కర్ణాటకలోని మాండ్యలో శ్రీ గురు భైరవైక్య మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

April 15th, 11:10 am

పరమ పూజ్య జగద్గురు శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ నిర్మలానందనాథ మహాస్వామీజీ, మాజీ ప్రధానమంత్రి హెచ్ డీ దేవెగౌడ గారు, కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ గారు, పరమ పూజ్య జగద్గురు స్వామి పరమాత్మానంద సరస్వతిజీ, కేంద్ర మంత్రులు హెచ్ డీ. కుమారస్వామి గారు, శోభా కరంద్లాజే గారు, కర్ణాటక ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక గారు, రాష్ట్ర మంత్రి ఎన్. చెలువరాయస్వామి గారు, సకల సాధువులందరికీ, ఇతర ప్రముఖులు, ఇక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసిన సోదర సోదరీలందరికీ నమస్కారాలు.

కర్ణాటక మాండ్యలోని శ్రీ క్షేత్ర ఆదిచుంచనగిరిలో శ్రీ గురుభైరవైక్య మందిరాన్ని ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

April 15th, 11:00 am

కర్ణాటకలోని మాండ్య జిల్లా శ్రీ క్షేత్ర ఆదిచుంచనగిరిలో శ్రీ గురు భైరవైక్య మందిరాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసిందన్న ప్రధానమంత్రి... వైభవోపేతంగా శ్రీ గురు భైరవైక్య ఆలయాన్ని ప్రారంభించి, మహోన్నతులైన సాధుసంతులతో సంభాషించే భాగ్యాన్ని తనకిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చారిత్రక జ్వాలాపీఠం వద్ద సమయం గడపడం, అశేషంగా తరలివచ్చిన భక్తులనుద్దేశించి ప్రసంగించడం మాటలకందని బలమైన భావోద్వేగాలను కలిగించాయన్నారు. ‘‘ఈ దైవిక అనుభవాలు శాశ్వతంగా నా స్మృతిపథంలో నిలిచిపోతాయి’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

పూర్వ ప్రధాని శ్రీ హెచ్.డి.దేవెగౌడ ప్రధానమంత్రి సంగ్రహాలయ సందర్శనపై ప్రధానమంత్రి హర్షం

August 03rd, 10:52 pm

పూర్వ ప్రధాని శ్రీ హెచ్.డి.దేవెగౌడ ఇవాళ దేశ రాజధాని న్యూఢిల్లీలోని ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ను సందర్శించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

పూర్వ ప్రధాని శ్రీ హెచ్.డి. దేవె గౌడ తో మాట్లాడిన ప్రధాన మంత్రి

March 31st, 01:46 pm

పూర్వ ప్రధాని శ్రీ హెచ్.డి. దేవె గౌడ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. శ్రీ దేవె గౌడ ఆరోగ్యం ఎలా ఉన్నదీ, అలాగే ఆయ‌న స‌తీమ‌ణి ఆరోగ్యం ఎలా ఉన్నదీ శ్రీ మోదీ ఈ సందర్భం లో అడిగి తెలుసుకున్నారు.