పవిత్రమైన ప్రకాశ్ ఉత్సవ్ సందర్భంగా శ్రీ గురు గోవింద్ జీకి నివాళులర్పించిన ప్రధానమంత్రి
December 27th, 12:06 pm
ఇవాళ పవిత్రమైన ప్రకాశ్ ఉత్సవ్ సందర్భంగా శ్రీ గురు గోవింద్ జీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. గురు గోవింద్ జీ.. ధైర్యం, కరుణ, త్యాగానికి ప్రతీక అని శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. సత్యం, న్యాయం, ధర్మం కోసం నిలబడేందుకు, మానవాళి గౌరవాన్ని రక్షించేందుకు ఆయన జీవితం, బోధనలు స్ఫూర్తినిస్తాయి. శ్రీ గురు గోవింద్ సింగ్ దార్శనికత.. సేవ, నిస్వార్థ కర్తవ్యం వైపు తరతరాలను నడిపిస్తూనే ఉంటుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.ఢిల్లీలో వీరబాల దివస్ సందర్భంగా ప్రధాని ప్రసంగం
December 26th, 01:30 pm
దేశానికి గర్వకారణమైన వీర సాహిబ్‌జాదాలను ఈ రోజు మనం స్మరించుకుంటున్నాం. అజేయమైన భారత ధైర్యసాహసాలకు, వీరత్వానికి వారు ప్రతీకలు. వయస్సు, పరిస్థితుల పరిమితులను ఛేదించుకున్న ఈ సాహిబ్‌జాదాలు క్రూర మొఘల్ సామ్రాజ్యం ఎదుట కొండలా అడ్డు నిలిచారు. మతోన్మాదాన్నీ, ఉగ్ర మూలాలనూ పెకలించారు. ఇంతటి మహోజ్వల చరిత్ర ఉన్న, స్ఫూర్తిదాయకమైన ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఈ దేశ యువత సాధించలేనిదంటూ ఏమీలేదు.న్యూఢిల్లీలో వీరబాల దివస్ కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
December 26th, 01:00 pm
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ‘వీరబాల దివస్’ సందర్భంగా ఈ రోజు నిర్వహించిన జాతీయ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన అతిథులకు స్వాగతం పలికిన ప్రధానమంత్రి, అక్కడున్న పిల్లలనుద్దేశించి మాట్లాడారు. వీరబాల దివస్ ప్రాముఖ్యతను వారికి వివరించారు. ఈ సందర్భంగా కళాకారుల వందేమాతర ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. వారి అంకితభావం, కృషి ఆ ప్రదర్శనలో స్పష్టంగా కనిపించాయన్నారు.వీరబాలల దినోత్సవం సందర్భంగా సాహస ‘సాహిబ్‌జాదా’ల త్యాగాన్ని సంస్మరించిన ప్రధానమంత్రి
December 26th, 11:21 am
వీరబాలల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సాహస ‘సాహిబ్‌జాదా’ల త్యాగాన్ని సంస్మరించుకున్నారు. ఇది ధైర్యం, దృఢ దీక్ష, సత్సంకల్పంతో ముడిపడిన రోజని ఆయన పేర్కొన్నారు.Sri Guru Teg Bahadur Ji's life, sacrifice and character are a tremendous source of inspiration: PM Modi in Kurukshetra
November 25th, 04:40 pm
PM Modi addressed an event commemorating the 350th Shaheedi Diwas of Sri Guru Teg Bahadur Ji at Kurukshetra in Haryana. He remarked that Sri Guru Teg Bahadur Ji considered the defense of truth, justice, and faith as his dharma, and he upheld this dharma by sacrificing his life. On this historic occasion, the Government of India has had the privilege of dedicating a commemorative postage stamp and a special coin at the feet of Sri Guru Teg Bahadur Ji.హర్యానాలోని కురుక్షేత్రలో శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 350వ షహీదీ దివస్‌లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 25th, 04:38 pm
