అభివృద్ధి చెందిన భారతదేశానికి వృద్ధి చోదకంగా మారే సత్తా ఆంధ్రప్రదేశ్‌కు ఉంది: ప్రధాని మోదీ
August 01st, 11:45 am
వికసిత భారత్‌కు వృద్ధి చోదకంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవిస్తున్న తీరును హైలైట్ చేస్తూ, ప్రధాని మోదీ సుమారు ₹18,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, రాష్ట్రానికి అంకితం చేశారు. ప్రపంచ స్థాయి కనెక్టివిటీ, లాజిస్టిక్స్ నుండి సెమీకండక్టర్లు, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల వరకు ఉద్యోగాలను సృష్టించడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వేగవంతం చేయడం వంటి అంశాలపై ప్రధాని మోదీ తన దార్శనికతను వివరించారు.ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురంలో ₹17,900 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ
August 01st, 11:30 am
వికసిత భారత్‌కు వృద్ధి చోదకంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవిస్తున్న విషయాన్ని హైలైట్ చేస్తూ, ప్రధాని మోదీ సుమారు ₹18,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, రాష్ట్రానికి అంకితం చేశారు. ప్రపంచ స్థాయి కనెక్టివిటీ, లాజిస్టిక్స్ నుండి సెమీకండక్టర్లు, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల వరకు ఉద్యోగాలను సృష్టించడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వేగవంతం చేయడం వంటి అంశాలపై ప్రధాని మోదీ తన దార్శనికతను వివరించారు.సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
June 28th, 05:00 pm
ఈ రోజే కొంచెం ముందు నాకు ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్’ పురస్కారాన్ని అందించి నన్ను గౌరవించినందుకు అధ్యక్షుడు ఎర్మినీ గారికి, సీషెల్స్ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతర కృషి చేస్తున్న వారందరికీ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇక్కడికి భారత్‌లోని 140 కోట్ల ప్రజల తరపున ఆత్మీయ శుభాకాంక్షలను, శుభాశీస్సులను తీసుకువచ్చాను.సీషెల్స్ అధ్యక్షుడితో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన
June 28th, 02:02 pm
అలాగే, “గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్” పురస్కార ప్రదానం నాతోపాటు 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవంగా పరిగణిస్తూ, మా దేశవాసులందరి తరఫున హర్షం ప్రకటిస్తున్నాను. ఈ సత్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తూ- వాతావరణ మార్పు సమస్యలను ఎదుర్కొంటున్న, పర్యావరణ పరిరక్షణను భావితరాల కోసం తమ కర్తవ్యంగా భావిస్తున్న దేశాలన్నింటికీ సగౌరవంగా అంకితం చేస్తున్నాను.ఒడిశా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పీఎం ప్రసంగం
June 20th, 01:10 pm
గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, గవర్నర్ శ్రీ హరిబాబు, ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ, ఉప ముఖ్యమంత్రి శ్రీ కనక్ వర్ధన్ సింగ్ డియో, శ్రీమతి ప్రవతి పరిదా, ఒడిశా మంత్రి శ్రీ గణేశ్ సింగ్ ఖుంటియా, శ్రీ కృష్ణ చంద్ర మోహపాత్ర, పార్లమెంటు సభ్యుడు శ్రీ నబా చరణ్ మాఝీ, శ్రీ మన్మోహన్ సమాల్, శ్రీ బైజయంత్ పాండా, ఇతర ప్రముఖులు, సోదరీసోదరులారా.ఒడిషాలో బీజేపీ ప్రభుత్వానికి రెండేళ్లు: మయూర్‌భంజ్ జిల్లా రాయ్‌రంగపూర్‌లో ₹47,600 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం.. శంకుస్థాపన
June 20th, 01:00 pm
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఒడిషాలోని మయూర్‌భంజ్ జిల్లాలోగల పహాడ్‌పూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పవిత్ర ‘సంథాలీ’, ‘హో’ గిరిజన తెగల పవిత్ర వృక్షదేవతారాధ్య (జహేరా) ప్రాంతాలలో ప్రార్థనలు చేశారు. అలాగే, అక్కడి నైపుణ్యాభివృద్ధి కేంద్రం, పహాడ్‌పూర్ పాఠశాలను సందర్శించారు. ఒడిషాలో బీజేపీ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో “వికాస్ రా ధార-ఒడిషా సారా” (ఒడిషా రాష్ట్రమంతటా అభివృద్ధి స్రవంతి) ఇతివృత్తంగా మయూర్‌భంజ్ జిల్లాలోని రాయ్‌రంగపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వారిద్దరూ పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్రీ మోదీ ₹47,600 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు కొన్నిటికి శంకుస్థాపన చేశారు.న్యూఢిల్లీలో 'ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన' ప్రోత్సాహకాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 19th, 05:15 pm
