Assam will not only break voting records but also create new victory records: PM Modi

March 30th, 01:30 pm

PM Modi interacted with BJP booth karyakartas across Assam as a part of the ‘Mera Booth, Sabse Mazboot’ programme via NaMo App. He energised booth-level members and reaffirmed that every booth remains the foundation of the party’s strength and electoral success. He hailed the true spirit of Assam, calling it a powerful force driving BJP’s growth in the Northeast.

PM Modi’s interaction with BJP booth Karyakartas from Assam ahead of Assembly Elections

March 30th, 01:00 pm

PM Modi interacted with BJP booth karyakartas across Assam as a part of the ‘Mera Booth, Sabse Mazboot’ programme via NaMo App. He energised booth-level members and reaffirmed that every booth remains the foundation of the party’s strength and electoral success. He hailed the true spirit of Assam, calling it a powerful force driving BJP’s growth in the Northeast.

అస్సాంలోని సిల్చార్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

March 14th, 11:10 am

సంస్కృతి, ధైర్యం, ఉత్సాహం నిండిన బరాక్ లోయ కుటుంబాల మధ్యకు రావడం ఎప్పుడూ ప్రత్యేకమైన అనుభవాన్నిస్తుంది. బరాక్ లోయకు ముఖద్వారంగా సిల్చార్‌ను పిలుస్తారు. చరిత్ర, భాష, సంస్కృతి, వ్యాపారం అన్నీ కలసి ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చాయి. ఇక్కడ బెంగాలీ మాట్లాడతారు. అస్సామీ ప్రతిధ్వనిస్తుంది. ఇతర గిరిజన సంప్రదాయాలు విరాజిల్లుతున్నాయి. ఈ వైవిధ్యాన్ని బలంగా మార్చుకుంటూ, సోదరభావం, సామరస్యంతో ఈ ప్రాంతాన్నంతా మీరు అభివృద్ధి చేస్తున్నారు. ఇది బరాక్ వ్యాలీకున్న అసమానమైన సామర్థ్యం.

అస్సాంలోని సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 14th, 10:45 am

అస్సాంలోని సిల్చార్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ.. సంస్కృతి, చైతన్యానికి నిలయమైన బరాక్ లోయను సందర్శించడం తనకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుందని పేర్కొన్నారు. సిల్చార్ నగరం ఈ లోయకు ఒక ప్రవేశ ద్వారం వంటిదని.. ఇక్కడ చరిత్ర, భాష ఒక ప్రత్యేకమైన ప్రాంతీయ గుర్తింపును తీసుకొచ్చాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. బెంగాలీ, అస్సామీ, గిరిజన సంప్రదాయాలు సామరస్యంతో వర్ధిల్లే ఈ ప్రాంత వైవిధ్యమే దీని అసలైన బలమని శ్రీ మోదీ తెలిపారు. ‘‘బరాక్ లోయ వైవిధ్యమే దాని గొప్ప ఆస్తి. ఇది పౌరుల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.

అస్సాంలోని గువాహటిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

March 13th, 05:30 pm

అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ప్రజాదరణ చూరగొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కేంద్ర క్యాబినెట్లో నా సహ మంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ప్రజాప్రతినిధులు, సాకేంతిక పరిజ్ఞానం సాయంతో దేశం నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన రైతు మిత్రులకు, టీ తోటల్లో పనిచేస్తున్న సోదరీసోదరులకు, ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి హాజరవుతున్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, అందరికీ నా శుభాకాంక్షలు.

అస్సాంలోని గువహటిలో రూ. 19,480 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 13th, 05:00 pm

అస్సాంలోని గువహటిలో దాదాపు రూ. 19,480 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గువహటిలో జరిగిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, నగర ప్రజలకు ప్రధాని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వర్చువల్ గా పాల్గొంటున్న రైతులకు, అలాగే తేయాకు తోటల్లో పనిచేస్తున్న కార్మికులకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రుల ముందు కామాఖ్య మాత పవిత్ర భూమిలో ఉండటం తన అదృష్టమని ప్రధానమంత్రి అన్నారు. నవరాత్రులు ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు, కామాఖ్య మాత పుణ్య భూమిలో మిమ్మల్ని దర్శించుకునే భాగ్యం నాకు కలిగింది అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

