ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయిలో గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

April 29th, 11:35 am

ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గారు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య గారు, బ్రజేష్ పాఠక్ గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు జితిన్ ప్రసాద గారు, పంకజ్ చౌదరి గారు, యూపీ ప్రభుత్వ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఇక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసిన నా ప్రియమైన సోదరసోదరీలారా!

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయిలో సరికొత్త 594 కిలోమీటర్ల పొడవైన ప్రవేశ నియంత్రిత గంగా ఎక్స్‌ప్రెస్‌ రహదారిని ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

April 29th, 11:30 am

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయిలో కొత్తగా నిర్మిస్తున్న 594 కిలోమీటర్ల పొడవైన ప్రవేశ నియంత్రిత గంగా ఎక్స్‌ప్రెస్ రహదారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. నరసింహ పుణ్యక్షేత్రానికి, కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ప్రవహిస్తున్న గంగామాత దివ్య సన్నిధికి నమస్కరిస్తూ ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ ప్రాంతమంతా గంగామాత ఆధ్యాత్మిక శోభతో, మాతృత్వాన్ని పంచే జీవధారతో పునీతమైన పుణ్యక్షేత్రమని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఈ ఎక్స్‌ప్రెస్‌ రహదారి ఉత్తరప్రదేశ్‌కు లభించిన వరం. సాక్షాత్తు గంగామాత ఆశీర్వాదమే ఇది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ రహదారి ద్వారా పవిత్ర పుణ్యక్షేత్రాలకు చేరుకునే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, కొన్ని గంటల్లోనే అక్కడికి చేరుకోవచ్చని వివరించారు.

ఈ నెల 28-29 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లో ప్రధానమంత్రి పర్యటన

April 26th, 03:46 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 28-29 తేదీల్లో ఉత్తర ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 28 సాయంత్రం సుమారు 5 గంటలకు వారణాసిలో జరిగే మహిళా సమ్మేళనంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. అక్కడ ఆయన సుమారు రూ. 6,350 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభనుద్దేశించి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు.

ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనమిక్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

April 14th, 01:25 pm

ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీ గుర్మీత్ సింగ్, కార్యశీలుడైన ప్రజాదరణగల యువ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ నితిన్ గడ్కరీ, శ్రీ అజయ్ టమ్టా, సాంకేతిక మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు శ్రీ మహేంద్ర భట్ సహా వేదికను అలంకరించిన మాజీ గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోష్యారీ, మాజీ ముఖ్యమంత్రులైన సోదరులు శ్రీ రమేష్ పోఖ్రియాల్, శ్రీ విజయ్ బహుగుణ, శ్రీ తీరథ్‌ సింగ్ రావత్, శ్రీ త్రివేంద్ర సింగ్ రావత్, ఉత్తరాఖండ్ ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు భారీ సంఖ్యలో హాజరైన నా ప్రియ సోదరీసోదరులందరికీ అభివందనం.

ఢిల్లీ - డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

April 14th, 01:20 pm

ఢిల్లీ - డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఉత్తరాఖండ్, చుట్టుపక్కల ప్రాంత అభివృద్ధిలో కీలక ఘట్టమిది. డెహ్రాడూన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ.. బైశాఖి, బోహాగ్ బిహు, పుతాండు పండుగల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా పండుగ శోభ నెలకొన్న వేళ ఈ ప్రారంభోత్సవం జరుగుతోందన్నారు.

వారణాసిలో నాలుగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం

November 08th, 08:39 am

పరిపాలన దక్షుడైన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు.. కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు, వికసిత భారత నిర్మాణానికి గట్టి పునాదులు వేస్తున్న అద్భుత సాంకేతిక ప్రగతికి సారథ్యం వహిస్తున్న శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారు.. టెక్నాలజీ సాయంతో ఎర్నాకులం నుంచి ఈ కార్యక్రమంలో భాగస్వామి అవుతున్న కేరళ గవర్నర్ శ్రీ రాజేంద్ర అర్లేకర్ గారు.. కేంద్రంలోని నా సహచరులు సురేశ్ గోపీ గారు, జార్జ్ కురియన్ గారు.. కేరళలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు.. కేంద్రంలో నా సహచరుడు, పంజాబ్ నాయకుడు, ఫిరోజ్‌పూర్ నుంచి కార్యక్రమంలో పాల్గొంటున్న రవ్నీత్ సింగ్ బిట్టు గారు, అక్కడి ప్రజా ప్రతినిధులు.. లక్నో నుంచి పాల్గొంటున్న ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్ గారు.. ఇతర విశిష్ట అతిథులు.. కాశీలో ఉన్న నా కుటుంబ సభ్యులారా!

వారణాసిలో నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 08th, 08:15 am

భారతదేశ ఆధునిక రైలు మౌలిక సదుపాయాల విస్తరణలో మరో ముందడుగు పడింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధానమంత్రి ప్రముఖులందరికీ స్వాగతం పలికారు. విశ్వనాథుని పవిత్ర నగరమైన వారణాసి స్థానిక కుటుంబాలందరికీ గౌరవ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల దేవ్ దీపావళి సందర్భంగా జరిగిన అసాధారణ వేడుకలను ఆయన గుర్తు చేశారు. ఈ రోజు కూడా ఒక శుభ సందర్భమని పేర్కొన్న ఆయన.. ఈ అభివృద్ధి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

హరిద్వార్‌లో తొక్కిసలాటలో జరిగిన ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని

July 27th, 12:39 pm

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో మానసా దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో తొక్కిసలాట కారణంగా ప్రాణ నష్టం జరగటంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.