హర్యానాలోని కురుక్షేత్రలో ఈ రోజు శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 350వ షహీదీ దివస్‌ను పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ... ఈ రోజు భారత వారసత్వ అద్భుత సంగమ దినమని అని వ్యాఖ్యానించారు. ఉదయం తాను రామాయణ నగరమైన అయోధ్యలో ఉన్నాననీ... ఇప్పుడు తాను గీతా నగరమైన కురుక్షేత్రలో ఉన్నానని ఆయన పేర్కొన్నారు. శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 350వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాధువులు, సంబంధిత సమాజం హాజరైనట్లు పేర్కొన్న ప్రధానమంత్రి... అందరికీ తన గౌరవప్రదమైన నమస్కారాలు తెలిపారు.తఖత్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్‌లో ప్రధానమంత్రి ప్రార్థనలు
November 02nd, 10:10 pm
తఖత్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం ప్రార్థించారు..గురు చరణ్ యాత్రతో అనుసంధానమై పవిత్ర ‘జోర్ సాహిబ్’ దర్శనం చేసుకోవాలని ప్రజలను కోరిన ప్రధానమంత్రి
October 22nd, 06:41 pm
ఈ రోజు గురు చరణ్ యాత్ర సందర్భంగా శ్రీ గురు గోవింద్ సింగ్ జీ, మాతా సాహిబ్ కౌర్ జీల అద్భుత బోధనలు, ఆధ్యాత్మిక వారసత్వాన్ని గుర్తుచేసుకుంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.అత్యంత పవిత్రమైన, అమూల్యమైన శ్రీ గురు గోవింద్ సింగ్, మాతా సాహిబ్ కౌర్‌ల ‘జోరే సాహిబ్’
September 19th, 04:28 pm
సిక్కు ప్రతినిధుల బృందంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. అత్యంత పవిత్రమైన, అమూల్యమైన శ్రీ గురు గోవింద సింగ్, మాతా సాహిబ్ కౌర్‌ల ‘జోరే సాహిబ్’ సంరక్షణ, ప్రదర్శనపై ప్రతినిధులు అందించిన సూచనలను పరిగణనలోకి తీసుకున్నారు. ‘జోర్ సాహిబ్’ వంటి పవిత్ర స్మృతి చిహ్నాలు ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైనవనీ, విశేషమైన సిక్కు చరిత్రలో ఒక భాగమనీ, దేశ సంస్కృతికి మూలాలనీ పేర్కొన్నారు. ‘‘శ్రీ గురు గోవింద్ సింగ్ చూపిన ధైర్యం, ధర్మం, న్యాయం, సామాజిక సామరస్య మార్గాన్ని అనుసరించేలా భవిష్యత్ తరాలకు పవిత్రమైన ఈ స్మృతి చిహ్నాలు స్ఫూర్తినిస్తాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.గుజరాత్ లోని దాహోద్ లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం
May 26th, 11:45 am
గౌరవనీయులైన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్, రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, గుజరాత్ మంత్రివర్గంలోని నా సహచరులందరూ, పార్లమెంటు సభ్యులు, శాసనసభ సభ్యులు, ఇతర విశిష్ట ప్రముఖులు, దాహోద్ లోని నా ప్రియమైన సోదరులు, సోదరీమణులారా!గుజరాత్‌లోని దాహోద్‌లో రూ. 24,000 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, కొన్నింటిని జాతికి అంకితం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
May 26th, 11:40 am
గుజరాత్‌లోని దాహోద్ లో రూ.24,000 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. 2014లో తాను మొదటిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మే 26నే కాబట్టి ఈ రోజు ప్రత్యేకమైనదని అన్నారు. దేశాన్ని నడిపించే బాధ్యతను నిర్వర్తించడంలో గుజరాత్ ప్రజలు తనకు అందించిన మద్దతును, ఆశీర్వాదాలను ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. ఈ నమ్మకం, ప్రోత్సాహమే దేశానికి రేయింబవళ్లు సేవ చేయాలనే తన అంకితభావానికి ఆధారంగా నిలిచాయని పేర్కొన్నారు. దశాబ్దాల తరబడి అనుసరిస్తున్న పాత పద్దతులను వదిలించుకుని ప్రతి రంగంలోనూ దూసుకువెళ్లేలా గడచిన కొన్నేళ్లలో భారత్ అసాధారణమైన, ఊహకందని నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ‘‘ఈరోజు నిరాశ, చీకటి నుంచి బయటపడి సరికొత్త విశ్వాసం, ఆశావాదం నిండిన కొత్తయుగంలోకి దేశం అడుగుపెట్టింది’’ అని చెప్పారు.ఆదంపూర్ వైమానిక స్థావరం వద్ద ధైర్యవంతులైన వైమానిక యోధులు, సైనికులతో ప్రధాన మంత్రి సంభాషణ తెలుగు అనువాదం