అస్సాంలోని కోక్రాఝర్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

March 13th, 03:00 pm

వాతావరణం అనుకూలించని కారణంగా నేను కోక్రాఝర్ రాలేకపోయాను. మీ అందరికీ నా క్షమాపణలు. గువాహటి నుంచి మాత్రమే మీతో మాట్లాడటానికి సాధ్యమవుతోంది. మీ వద్దకు రావడానికి నేను ఢిల్లీ నుంచి బయలుదేరాను. కానీ గువాహటిలో దిగాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచే మిమ్మల్ని చూస్తున్నాను. మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడ నాతో ఉన్న అస్సాం ముఖ్యమంత్రి, సోదరుడు హిమంత బిశ్వ శర్మ, కేంద్ర క్యాబినెట్లో నా సహ మంత్రి సర్బానంద సోనోవాల్, బోడోల్యాండ్ ప్రాంత కౌన్సిల్ ప్రధాన కార్యనిర్వాహక సభ్యుడు హగ్రామా మోహిలారీ, అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, అస్సాం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీటీసీ ప్రతినిధులందరూ, సొసైటీలోని సీనియర్ సభ్యులు, నా ప్రియమైన సోదరీసోదరులారా!

అస్సాంలోని కోక్రాఝర్‌లో రూ. 4,750 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

March 13th, 02:30 pm

అస్సాంలోని కోక్రాఝర్‌లో వివిధ అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల తాను స్వయంగా కోక్రాఝర్‌కు రాలేకపోయానన్న ఆయన.. పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చిన ప్రజలు పెద్దమనసుతో తనను మన్నించాలని కోరారు. గువహటి నుంచి తాను ప్రసంగిస్తున్నానని ప్రధానమంత్రి చెప్పారు. ఇక్కడి భూమి పుత్రులైన బోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మ, రూపనాథ్ బ్రహ్మ వంటి మహనీయులను స్మరిస్తూ, వారికి నివాళి అర్పించారు. ఇక్కడికి తరలివచ్చిన అశేష జనవాహిని తన బాధ్యతను మరింత పెంచిందని.. అంకితభావంతో కూడిన సేవ, ఈ ప్రాంత అభివృద్ధి ద్వారా ఆ రుణం తీర్చుకుంటానని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ‘‘మీకే సేవలందించడం ద్వారా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఈ రుణాన్ని తీర్చుకునేందుకు నేనెప్పుడూ కృషి చేస్తాను’’ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

మార్చి 13-14 తేదీల్లో ప్రధానమంత్రి అస్సాం పర్యటన

March 12th, 05:33 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 మార్చి 13-14 తేదీల్లో అస్సాం రాష్ట్రంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కొక్రాఝర్, గువహటి, సిల్చార్ ప్రాంతాలలో రూ. 47,600 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, భూమి పూజ, రైళ్ల ప్రారంభోత్సవం చేస్తారు.

అస్సాంలోని గౌహతిలో కుమార భాస్కర వర్మ సేతును ప్రారంభించిన ప్రధానమంత్రి

February 14th, 07:20 pm

అస్సాంలోని గౌహతిలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన కుమార భాస్కర వర్మ సేతును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు. గౌహతితో పాటు పరిసర ప్రాంతాలకు ఈ వంతెన అత్యంత కీలకమైన మౌలిక సదుపాయమని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ వంతెన ద్వారా రవాణా, ప్రయాణ సౌలభ్యం, వాణిజ్యం గణనీయంగా మెరుగుపడటమే కాక, కామాఖ్య దేవాలయానికి భక్తులు మరింత సులభంగా చేరుకోవటానికి వీలవుతుంది అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

Congress wants to push Assam back into instability and infiltration: PM Modi in Guwahati

February 14th, 03:00 pm

PM Modi addressed a massive public rally in Guwahati, where he said the recent Union Budget has further strengthened the vision of the BJP-NDA for the development of Assam and the North East. Calling the North East “Ashtalakshmi,” he said the region was ignored for decades by Congress but is now being served with dedication.

PM Modi addresses a grand public rally in Guwahati, Assam

February 14th, 02:30 pm

PM Modi addressed a massive public rally in Guwahati, where he said the recent Union Budget has further strengthened the vision of the BJP-NDA for the development of Assam and the North East. Calling the North East “Ashtalakshmi,” he said the region was ignored for decades by Congress but is now being served with dedication.

