ప్రధానమంత్రి అధ్యక్షతన 51వ ప్రగతి సమావేశం
May 27th, 10:01 pm
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషిని సమర్థంగా సమన్వయం చేయడం ద్వారా క్రియాశీల పాలనను, సకాలంలో పథకాల అమలును నిర్ధారించడం లక్ష్యంగా పనిచేసే ఐసీటీ ఆధారిత బహుళ-మాధ్యమ వేదిక 'ప్రగతి' (పీఆర్ఏజీఏటీఐ) 51వ సమావేశం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు ఉదయం 'సేవా తీర్థ్'లో జరిగింది.ప్రధానమంత్రితో ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్ జీ భేటీ
April 27th, 12:31 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్ జీ ఈ రోజు సమావేశమయ్యారు. ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్ జీ వ్యక్తిగత జీవనం అత్యంత స్ఫూర్తిని ఇస్తోందని శ్రీ మోదీ అన్నారు. ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్ జీ ప్రతి సంఘర్షణా సమాజానికి సేవ చేయాలన్న ఆయన నిబద్ధతను మరింత బలపరిచిందని, ఇది ప్రజారోగ్య, వ్యాధినిరోధక చికిత్సా విధానం రంగానికి ఆయన అందించిన తోడ్పాటులో స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాని అన్నారు.నియామక సందర్భంగా ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్‌కు ప్రధాని అభినందన
April 25th, 10:47 pm
నీతి ఆయోగ్ సభ్యుడిగా నియమితుడైన ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పదవీకాలాన్ని విజయవంతంగా కొనసాగించాలంటూ శుభాకాంక్షలు అందించారు. ఆయన నిగర్వి అనీ, అలుపెరుగని అంకితభావంతో ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకంగా కొనసాగుతోందనీ శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ప్రజారోగ్యం, విజ్ఞాన శాస్త్రం, ఆవిష్కరణ రంగాల్లో ప్రొఫెసర్ దాస్ అమూల్య సేవలను ఆయన కొనియాడారు. ఆయన విజయాలతో దేశమంతా గర్విస్తోందన్నారు.