గురుద్వారా రకాబ్ గంజ్ సాహిబ్‌ను సందర్శించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని శ్రీ క్రిస్టోఫర్ లక్సన్
March 17th, 10:26 pm
న్యూజిలాండ్ ప్రధాని శ్రీ క్రిస్టోఫర్ లక్సన్‌తో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీలోని గురుద్వారా రకాబ్ గంజ్ సాహిబ్‌ను సందర్శించారు. గురుద్వారా సందర్శనకు సంబంధించిన కొన్ని దృశ్యాలను శ్రీ మోదీ షేర్ చేస్తూ సేవ అన్నా, మానవీయ దృక్పథంతో నడుచుకోవడం అన్నా దృఢమైన కట్టుబాటును కలిగి ఉండే సిక్కు సముదాయం నిజంగా ప్రపంచమంతటా ప్రశంసాపాత్రమవుతోందన్నారు.