ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయిలో గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

April 29th, 11:35 am

ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గారు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య గారు, బ్రజేష్ పాఠక్ గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు జితిన్ ప్రసాద గారు, పంకజ్ చౌదరి గారు, యూపీ ప్రభుత్వ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఇక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసిన నా ప్రియమైన సోదరసోదరీలారా!

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయిలో సరికొత్త 594 కిలోమీటర్ల పొడవైన ప్రవేశ నియంత్రిత గంగా ఎక్స్‌ప్రెస్‌ రహదారిని ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

April 29th, 11:30 am

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయిలో కొత్తగా నిర్మిస్తున్న 594 కిలోమీటర్ల పొడవైన ప్రవేశ నియంత్రిత గంగా ఎక్స్‌ప్రెస్ రహదారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. నరసింహ పుణ్యక్షేత్రానికి, కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ప్రవహిస్తున్న గంగామాత దివ్య సన్నిధికి నమస్కరిస్తూ ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ ప్రాంతమంతా గంగామాత ఆధ్యాత్మిక శోభతో, మాతృత్వాన్ని పంచే జీవధారతో పునీతమైన పుణ్యక్షేత్రమని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఈ ఎక్స్‌ప్రెస్‌ రహదారి ఉత్తరప్రదేశ్‌కు లభించిన వరం. సాక్షాత్తు గంగామాత ఆశీర్వాదమే ఇది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ రహదారి ద్వారా పవిత్ర పుణ్యక్షేత్రాలకు చేరుకునే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, కొన్ని గంటల్లోనే అక్కడికి చేరుకోవచ్చని వివరించారు.

మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ, డిజిటల్ సెన్సస్ 2027లో పాల్గొని దానిని విజయవంతం చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

April 26th, 11:30 am

ఈ నెల మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో, అణు, పవన విద్యుత్ రంగాలలో భారతదేశం సాధించిన ప్రగతిని ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. భగవాన్ బుద్ధుని బోధనలు, బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం, ప్రకృతి పరిరక్షణ, వెదురు రంగం, ప్రాచీన గ్రంథాలు, గణిత ఒలింపియాడ్ కార్యక్రమం వంటి పలు ముఖ్యమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. కొనసాగుతున్న డిజిటల్ సెన్సస్ ప్రచారం గురించి కూడా ప్రధాని మాట్లాడుతూ, ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

బీహార్ ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజనను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

September 25th, 06:44 pm

బీహార్ రాష్ట్రానికి చెందిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన’ను సెప్టెంబర్ 26న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి బీహార్ వ్యాప్తంగా 75 లక్షలమంది మహిళల బ్యాంకు ఖాతాలలోకి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 7,500 కోట్ల రూపాయల మొత్తాన్ని నేరుగా బదిలీ చేస్తారు.

ఫిబ్రవరి 28న న్యూఢిల్లీలో జరిగే జహాన్-ఎ-ఖుస్రో-2025 సంగీతోత్సవానికి ప్రధానమంత్రి హాజరు

February 27th, 06:30 pm

న్యూఢిల్లీ సుందర్ నర్సరీలో ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 7:30 గంటలకు జరిగే జహాన్-ఎ-ఖుస్రో-2025 సూఫీ సంగీతోత్సవానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరవుతారు.