకాలం ఫలప్రదం కావాలని ప్రధాని అభిలషించారు.ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో ప్రధాని వీడియో సందేశం
January 27th, 04:00 pm
లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే గారు, శాసనసభ స్పీకర్ రాహుల్ నర్వేకర్ గారు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీల ప్రిసైడింగ్ అధికారులు.ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
January 27th, 03:30 pm
75వ గణతంత్ర దినోత్సవ వేడుకల నేపధ్యంలో జరుగుతున్న ఈ సదస్సు ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి, “మన రాజ్యాంగం యొక్క 75వ సంవత్సరాన్ని పురస్కరించుకుని 75వ గణతంత్ర దినోత్సవం ముగిసిన వెంటనే ఈ సదస్సు జరగడం వల్ల ఈ సదస్సుకు అదనపు ప్రాముఖ్యత ఉంది” అని అన్నారు. రాజ్యాంగ పరిషత్ సభ్యులకు నివాళులర్పిస్తూ ప్రధాని మోదీ అన్నారు.రాజ్య సభ డిప్యూటీ చైర్ మన్ గా శ్రీ హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నిక కావడం పై ప్రధాన మంత్రి ప్రతిస్పందన
September 14th, 05:49 pm
శ్రీ హరివంశ్ జీ ఈ సభ కు డిప్యూటీ చైర్ మన్ గా రెండో సారి ఎన్నికైనందుకు యావత్తు సభ పక్షాన, దేశ ప్రజలందరి తరఫున శ్రీ హరివంశ్ గారిని నేను అభినందిస్తున్నాను.రాజ్య సభ ఉపాధ్యక్షుడు శ్రీ హరివంశ్ నారయణ్ సింగ్ ఎన్నిక కావడం పైప్రధాన మంత్రి ప్రతిస్పందన
September 14th, 05:48 pm
శ్రీ హరివంశ్ గారు ఈ సభ కు ఉపాధ్యక్షుని గా రెండోసారి ఎన్నికైనందుకు యావత్తు సభ తరఫున, దేశ ప్రజలందరి తరఫున ఆయన కు అభినందనలు తెలియజేస్తున్నాను అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు..రాజ్య సభ ఉప సభాపతి గా ఎన్నికైన శ్రీ హరివంశ్ ను అభినందిస్తూ రాజ్య సభ లో ప్రధాన మంత్రి ప్రసంగం
August 09th, 11:59 am
ముందుగా, నూతన ఉప సభాపతి గా ఎన్నికైన శ్రీమాన్ హరివంశ్ గారికి యావత్తు సభ తరఫునా, నా తరఫునా అభినందనలు తెలియజేస్తున్నాను. అరుణ్ గారు కూడా కోలుకొని ఈ రోజున మన అందరి మధ్య కు రావడం మనమందరం సంతోషించవలసినటువంటి విషయం. ఈ రోజు ఆగస్టు 9వ తేదీ. స్వాతంత్య్రోద్యమం లో ఆగస్టు విప్లవం ఒక ముఖ్యమైన మైలు రాయి; ఇందులో బలియా జిల్లా ఒక ప్రముఖ పాత్ర ను పోషించింది.రాజ్య సభ డిప్యూటీ చైర్ మన్ గా శ్రీ హరివంశ్ ఎన్నిక సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం
August 09th, 11:58 am
రాజ్య సభ డిప్యూటీ చైర్ మన్ గా శ్రీ హరివంశ్ ఎన్నిక కావడం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు ఈ రోజు అభినందనలు తెలిపారు.