ఫిబ్రవరి 14న అస్సాంలో పర్యటించనున్న ప్రధానమంత్రి

February 13th, 11:38 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 14న అస్సాంలో పర్యటిస్తారు. ఉదయం సుమారు 10:30 గంటల వేళలో, ప్రధానమంత్రి డిబ్రూగఢ్‌లోని మొరాన్ బైపాస్ ప్రాంతంలోని ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ఈఎల్ఎఫ్)లో విమానం నుంచి నేల మీదికి దిగుతారు. అక్కడ పోరాట విమానాలు, రవాణా విమానాలతో పాటు హెలికాప్టర్ల గగనతల విన్యాసాల్ని ఆయన వీక్షిస్తారు. బ్రహ్మపుత్ర నదిపై నిర్మాణం పూర్తి అయిన కుమార్ భాస్కర్ వర్మ సేతును మధ్యాహ్నం దాదాపు ఒంటిగంట వేళలో ప్రధానమంత్రి సందర్శిస్తారు. ఆ తరువాత, గువాహాటీలోని లచిత్ ఘాట్‌ వద్ద వివిధ పథకాలను మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ పథకాలకు రూ.5,450 కోట్లకు పైగా మొత్తాన్ని ఖర్చు చేశారు.

అనువాదం: ‘పరీక్షా పే చర్చ 2026’ కార్యక్రమం 2వ ఎపిసోడ్‌లో విద్యార్థులతో ప్రధానమంత్రి సంభాషణ

February 09th, 10:30 am

ప్రధానమంత్రి: నా ప్రియమైన మిత్రులారా.. ‘పరీక్షా పే చర్చ’లోని ఈ ముఖ్యమైన విడతకు మీకు స్వాగతం. ఈసారి ఇది కొంచెం భిన్నంగా, కొంచెం ప్రత్యేకంగా ఉండనుంది. ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా నిర్వహించాలని చాలా మంది విద్యార్థులు సూచించారు. అందుకే ఈసారి నేను భారతదేశం అంతటా ఉన్న విద్యార్థులతో కలిసి ఈ చర్చలు జరపడానికి కూర్చున్నాను. ఈ ప్రత్యేక ఎపిసోడ్‌లో మీరు సరిగ్గా అదే చూడబోతున్నారు. మనం తమిళనాడులోని కోయంబత్తూరుతో ప్రారంభిద్దాం. తమిళనాడు విద్యార్థుల శక్తి, జిజ్ఞాస నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒకసారి చూద్దాం.

పరీక్షా పే చర్చ- 2026 రెండో ఎపిసోడ్‌లో కోయంబత్తూర్, రాయ్‌పూర్, దేవ్‌మోగ్రా, గువాహటి విద్యార్థులతో సంభాషించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

February 09th, 10:00 am

తొమ్మిదో ఎడిషన్ పరీక్షా పే చర్చ (పీపీసీ)- 2026 కొనసాగింపులో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విద్యార్థులతో సంభాషించారు. పీపీసీ- 2026 రెండో ఎపిసోడ్ సందర్భంగా కోయంబత్తూర్, రాయ్‌పూర్, దేవ్‌మోగ్రా, గువాహటి నగరాలకు చెందిన పరీక్షా యోధులతో ప్రధానమంత్రి ముచ్చటించారు. పరీక్షా పే చర్చ ప్రత్యేక ఎడిషన్‌కు విద్యార్థులను ఆహ్వానిస్తూ.. ఈసారి ఈ కార్యక్రమం దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతోందని శ్రీ మోదీ తెలిపారు. కోయంబత్తూరు ఎడిషన్‌ను ప్రారంభిస్తూ.. తమిళనాడు విద్యార్థుల ఉత్తేజమూ, ఉత్సుకతా తనను ముగ్ధుడిని చేశాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ‘వణక్కం’ అని అభివాదం చేస్తూ సరదాగా వారితో ముచ్చటించారు. ప్రధానమంత్రిని చూసినప్పుడు తమ కళ్లను తామే నమ్మలేకపోయామంటూ విద్యార్థులు ఉత్సాహంగా మాట్లాడారు. ప్రధానమంత్రి ఎంతో ఆర్భాటంగా, నాటకీయంగా వస్తారనుకున్నామనీ.. కానీ ఆయన చాలా సాధారణంగా, నిరాడంబరంగా, మనలో ఒకరిగా కనిపించారని వారు చెప్పారు. ప్రధానమంత్రి రాక తమలో ఉత్తేజం నింపిందని ఒక విద్యార్థి చెప్పారు.

