India is now moving beyond energy security towards the mission of energy independence: PM Modi at the India Energy Week 2026
January 27th, 10:15 am
In his address at the inauguration of India Energy Week 2026, PM Modi remarked that today India is a land of immense opportunities for the energy sector. He said that the recently signed India-European Union agreement will bring immense opportunities for India and European nations. As India’s energy sector offer investment opportunities worth $500 billion, the PM called upon the global community with the message: Make in India, Innovate in India, Scale with India, Invest in India.PM Modi addresses the inaugural ceremony of India Energy Week 2026 via video conferencing
January 27th, 10:08 am
In his address at the inauguration of India Energy Week 2026, PM Modi remarked that today India is a land of immense opportunities for the energy sector. He said that the recently signed India-European Union agreement will bring immense opportunities for India and European nations. As India’s energy sector offer investment opportunities worth $500 billion, the PM called upon the global community with the message: Make in India, Innovate in India, Scale with India, Invest in India.గోవా విముక్తి దినోత్సవం సందర్బంగా స్వాతంత్య్రయోధుల త్యాగాలను స్మరించుకున్న ప్రధానమంత్రి
December 19th, 10:35 am
గోవా విముక్తి దినోత్సవం భారత జాతీయ ప్రయాణంలో ఓ ముఖ్య అధ్యాయాన్ని గుర్తుకు తీసుకువస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. అన్యాయాన్ని సహించక, ధైర్యంతోనూ దృఢ సంకల్పంతోనూ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారి అజేయ సాహసాన్ని ఆయన స్మరించుకున్నారు. గోవా సర్వతోముఖ అభివృద్ధికీ, దేశానికీ వారు చేసిన త్యాగాలు సదా స్ఫూర్తిని అందిస్తుంటాయని ప్రధానమంత్రి అన్నారు.గోవాలోని అర్పోరాలో జరిగిన అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం
December 07th, 07:08 am
గోవాలోని అర్పోరాలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్తగలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
November 28th, 03:35 pm
ఈ రోజు ఈ పవిత్ర సందర్భంలో నా మనసు శాంతితో నిండిపోయింది. సాధువులు, మహర్షుల సమక్షంలో కూర్చోవడం ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు ఉండటం శతాబ్దాల నాటి ఈ మఠం శక్తిని మరింత బలోపేతం చేస్తుంది. ఈ వేడుకలో మీ మధ్య ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి రాకముందు, రామాలయం... వీర్ విఠల్ ఆలయాల్లో పూజలో పాల్గొనే భాగ్యం నాకు లభించింది. ఇక్కడి శాంతి, ప్రశాంత వాతావరణం ఈ వేడుక ఆధ్యాత్మిక సారాన్ని మరింతగా పెంచాయి.గోవాలో జరిగిన శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవంలో ప్రసంగించిన ప్రధానమంత్రి
November 28th, 03:30 pm
“శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవాన్ని చేసుకుంటోంది. ఇది చాలా చారిత్రాత్మక సందర్భం. గత 550 సంవత్సరాలలో ఈ మఠం అనేక కల్లోల పరిస్థితులను ఎదుర్కొంది. తరాలు మారినా, కాలాలు మారినా.. దేశంతో పాటు సమాజంలో అనేక పరివర్తనలు వచ్చినా మఠం ఎప్పుడూ దిశను కోల్పోలేదు. దీనికి బదులు ఈ మఠం ప్రజలకు మార్గదర్శక కేంద్రంగా మారింది. మఠానికి ఉన్న గొప్ప గుర్తింపు ఏంటంటే.. చరిత్రతో గట్టిగా పాతుకుపోయి ఉన్నప్పటికీ కాలంతో పాటు మారుతూ ముందుకు కదులుతూనే ఉంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. మఠం స్థాపించటంలో ఉన్న స్ఫూర్తి ఈ రోజు కూడా అదే విధంగా సజీవంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ స్ఫూర్తే సాధనను సేవతో, సంప్రదాయాన్ని ప్రజా సంక్షేమంతో మిలితం చేస్తోందన్నారు. ‘జీవితానికి స్థిరత్వం, సమతుల్యత, విలువలను అందించడం’ అనే ఆధ్యాత్మికతకు ఉన్న నిజమైన భావనను తరతరాలుగా మఠం తెలియజేస్తోందని ప్రధాని అన్నారు. కష్ట సమయాల్లో కూడా సమాజాన్ని నిలబెట్టే బలానికి మఠం చేసిన 550 సంవత్సరాల ప్రయాణమే నిదర్శనమని ఆయన ఉద్ఘాటించారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని మఠాధిపతి శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామీజీ, కమిటీలోని సభ్యులందరూ, ఈ వేడుకతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.నవంబర్ 28న కర్ణాటక, గోవా పర్యటనకు వెళ్లనున్న పీఎం
November 27th, 12:04 pm