మత్స్య సంపదతో ఆదాయం రెట్టింపు చేసుకున్న హరిద్వార్ రైతుకు ప్రధానమంత్రి ప్రశంస

December 27th, 02:34 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా వికసిత భారతం సంకల్ప యాత్ర లబ్ధిదారులతో సంభాషించార. దేశవ్యాప్తంగాగ‌ల‌ వేలాది లబ్ధిదారులతోపాటు కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థ‌ల ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్య‌క్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిద్వార్ నుంచి వచ్చిన లబ్ధిదారులలో గురుదేవ్ సింగ్ ని ‘హర్ హర్ గంగే’ అంటూ ప్రధానమంత్రి పలుకరించారు. అలాగే కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులు కూడా ‘హర్ హర్ గంగే’ నినాదాన్ని ప్రతిధ్వనింపజేస్తూ ప్రధానిని స్వాగతించారు. శ్రీ సింగ్ ఒక రైతు కాగా, వ్యవసాయంతోపాటు చేపల పెంపకం కూడా చేపట్టారు.

పండిట్ మదన్ మోహన్ మాలవీయ రచనల ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం

December 25th, 04:31 pm

కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ అనురాగ్ ఠాకూర్ గారు, అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, నా చిరకాల మిత్రుడు, మహామన సంపూర్ణ వంగమే చీఫ్ ఎడిటర్, మహామన మాలవీయ మిషన్ అధ్యక్షుడు రామ్ బహదూర్ రాయ్ గారు, ప్రభు నారాయణ్ శ్రీవాస్తవ గారు, వేదికపై ఉన్న విశిష్ట వ్యక్తులు, మహిళలు మరియు పెద్దమనుషులు!

పండిట్ మదన్ మోహన్ మాలవీయ 162వ జయంతిని పురస్కరించుకుని, సేకరించిన ఆయన రచనలను ఆవిష్కరించిన ప్రధానమంత్రి

December 25th, 04:30 pm

మహామన పండిట్ మదన్ మోహన్ మాలవీయ 162వ జయంతి సందర్భంగా, ఈరోజు న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో 'కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ పండిట్ మదన్ మోహన్ మాలవ్య' 11 సంపుటాల మొదటి సిరీస్‌ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేశారు. శ్రీ మోదీ, పండిట్ మదన్ మోహన్ మాలవీయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రముఖ వ్యవస్థాపకుడు, పండిట్ మదన్ మోహన్ మాలవీయ ఆధునిక భారతదేశ నిర్మాతలలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించారు. ప్రజలలో జాతీయ చైతన్యాన్ని పెంపొందించడానికి అపారంగా కృషి చేసిన విశిష్ట పండితులు, స్వాతంత్య్ర సమరయోధుడు అని ఆయన గుర్తు చేసుకున్నారు.

డెహ్రాడూన్‌-ఢిల్లీ మధ్య వందే భారత్‌ ఎక్స్’ప్రెస్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగం తెలుగు పాఠం

May 25th, 11:30 am

ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీ గుర్మీత్ సింగ్, ప్రజాదరణగల ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి, రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ సభ్యులు, ఇతర ప్రముఖులుసహా ఉత్తరాఖండ్‌లోని నా ప్రియతమ సోదర సోదరీమణులు…అందరికీ వందనాలు! రాష్ట్రం నుంచి వందే భారత్ ఎక్స్‌’ప్రెస్ రైలు ప్రారంభిస్తున్న సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రజలందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను.

డెహ్రాడూన్ - ఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధానమంత్రి

May 25th, 11:00 am

డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. కొత్తగా విద్యుదీకరణ చేసిన రైలు మార్గాలను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి, ఉత్తరాఖండ్ ను నూరు శాతం విద్యుత్ రైలు మార్గాల (100% ఎలక్ట్రిక్ ట్రాక్షన్) రాష్ట్రంగా ప్రకటించారు.

ఉత్తరాఖండ్ అభివృద్ధికి కృషి చేయడం బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రాధాన్యత: ప్రధాని మోదీ

February 07th, 02:40 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ మరియు డెహ్రాడూన్‌లలో వర్చువల్ విజయ్ సంకల్ప్ సభలో ప్రసంగించారు. వర్చువల్‌గా సభను ఉద్దేశించి ప్రధాని మోదీ ఇలా అన్నారు, “ఉత్తరాఖండ్ మాకు దేవభూమి, కానీ ఈ ప్రజలు ఉత్తరాఖండ్‌ను తమ ఖజానాగా భావిస్తారు. భగవంతుడు రాష్ట్రానికి ఇచ్చిన సహజ సంపదను, వనరులను దోచుకుంటూనే ఉండాలని, తమ జేబులు నింపుకోవాలన్నారు. ఇది వారి మనస్తత్వం. ”

