డేరా సచ్‌ఖండ్ బల్లాన్‌ను దర్శించుకున్న ప్రధానమంత్రి

February 01st, 09:00 pm

పంజాబ్‌లోని డేరా సచ్‌ఖండ్ బల్లాన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శించారు. శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ జయంతి సందర్భంగా డేరా సచ్‌ఖండ్ బల్లాన్‌‌ను దర్శించుకోవడం ఎంతో ప్రత్యేక అనుభూతిని కలిగించిందని శ్రీ మోదీ అన్నారు.

సంత్ నిరంజన్ దాస్ జీతో ప్రధానమంత్రి భేటీ

February 01st, 07:21 pm

శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ జయంతి ఈ రోజు.. ఈ విశిష్ట సందర్భంగా సంత్ నిరంజన్ దాస్ జీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డేరా సచ్‌ఖండ్ బల్లాన్‌లో సమావేశమయ్యారు. సమాజానికి ఆయన అందించిన స్ఫూర్తిదాయకమైన సేవకు గుర్తింపుగా పద్మ శ్రీ పురస్కారంతో ఆయనను ఇటీవలే గౌరవించారు’’ అని శ్రీ మోదీ అన్నారు.

ఆదంపూర్ విమానాశ్రయానికి శ్రీ గురు రవిదాస్ మహరాజ్ జీ పేరు పెట్టడం ఆ మహనీయుని కాలాతీత ఆదర్శాలకు తగిన నివాళి: ప్రధానమంత్రి

February 01st, 06:21 pm

ఈ రోజు సంత్ రవిదాస్ జయంతి శుభ సందర్భంలో ఆదంపూర్ విమానాశ్రయాన్ని శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ విమానాశ్రయంగా పిలవాలని నిర్ణయించడం ఎంతో గౌరవం, గర్వకారణమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ కాలాతీత ఆదర్శాలకు ఇది సముచిత నివాళి అవుతుందన్న శ్రీ మోదీ... సమానత్వం, కరుణ, సేవలను బోధించిన ఆయన సందేశం మనందరికీ స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.