May 13th, 03:45 pm
ఈ నినాదం ఎంత శక్తిమంతమైనదో ఇప్పుడు ప్రపంచమంతటికీ తెలిసింది. భారత్ మాతా కీ జై! అన్నది కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, భరతమాత గౌరవ ప్రతిష్ఠలను నిలబెట్టడం కోసం ప్రాణం పణంగా పెట్టే ప్రతి సైనికుడూ చేసే శపథం. ఈ నినాదం దేశం కోసం జీవించి అర్థవంతమైన సేవలందించాలనుకునే ప్రతీ పౌరుడి గొంతుక. యుద్ధభూమిలోను, కీలకమైన పోరాటంలోనూ ‘భారత్ మాతా కీ జై’ ప్రతిధ్వనిస్తుంది. భారత సైనికులు ‘భారత్ మాతా కీ జై’ అని నినదిస్తే శత్రువుల వెన్నులో వణుకు పుడుతుంది. భారత డ్రోన్లు శత్రు కోటలను కూల్చేసినప్పుడు, క్షిపణులు కచ్చితత్వంతో దాడి చేసినప్పుడు శత్రువుకు వినిపించే ఒకే నినాదం ‘భారత్ మాతా కీ జై’ . భారత్ అజేయ స్ఫూర్తిని శత్రువుకు చూపేలా- అత్యంత చీకటి రాత్రుల్లోనూ ఆకాశాన్ని దేదీప్యం చేసినప్పుడు శత్రువుకు కనిపించింది ఒక్కటే... అదే ‘భారత్ మాతా కీ జై! అణ్వస్త్ర బెదిరింపుల ముప్పులన్నింటినీ భారత బలగాలు నిర్మూలించిన వేళ భూమ్యాకాశాలంతటా ప్రతిధ్వనించే సందేశం – ‘భారత్ మాతాకీ జై’.ధీరులైన వైమానిక యోధులు, సైనికులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ
May 13th, 03:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అదంపూర్‌లోని వైమానిక దళ కేంద్రాన్ని సందర్శించి ధీరులైన వైమానిక యోధులు, సైనికులతో సంభాషించారు. వారితో మాట్లాడుతూ.. ‘భారత్ మాతా కీ జై’ నినాదం ఎంత శక్తిమంతమైనదో ఇప్పుడు ప్రపంచమంతటికీ తెలిసిందన్నారు. ఇది కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, భరతమాత గౌరవ ప్రతిష్ఠలను నిలబెట్టడం కోసం ప్రాణం పణంగా పెట్టే ప్రతి సైనికుడూ చేసే శపథమని వ్యాఖ్యానించారు. ఈ నినాదం దేశం కోసం జీవించి అర్థవంతమైన సేవలందించాలనుకునే ప్రతీ పౌరుడి గొంతుక అని స్పష్టం చేశారు. యుద్ధభూమిలోను, కీలకమైన పోరాటంలోనూ ‘భారత్ మాతా కీ జై’ ప్రతిధ్వనిస్తుందన్నారు. భారత సైనికులు ‘భారత్ మాతా కీ జై’ అని నినదిస్తే శత్రువుల వెన్నులో వణుకు పుడుతుందన్నారు. భారత డ్రోన్లు శత్రు కోటలను కూల్చేసినప్పుడు, క్షిపణులు కచ్చితత్వంతో దాడి చేసినప్పుడు శత్రువుకు వినిపించే ఒకే నినాదం ‘భారత్ మాతా కీ జై’ అంటూ భారత సైనిక పాటవాన్ని కొనియాడారు. భారత్ అజేయ స్ఫూర్తిని శత్రువుకు చూపేలా- అత్యంత చీకటి రాత్రుల్లోనూ ఆకాశాన్ని దేదీప్యం చేయగల సమర్థత మన దేశానికి ఉన్నదని ప్రధానమంత్రి శ్రీ మోదీ స్పష్టం చేశారు. అణ్వస్త్ర బెదిరింపుల ముప్పులన్నింటినీ భారత బలగాలు నిర్మూలించిన వేళ భూమ్యాకాశాలంతటా ప్రతిధ్వనించే సందేశం – ‘భారత్ మాతాకీ జై’ అని ఆయన ప్రకటించారు.హర్యానాలోని యమునా నగర్‌లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం/శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
April 14th, 12:00 pm
ప్రజాదరణ చూరగొన్న హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సింగ్ సైనీ, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ మనోహరల్ లాల్, ఇందర్‌జీత్ సింగ్, శ్రీ క్రిషన్‌పాల్, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు-శాసనసభ సభ్యులు సహా నా ప్రియ సోదరీసోదరులారా... హర్యానాలోని సహోదరులారా... మీకందరికీ ఇవే మోదీ శుభాకాంక్షలు!హర్యానాలోని యమునానగర్ లో అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ