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ మరియు డెహ్రాడూన్‌లలో వర్చువల్ విజయ్ సంకల్ప్ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ

February 07th, 02:39 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ మరియు డెహ్రాడూన్‌లలో వర్చువల్ విజయ్ సంకల్ప్ సభలో ప్రసంగించారు. వర్చువల్‌గా సభను ఉద్దేశించి ప్రధాని మోదీ ఇలా అన్నారు, “ఉత్తరాఖండ్ మాకు దేవభూమి, కానీ ఈ ప్రజలు ఉత్తరాఖండ్‌ను తమ ఖజానాగా భావిస్తారు. భగవంతుడు రాష్ట్రానికి ఇచ్చిన సహజ సంపదను, వనరులను దోచుకుంటూనే ఉండాలని, తమ జేబులు నింపుకోవాలన్నారు. ఇది వారి మనస్తత్వం. ”

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

December 04th, 12:35 pm

ఉత్తరాఖండ్‌లోని గౌరవనీయులైన పెద్దలు, సోదరీమణులు, అక్కాచెల్లెళ్లు, సోదరులు మరియు సోదరీమణులందరికీ నా ప్రణామాలు తెలియజేస్తున్నాను. మీరు కుశలమని ఆశిస్తున్నాను. దయచేసి నా శుభాకాంక్షలను అంగీకరించండి.

డెహ్రాడూన్‌లో దాదాపు 18,000 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన - ప్రధాన మంత్రి

December 04th, 12:34 pm

ఈ ప్రాంతంలో దీర్ఘకాలికంగా నెలకొన్న కొండచరియల సమస్యను పరిష్కరించడం ద్వారా ప్రయాణాన్ని సురక్షితం చేయడంపై దృష్టి సారించే ఏడు ప్రాజెక్టులను; దేవప్రయాగ నుండి శ్రీకోట్ వరకు అదేవిధంగా జాతీయ రహదారి ఎన్.హెచ్-58 పై బ్రహ్మపురి నుంచి కొడియాల వరకు రోడ్డు విస్తరణ ప్రాజెక్టులు; యమునా నదిపై నిర్మించిన 120 మెగా వాట్ల వ్యాసి జల విద్యుత్ ప్రాజెక్టు; డెహ్రాడూన్‌ లో హిమాలయ సాంస్కృతిక కేంద్రం; డెహ్రాడూన్‌లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ పెర్ఫ్యూమరీ అండ్ అరోమా లాబొరేటరీ (సుగంధ మొక్కల కేంద్రం) ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు.

డిసెంబర్4న దేహ్ రాదూన్ లో అనేక పథకాల ను ప్రారంభించడం తో పాటు మరికొన్నిపథకాల కు శంకుస్థాపన కూడా చేయనున్న ప్రధాన మంత్రి; ఈ పథకాల విలువ సుమారు 18,000 కోట్ల రూపాయలు

December 01st, 12:06 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 డిసెంబర్ 4 వ తేదీ న మధ్యాహ్నం ఒంటి గంట వేళ లో దేహ్ రాదూన్ లో పర్యటించనున్నారు. దాదాపు గా 18,000 కోట్ల రూపాయల వ్యయం కలిగిన పలు ప్రాజెక్టుల లో కొన్నిటిని ఆయన ప్రారంభించి మరి కొన్ని ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమైన రహదారుల కు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన ను మెరుగు పరచడం పై ఈ పర్యటన కాలం లో శ్రద్ధ తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టు లు ప్రయాణాన్ని సాఫీ గా, సురక్షితం గా మలచగలవు. అంతేకాదు, ఈ ప్రాంతం లో పర్యటన అవకాశాల ను కూడా పెంచగలవు. ఒకప్పుడు చేరుకోవడం కష్టం అని భావించిన మారుమూల ప్రాంతాల కు సంధానం సౌకర్యాన్ని పెంచాలన్న మంత్రి దృష్టి కోణాని కి అనుగుణం గా ఈ ప్రాజెక్టు లు ఉన్నాయి.

న‌మామి గంగే లో భాగం గా ఉత్త‌రాఖండ్ లో‌ ఆరు పెద్ద ప్రాజెక్టుల ను ప్రారంభించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

September 28th, 05:32 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ రేపటి రోజున అంటే 2020వ సంవత్సరం సెప్టెంబర్ 29 న ఉద‌యం 11 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఉత్త‌రాఖండ్ లో ఆరు పెద్ద ప‌థ‌కాల‌ ను ‘న‌మామి గంగే మిష‌న్’ లో భాగం గా ప్రారంభించ‌నున్నారు.

హ‌రిద్వార్ లో ఉమియా ధామ్ ఆశ్ర‌మం ప్రారంభ సూచ‌కంగా జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా పాల్గొని స‌భికుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన‌ ప్ర‌ధాన మంత్రి

October 05th, 10:01 am

హరిద్వార్ లో ఉమియా ధామ్ ఆశ్ర‌మం ప్రారంభ సూచ‌కంగా ఈ రోజు జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా పాల్గొని, స‌భికుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.