దేవ్‌మోగ్రా, కోయంబత్తూర్, రాయ్‌పూర్, గువాహటి, ఢిల్లీలోని 7 ఎల్ కేఎమ్ వద్ద ఎగ్జామ్ వారియర్స్ (పరీక్ష యోధులు)తో జరిగిన పరీక్ష పే చర్చా ప్రత్యేక ఎపిసోడ్ ను వీక్షించాలని కోరిన ప్రధానమంత్రి

February 03rd, 04:45 pm

ఫిబ్రవరి 6, 2026 ప్రసారమయ్యే ప్రత్యేక పరీక్షా పే చర్చా ఎపిసోడ్‌ను వీక్షించాలని దేశ పౌరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యువతలోని సమష్టి స్ఫూర్తి, ఆసక్తికరమైన సంభాషణలను గమనించవచ్చని ఆయన తెలిపారు.

గువహటిలో సంప్రదాయ బోడో సాంస్కృతిక కార్యక్రమం ‘బకురుంబా దహోవ్’ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

January 17th, 06:30 pm

అస్సాం గవర్నర్‌ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, శాసనసభ స్పీకర్‌ శ్రీ బిశ్వజిత్ దైమరీ, ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ సర్బానంద సోనోవాల్, శ్రీ పబిత్రా మార్గిరిటా, బోడోలాండ్ ప్రాదేశిక పాలన మండలి ముఖ్య కార్యనిర్వాహక సభ్యుడు శ్రీ హగ్రామా మోహిలరి, రాష్ట్ర మంత్రులు, అస్సాంలోని నా విశిష్ట సోదరీసోదరులారా!

అస్సాంలోని గౌహతిలో జరిగిన బగురుంబా ధహోవ్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి

January 17th, 06:00 pm

గౌహతిలోని సరుసజాయ్ స్టేడియంలో నిర్వహించిన బోడో చారిత్రాత్మక సాంస్కృతిక కార్యక్రమం 'బగురుంబా ధహోవ్ 2026'ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. అస్సాం సంస్కృతి చూడటం, బోడో సామాజిక వర్గ సంప్రదాయాలను నిశితంగా గమనించడం తన అదృష్టమని ప్రధాని వ్యాఖ్యానించారు. మరే ఇతర ప్రధానమంత్రి అస్సాంను తాను సందర్శించినంత తరచుగా సందర్శించలేదన్న ఆయన.. అస్సాం కళలు - సంస్కృతికి పెద్ద వేదిక లభించాలని, భారీ వేడుకల ద్వారా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలని ఎల్లప్పుడూ కోరుకుంటున్నట్లు ప్రధానంగా చెప్పారు. ఈ దిశగా నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపిన ఆయన.. భారీ స్థాయిలో జరిగిన బిహు వేడుకలు, ఝుమోయిర్ వినోందిని ప్రదర్శన, ఏడాదిన్నర కిందట ఢిల్లీలో జరిగిన భారీ బోడో మహోత్సవ్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను ఉదహరించారు. అస్సాం కళలు, సంస్కృతి అందించే అనన్యమైన ఆనందాన్ని అనుభవించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోనని అన్నారు. బగురుంబా పండుగను నిర్వహించడంపై మరోసారి సంతోషం వ్యక్తం చేసిన ఆయన.. దీనిని బోడో అస్తిత్వానికి నిదర్శనంగా, అస్సాం వారసత్వ ప్రతీకగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంతో సంబంధం ఉన్న అందరికీ ముఖ్యంగా కళాకారులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.

ఈ నెల 17-18 తేదీల్లో పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి

January 16th, 01:55 pm

జనవరి 17వ తేదీన మధ్యాహ్నం సుమారు 12:45 గంటలకు మాల్దాను సందర్శించి, మాల్దా టౌన్ రైల్వే స్టేషన్‌లో హౌరా- గౌహతి (కామాఖ్య) మధ్య నడిచే దేశీయ తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం సుమారు 1:45 గంటలకు ప్రధానమంత్రి మాల్దాలో జరిగే బహిరంగ కార్యక్రమంలో రూ. 3,250 కోట్లకు పైగా విలువైన పలు రైలు, రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను దేశానికి అంకితం చేసి, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు.

అస్సాంలోని నామ్‌రూప్‌లో యూరియా ప్లాంటు భూమి పూజ సందర్భంగా ప్రధాని ప్రసంగం

December 21st, 04:25 pm

ఉజ్జనిర్ రాయజ్ కేనే ఆసే? ఆపునాలుకొలోయ్ ముర్ ఆంతోరిక్ మొరోమ్ ఆరు శ్రద్ధా జాసిసు.