నా మంత్రివర్గ సహచరులు శ్రీ మన్‌సుఖ్ మాండవీయ గారు, సోదరి శోభ గారు, దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు, సాంకేతికతతో అనుసంధానమైన ప్రముఖులందరికీ, నిర్వాహకులకు, ప్రస్తుతం 200 ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమంతో అనుసంధానమైన సుమారు రెండు లక్షల మందికి... నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పారిశ్రామిక రంగానికి చెందిన అనేకమంది ప్రముఖులు ఈ రోజు ఇక్కడ ఉండటం నాకు కనిపిస్తోంది. ఇంత పెద్ద సంఖ్యలో హాజరైన యువ మిత్రుల ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది.‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ కింద సుమారు రూ. 2,400 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు పంపిణీ చేసిన ప్రధానమంత్రి
June 19th, 05:00 pm
ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన లబ్ధిదారులు, పరిశ్రమల ప్రతినిధులు, భాగస్వాములనుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. భారత యువతకు సాధికారత కల్పించడానికి, దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనను వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం పీఎం-వీబీఆర్‌వై అమలులో భాగంగా... అన్ని రంగాలకు సామాజిక భద్రతా పరిధిని విస్తరించడంలో ఒక కీలక మైలురాయిగా నిలిచే ఈ కార్యక్రమం ద్వారా సుమారు రూ.2,400 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను ఈ రోజు పంపిణీ చేశారు. ఈ ప్రోత్సాహకం దేశవ్యాప్తంగా 15 లక్షల ఉపాధి అవకాశాల కల్పనకు తోడ్పడింది.ఇండియన్ కమ్యూనిటీ ఈవెంట్ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 18th, 11:41 pm
కాంతులు, రంగులతో కూడిన నగరం పారిస్. ఇది కళలకు, సరికొత్త ఆలోచనలకు, నూతన ఆవిష్కరణలకు స్ఫూర్తి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన మీరంతా ఈ నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. మీరే దీనికి సరికొత్త, చైతన్యవంతమైన రంగులను అద్దుతున్నారు.ప్యారిస్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం
June 18th, 09:30 pm
ఫ్రాన్స్‌లోని వివిధ రంగాల్లో భారతీయ సమాజం చేసిన గణనీయమైన కృషిని ప్రధానమంత్రి కొనియాడారు. భారతీయ ఆవిష్కరణలనూ, ఆలోచనలనూ ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించడంలోనూ, ఇండియా-ఫ్రాన్స్ ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూ- వారు పోషిస్తున్న కీలక పాత్రను ఆయన మెచ్చుకున్నారు. ఎక్కువ సంఖ్యలో భారతీయ విద్యార్థులు, నిపుణులు, పర్యాటకులు ఫ్రాన్స్‌ను గమ్యస్థానంగా ఎంచుకోవడంతో రెండు దేశాల మధ్య ప్రజా సంబంధాలు విస్తరించాయని ఆయన తెలియజేశారు. ప్రజల రాకపోకలను సులభతరం చేయడానికి తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. ఫ్రాన్స్‌లో యూపీఐ విస్తరణ గురించి మాట్లాడుతూ.. ఇది రెండు దేశాల మధ్య పర్యాటకానికి ఊతమిస్తుందని వివరించారు.పారిస్‌లో ‘వివాటెక్-2026’ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 18th, 06:15 pm
ఇక ఇదే సంవత్సరంలో ‘ఇండియా-ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నొవేషన్’ ప్రారంభం కావడంతో రెండు దేశాలతోపాటు ఐరోపా సాంకేతికావరణ వ్యవస్థలను చేరువ చేసే కీలక వారధిగా ఇది రూపొందింది. కొన్ని రోజుల కిందట నైస్ నగరంలో నిర్వహించిన ‘భారత్ ఇన్నొవేట్స్’ నుంచి ఇవాళ పారిస్ నగరంలో నిర్వహిస్తున్న ‘వివాటెక్’ దాకా మన అంకుర సంస్థలు అనేక కొత్త భాగస్వామ్యాలను ఏర్పరుచుకుంటున్నాయి.వివాటెక్ 2026 సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి
June 18th, 06:00 pm
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పారిస్‌లో జరిగిన ఐరోపాలోనే అతిపెద్ద సాంకేతిక, అంకురాల కార్యక్రమం అయిన 'వివాటెక్ 2026'లో పాల్గొన్నారు.గుజరాత్‌లోని సూరత్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 05th, 04:30 pm
