ఇథియోపియా పార్లమెంటు సంయుక్త సమావేశంలో ప్రధాని ప్రసంగ పాఠం
December 17th, 12:25 pm
పురాతన విజ్ఞానమూ, ఆధునిక ఆకాంక్షలూ కలిగిన ఒక దేశపు హృదయం వంటి ఈ ప్రజాస్వామ్య దేవాలయంలో ఉండడం గౌరవంగా భావిస్తున్నాను. మీ పార్లమెంటు పట్ల, మీ ప్రజల పట్ల, మీ ప్రజాస్వామ్య ప్రస్థానం పట్ల ప్రగాఢ గౌరవంతో నేను మీ వద్దకు వచ్చాను. 140 కోట్ల భారతీయుల తరఫున స్నేహం, సద్భావన, సౌభ్రాతృత్వంతో కూడిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.ఇథియోపియాలో పార్లమెంటు సంయుక్త సమావేశాన్నుద్దేశించి ప్రసంగించిన భారత ప్రధాని
December 17th, 12:12 pm
భారత ప్రజల తరఫున ఇథియోపియా చట్టసభ సభ్యులకు మైత్రి, సద్భావనాపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పార్లమెంటునుద్దేశించి ప్రసంగించడం, ఇథియోపియాలోని సామాన్యులు- రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, గర్వించేలా ఎదుగుతున్న మహిళలు, దేశ భవితను తీర్చిదిద్దుతున్న యువతతో ఈ ప్రజాస్వామ్య దేవాలయం నుంచి మాట్లాడడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అత్యున్నత పురస్కారం ‘గ్రేట్ ఆనర్ ఆఫ్ ఇథియోపియా నిషాన్’ను తనకు అందించిన ఇథియోపియా ప్రజలకు, ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంబంధాల ప్రాధాన్యం దృష్ట్యా.. ఇరు దేశాల మధ్య ఉన్న చిరకాల సంబంధాలు ఈ పర్యటన సందర్భంగా వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదగడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.ఇథియోపియా అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
December 17th, 09:25 am
విశిష్ట దేశమైన ఇథియోపియాలో మీ అందరి మధ్య ఇలా ఉండటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ మధ్యాహ్నమే నేను ఇథియోపియాకు చేరుకున్నాను. ఈ నేలపై అడుగుపెట్టిన క్షణం నుంచి ఇక్కడి ప్రజలతో గొప్ప ఆత్మీయత ఉన్నట్టు నాకు అనిపించింది. ప్రధానే స్వయంగా నాకు స్వాగతం పలికారు. ఫ్రెండ్షిప్ పార్క్, సైన్స్ మ్యూజియంకు నన్ను తీసుకెళ్లారు.Prime Minister receives the highest award of Ethiopia
December 16th, 11:52 pm
During his visit to Ethiopia, PM Modi was conferred the 'Great Honor Nishan of Ethiopia', the country’s highest award, by Ethiopian PM Abiy Ahmed Ali. The honour was bestowed upon PM Modi in recognition of his contribution to strengthening the India-Ethiopia partnership and his visionary leadership as a global statesman. The PM dedicated the award to all those who have contributed to nurturing the bilateral ties between India & Ethiopia.