Eminent Malayali Litterateurs Meet PM to Express Gratitude for Renaming State to Keralam
February 27th, 07:34 pm
A group of eminent Malayali litterateurs called upon the Prime Minister today to express their gratitude regarding the renaming of Kerala to Keralam.దేవ్‌నీమొరీ పవిత్ర అవశేషాల ప్రదర్శనను ప్రారంభించినందుకు శ్రీలంక అధ్యక్షునికి కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి
February 05th, 10:45 am
కొలంబోలోని పావన గంగారామయా ఆలయంలో దేవ్‌నీమొరీ పవిత్ర అవశేషాల ప్రదర్శనను ప్రారంభించినందుకు శ్రీలంక అధ్యక్షుడు శ్రీ అనూర కుమార దిసానాయకేకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.సౌమ్యనారాయణ పెరుమాళ్ ఆలయ పూజారులను కలిసిన ప్రధానమంత్రి
January 23rd, 11:42 pm
ఇవాళ ఉదయం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, సౌమ్యనారాయణ పెరుమాళ్ ఆలయ పూజారులను కలిశారు.సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి
December 07th, 10:58 am
సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సాయుధ దళాల్లో సేవలందిస్తున్న ధైర్యవంతులైన పురుషులు, మహిళలకు ప్రధానమంత్రి ఈ రోజు కృతజ్ఞతలు తెలిపారు.ఢిల్లీ ఘటనపై భూటాన్ సంఘీభావానికి కృతజ్ఞతలు తెలిపిన భారత ప్రధాని
November 11th, 03:01 pm
గౌరవ భూటాన్ నాలుగో రాజు 70వ జన్మదిన వేడుకలో భారత్‌కు సంఘీభావం తెలిపిన ఆ దేశ ప్రజలకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో జరిగిన విషాద ఘటన నేపథ్యంలో.. బాధితులు, వారి కుటుంబాల కోసం భూటాన్ ప్రజలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ‘‘ఈ సానుభూతిని నేనెన్నటికీ మరచిపోలేను’’ అంటూ.. కరుణను, ఐక్యతను చాటిన ఈ కార్యక్రమంపై ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.ప్రభుత్వ అధినేతగా 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి
October 07th, 10:52 am
ప్రభుత్వ అధినేతగా సేవలను అందించడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా... దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2001లో ఇదే రోజున గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణాన్ని స్వీకరించినప్పటి నుంచి తన ప్రయాణాన్ని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ప్రజల జీవనాన్ని మెరుగుపరచడంతో పాటు దేశ పురోగతికి తన వంతు పాటుపడాలన్నదే తన నిరంతర ప్రయత్నమని ఆయన అన్నారు.వర్షాలు, కొండచరియలు విరిగిపడిన డార్జిలింగ్, పరిసర ప్రాంతాలకు అండగా ఉంటామన్న ప్రధానమంత్రి
October 05th, 04:18 pm
భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల తీవ్రంగా ప్రభావితమైన డార్జిలింగ్, పరిసర ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.జన్మదిన శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించిన అందరికీ ప్రధాని ధన్యవాదాలు
September 17th, 08:27 pm
తన 75వ పుట్టిన రోజు సందర్భంగా దేశ విదేశాల నుంచి అసంఖ్యాకంగా శుభాకాంక్షలు, ఆశీస్సులు, ఆప్యాయత నిండిన సందేశాలు అందించిన జనశక్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. వారి ప్రేమ తనకు శక్తిని, స్ఫూర్తిని అందిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు.PM Modi expresses gratitude to world leaders for birthday wishes
September 17th, 03:03 pm
The Prime Minister Shri Narendra Modi expressed his gratitude to the world leaders for greetings on his 75th birthday, today.ప్రధానమంత్రి పుట్టిన రోజు... శ్రీ ఓం బిర్లా శుభాకాంక్షలు...ప్రధాని కృతజ్ఞతలు
September 17th, 09:28 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు సందర్భంగా లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా.. ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. లోక్ సభ స్పీకర్‌కు ప్రధాని కృతజ్ఞతలను వ్యక్తం చేశారు. ‘‘మీ అందరి ప్రేమే నాలో నిరంతరం దేశసేవ చేస్తూండాలన్న స్ఫూర్తిని నింపుతోంది’’ అని శ్రీ మోదీ అన్నారు.పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన భారత ఉపరాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని
September 17th, 09:22 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు సందర్భంగా ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్.. ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. ఉపరాష్ట్రపతికి ప్రధాని కృతజ్ఞతలను వ్యక్తం చేశారు. ‘‘ దేశప్రజలకు అంకితభావంతో సేవ చేయాలన్న సంకల్పాన్ని మీరందించిన శుభాకాంక్షలు మరింత బలపరుస్తున్నాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన భారత రాష్ట్రపతి.. కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని
September 17th, 09:14 am
75వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి... రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్మూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిగా ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ‘‘140 కోట్ల మంది దేశ ప్రజలు చూపిస్తున్న ప్రేమ, వారు అందిస్తున్న అండదండలతో భారత్‌ను సుదృఢమైన, సమర్థమైన, స్వావలంబన కలిగిన దేశంగా తీర్చిదిద్దేందుకు మనం నిత్యం అంకితభావంతో కృషి చేద్దాం. ఈ బాటలో ముందుకు నడిచేందుకు మీ దార్శనికతతో పాటు మీ మార్గదర్శకత్వం మాకెంతో స్ఫూర్తినిస్తున్నాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
September 16th, 11:30 pm
తన 75వ పుట్టినరోజు సందర్భంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘భారత్ - అమెరికా సమగ్ర, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చేందుకు మీలాగే నేను కూడా పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ఉక్రెయిన్ ఘర్షణకు శాంతియుత పరిష్కారం దిశగా మీరు తీసుకునే చర్యలకు సహకరిస్తాం’’ అని శ్రీ మోదీ అన్నారు.