నార్వే అత్యున్నత ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ పురస్కారాన్ని అందుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

May 18th, 07:35 pm

నార్వే ఐదవ రాజు కింగ్ హెరాల్డ్ ఈ రోజు ఓస్లోలో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఇది విదేశీ ప్రభుత్వ అధినేతలకు నార్వే దేశం అందించే అత్యున్నత గౌరవం. నార్వే దేశ ప్రయోజనాలకు, మానవాళికి అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని బహూకరిస్తారు.