April 14th, 11:54 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు హర్యానాలోని యమునా నగర్లో పలు అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా హర్యానా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పవిత్ర భూమి హర్యానాకు ప్రధానమంత్రి నివాళులు అర్పించారు. ఇది సరస్వతీ మాత జన్మస్థలం, మంత్రాదేవి నివాసం, పంచముఖి హనుమాన్ జీ స్థానం, అలాగే పవిత్ర కపాలమోచన్ సాహిబ్ ఉన్న ప్రదేశంగా పేర్కొంటూ, హర్యానా సంస్కృతి, భక్తి అంకితభావ సంగమం అని ఆయన వర్ణించారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేశారు. బాబాసాహెబ్ దార్శనికత, ప్రేరణ ఇప్పటికీ భారతదేశ అభివృద్ధి ప్రయాణానికి మార్గనిర్దేశం చేస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా ప్రధాని చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం
January 06th, 01:00 pm
తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు, ఒడిశా గవర్నర్ శ్రీ హరిబాబు గారు, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా గారు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా గారు, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ గారు, నా మంత్రివర్గ సహచరులు - శ్రీ అశ్వనీ వైష్ణవ్ గారు, శ్రీ జి కిషన్ రెడ్డి గారు, డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, శ్రీ సోమయ్య గారు, శ్రీ రణవీత్ సింగ్ బిట్టూ గారు, శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, ఇతర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు, విశిష్ట అతిథులు, సోదర, సోదరీమణులారా!వివిధ రైల్వే ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
January 06th, 12:30 pm
వివిధ రైల్వే ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రారంభించడమే కాక కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన కూడా చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన జమ్మూ రైల్వే డివిజనును ప్రధాని ప్రారంభించారు. ఆయన ఈస్ట్ కోస్ట్ రైల్వేలో రాయగడ రైల్వే డివిజన్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే, తెలంగాణలో చర్లపల్లి న్యూ టర్మినల్ స్టేషనును ప్రారంభించారు.శ్రీ గురు గోవింద్ సింగ్ జీ కి ఆయన ప్రకాశ్ ఉత్సవ్ సందర్భంగా ప్రధానమంత్రి నివాళులు
January 06th, 09:33 am
శ్రీ గురు గోవింద్ సింగ్ జీ కి ఆయన ప్రకాశ్ ఉత్సవ్ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. శ్రీ గురు గోవింద్ సింగ్ జీ ఆలోచనలు ఒక ప్రగతిశీల, సమృద్ధిసహిత, కరుణామయ సమాజాన్ని నిర్మించడంలో మనకు ప్రేరణనిస్తాయని ప్రధాని అన్నారు.రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో సంభాషించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
December 26th, 09:54 pm
ముఖాముఖి సందర్భంగా, పిల్లల నేపథ్యాలను విన్న ప్రధానమంత్రి.. జీవితంలో మరింత కృషిచేయాలంటూ వారిని ప్రోత్సహించారు. పుస్తకాలు రాసిన ఓ బాలికతో సంభాషించారు. తన పుస్తకాలకు ఎలాంటి స్పందన వచ్చిందో అడగగా.. మిగతా పిల్లలు కూడా సొంతంగా పుస్తకాలు రాయడం మొదలుపెట్టారని ఆ బాలిక బదులిచ్చింది. ఇతర చిన్నారుల్లో కూడా ప్రేరణ కలిగించిన ఆ బాలికను శ్రీ మోదీ ప్రశంసించారు.Our constitution embodies the Gurus’ message of Sarbat da Bhala—the welfare of all: PM Modi
December 26th, 12:05 pm
The Prime Minister, Shri Narendra Modi participated in Veer Baal Diwas today at Bharat Mandapam, New Delhi.Addressing the gathering on the occasion of the 3rd Veer Baal Diwas, he said their Government had started the Veer Baal diwas in memory of the unparalleled bravery and sacrifice of the Sahibzades.