విశేష ప్రజాదరణ గల గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ సి.ఆర్.పాటిల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ భాయ్ హర్ష్ సంఘ్వి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జగదీష్ విశ్వకర్మ, ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు సహా నా ప్రియమైన సూరత్ నగర సోదరీసోదరులారా!గుజరాత్‌లోని సూరత్‌లో ₹18,800 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. దేశానికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 05th, 04:16 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లోని సూరత్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు దేశానికి అంకితం.. శంకుస్థాపన చేశారు. అనంతరం భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ- తమకు అకుంఠిత మద్దతునిచ్చిన గుజరాత్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నేను తొలిసారి సూరత్ వచ్చాను. ఈ గడ్డమీది నుంచి యావత్ రాష్ట్ర ప్రజలకు శిరసాభివందనం చేస్తూ అభినందనలు తెలుపుతున్నాను” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
June 05th, 09:53 am
ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ సంరక్షణ పట్ల మక్కువను కనబరిచే వారందరినీ ఆయన ప్రశంసించారు.అందరికీ శాశ్వత పుష్కలత్వం, సంతోషం, సమృద్ధి కలగాలని ప్రార్థిస్తూ
May 25th, 09:18 am
ప్రకృతి చూపే అపార కృపతోనూ, సూర్య దేవుని శక్తితోనూ, వర్షాలు అందించే పవిత్ర ఆశీస్సులతోనూ మన జీవితాల్లో సుఖ సమృద్ధులు కలుగుతాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేస్తూ, ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ఈ రోజు పంచుకున్నారు. భూమి సదా చైతన్య పూరితంగా, పచ్చదనంతో కళకళలాడుతూ, సమృద్ధంగా వర్ధిల్లాలని శ్రీ మోదీ నిండు మనసుతో ఆకాంక్షించారు.రోజ్‌గార్ మేళా ద్వారా నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
May 23rd, 11:15 am
దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది యువతీ యువకులకు నేడు చాలా ముఖ్యమైన రోజు. 51,000 కంటే ఎక్కువ మంది యువత నేడు ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను అందుకున్నారు. మీరు దేశ అభివృద్ధి ప్రయాణంలో అత్యంత కీలకమైన, బాధ్యతాయుతమైన భాగస్వాములుగా మారుతున్నారు. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, విద్య, ఇతర అనేక రంగాల్లో సరికొత్త బాధ్యతలను స్వీకరించబోతున్నారు. రాబోయే సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన భారత్ సంకల్పాన్ని నెరవేర్చడంలో మీరే కీలక పాత్ర పోషిస్తారు.రోజ్‌గార్ మేళా ద్వారా ప్రభుత్వంలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 23rd, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 19వ రోజ్‌గార్ మేళా (ఉగ్యోగ మేళా)లో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వేలాది మంది యువతీ యువకులకు ఇది అత్యంత ముఖ్యమైన రోజు అని అభివర్ణించారు. ప్రభుత్వ సేవలోకి కొత్తగా అడుగుపెడుతున్న వారికి స్వాగతం పలుకుతూ.. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, విద్య వంటి రంగాలతో సహా పలు రంగాల్లో దేశ అభివృద్ధికి వారు అందించబోయే కీలక సహకారాన్ని ప్రస్తావించారు. ‘‘రాబోయే సంవత్సరాల్లో వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో మీరందరూ కీలక పాత్ర పోషిస్తారు’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.భారత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా రెండు దేశాల సంయుక్త ప్రకటన
May 17th, 03:45 am
నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గౌరవనీయ రాబ్ జెటెన్ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 16-17 తేదీలలో ఆ దేశంలో పర్యటించారు. శ్రీ మోదీ నెదర్లాండ్స్‌లో పర్యటించడం ఇది రెండోసారి.నెదర్లాండ్స్‌లో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా అవగాహన ఒప్పందాలు... ఒడంబడికలు
May 17th, 02:47 am
భారత్-నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్య భవిష్యత్ ప్రణాళిక [2026-2030]