గ్రేటర్ నోయిడాలో ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

September 25th, 10:22 am

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు భూపేంద్ర చౌదరి గారు, పరిశ్రమకు చెందిన మిత్రులు, ఇతర ప్రముఖులు, సోదరీ సోదరులారా,

గ్రేటర్ నోయిడాలో... ఉత్తర ప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శననుద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

September 25th, 10:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ‘ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన-2025’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ప్రదర్శనకు హాజరైన వ్యాపారులు, పెట్టుబడిదారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువతకు ప్రధాని హార్ధిక స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో 2,200 మందికి పైగా ఎగ్జిబిటర్లు ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తుండడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ వాణిజ్య ప్రదర్శనకు రష్యా భాగస్వామ్య దేశంగా ఉందని, కాలపరీక్షకు నిలిచి ఈ భాగస్వామ్యం బలోపేతమవుతోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రభుత్వ సహచరులు, ఇతర భాగస్వాములను ఆయన అభినందించారు. చిట్టచివరి వ్యక్తులకూ అభివృద్ధిని అందించాలన్న అంత్యోదయ మార్గంలో దేశాన్ని నడిపించిన పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి రోజే... ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. అంత్యోదయ అంటే అత్యంత నిరుపేదలకూ అభివృద్ధి ఫలాలు అందేలా చూడడమని, అన్ని రకాల వివక్షలూ తొలగిపోవడమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమ్మిళిత అభివృద్ధి భావననే భారత్ నేడు ప్రపంచానికి అందిస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

సెప్టెంబర్‌ 25న ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి

September 24th, 06:25 pm

అనంతరం ప్రధానమంత్రి రాజస్థాన్‌ను సందర్శించి రూ.1,22,100 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, కొన్నింటిని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1:45 గంటలకు బన్స్ వారాలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అదే సమయంలో పీఎం కుసుం పథకం లబ్ధిదారులతో ముచ్చటిస్తారు.

ఉత్తర‌ప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో జరుగుతోన్న సెమీకాన్ ఇండియా 2024లో

September 11th, 04:28 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడా‌లో ఉన్న ఇండియా ఎక్స్ పో మార్ట్‌లో సెమీకాన్ ఇండియా 2024ను ప్రారంభించారు. ఈ సదస్సును సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు ‘సెమీకండక్డర్ భవిష్యత్తును తీర్చిదిద్దటం’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. మూడు రోజుల సదస్సులో సెమీకండక్టర్ల విషయంలో భారత్‌ను ప్రపంచ కేంద్రంగా మార్చే వ్యూహం, విధానంపై చర్చించనున్నారు. ఈ పరిశ్రమకు చెందిన ప్రపంచ నాయకత్వ స్థాయి వ్యక్తులు, కంపెనీలు, నిపుణులను ఏకతాటిపైకి తీసుకువచ్చే ఈ సదస్సులో ప్రపంచ సెమీకండక్టర్ దిగ్గజాల అగ్రనాయకత్వం పాల్గొంటోంది. సదస్సులో 250 మందికి పైగా ప్రదర్శనదారులు, 150 మంది వక్తలు పాల్గొంటున్నారు.

11న సెమికాన్ ఇండియా 2024ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

September 09th, 08:08 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా ఇండియా ఎక్స్ పో మార్ట్‌లో ‘సెమికాన్ ఇండియా 2024’ను సెప్టెంబర్ 11న ఉదయం10:30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సభనుద్దేశించి ప్రసంగించనున్నారు.