నవంబర్ 28న కర్ణాటక, గోవాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆ రోజున ఉదయం 11:30 గంటలకు కర్ణాటక ఉడిపిలోని శ్రీ కృష్ణ మఠాన్ని సందర్శిస్తారు. అనంతరం గోవాకు చేరుకుని, మధ్యాహ్నం 3:15 గంటలకు శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం 550వ వార్షికోత్సవం 'సార్థ పంచశతమానోత్సవం' సందర్భంగా మఠాన్ని సందర్శిస్తారు.Prime Minister welcomes increased participation of youth in events like Ironman 70.3 at Goa
November 09th, 10:00 pm
The Prime Minister, Shri Narendra Modi has welcomed the increased participation by youth in events like Ironman 70.3 which was held in Goa today. Shri Modi stated that such events contribute towards FitIndia movement. Congratulations to everyone who took part. Delighted that two of our young Party colleagues, Annamalai and Tejasvi Surya are among those who have successfully completed the Ironman Triathlon, Shri Modi said.శ్రీ రవి నాయక్ మృతికి సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
October 15th, 08:58 am
గోవా ప్రభుత్వంలో మంత్రి శ్రీ రవి నాయక్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.భారతదేశానికి ఫైడ్ ప్రపంచ కప్ రావడాన్ని స్వాగతించిన ప్రధానమంత్రి
August 26th, 11:30 pm
ప్రతిష్ఠాత్మకమైన ఫైడ్ ప్రపంచ కప్- 2025కు భారత్ ఆతిథ్యం ఇవ్వటం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఎంతో గర్వ కారణమైన విషయమని, దీనికోసం ఎంతో ఉత్సహంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. 20 కంటే ఎక్కువ సంవత్సరాల తర్వాత ఈ టోర్నమెంటుకు భారతదేశం అతిథ్యం ఇవ్వనున్నది.ప్రధానమంత్రితో గోవా ముఖ్యమంత్రి భేటీ
August 20th, 06:11 pm
గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.ప్రధానమంత్రితో గోవా గవర్నర్ సమావేశం
August 04th, 05:04 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గోవా గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.2047లో అభివృద్ధి చెందిన భారతదేశానికి మార్గం స్వావలంబన ద్వారానే సాగుతుంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
July 27th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మళ్ళీ ఒకసారి మన దేశ సాఫల్యాల గురించి, మన ప్రజల విజయాల గురించి మాట్లాడుకుందాం. గత కొన్ని వారాల్లో – క్రీడలలోనైనా, శాస్త్రవిజ్ఞానంలోనైనా, సంస్కృతిలోనైనా – ఎన్నో గొప్ప సంఘటనలు జరిగాయి. ప్రతి భారతీయుడినీ గర్వపడేలా చేసిన విషయాలివి. శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణాన్ని ముగించుకొని భూమిపైకి ఇటీవల విజయవంతంగా తిరిగివచ్చిన సందర్భాన్ని దేశం యావత్తూ ఎంతో ఉత్సాహంగా గమనించింది. ఆయన భూమి పైకి తిరిగివచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా సంతోషాల వెల్లువ పెల్లుబికింది. ప్రతి హృదయంలో ఆనంద తరంగాలు పుట్టుకొచ్చాయి. దేశం అంతా గర్వంతో ఉప్పొంగిపోయింది. నాకు గుర్తుంది.... 2023 ఆగస్టులో చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రునిపై ల్యాండింగ్ అయిన తర్వాత దేశంలో శాస్త్రవిజ్ఞానం పట్ల, అంతరిక్ష పరిశోధన పట్ల ఒక కొత్త ఆసక్తి పిల్లల్లో ఏర్పడింది. తాము కూడా అంతరిక్ష యాత్ర చేస్తామని, చంద్రునిపై దిగుతామని, అంతరిక్ష శాస్త్రవేత్తలం అవుతామని ఇప్పుడు చిన్నారులు కూడా చెప్తున్నారు.గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
May 30th, 04:43 pm
గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘గోవా విశిష్ట సంస్కృతి భారత్‌కు గర్వకారణం. గోవా ప్రజలు వివిధ రంగాల్లో బలమైన ముద్ర వేశారు. ఎల్లవేళలా ప్రపంచం నలుమూలల నుంచి ప్రజల దృష్టిని ఈ రాష్ట్రం ఆకట్టుకుంటోంది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.ప్రధానమంత్రితో సమావేశమైన గోవా ముఖ్యమంత్రి
January 23rd, 02:48 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ఈరోజు సమావేశమయ్యారు.ఆస్తి సొంతదారులకు స్వామిత్వ పథకంలో భాగంగా
January 16th, 08:44 pm
స్వామిత్వ పథకంలో భాగంగా 65 లక్షలకు పైగా ఆస్తి కార్డులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంపిణీ చేయనున్నారు. జనవరి 18న మధ్యాహ్నం సుమారు 12 గంటల 30 నిమిషాలకు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రధాని 10 రాష్ట్రాలతోపాటు 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 230కి పైగా జిల్లాల్లో 50,000కు పైగా గ్రామాల్లో ఆస్తి సొంతదారులకు ఈ ఆస్తి కార్డుల్ని పంపిణీ చేస్తారు.రాజ్యాంగమే మనకు మార్గదర్శకం: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
December 29th, 11:30 am
మన్ కీ బాత్ యొక్క ఈ ఎపిసోడ్‌లో, రాజ్యాంగం యొక్క 75వ వార్షికోత్సవం మరియు ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ్ సన్నాహాలతో సహా భారతదేశం సాధించిన విజయాలను ప్రధాని మోదీ ప్రతిబింబించారు. బస్తర్ ఒలింపిక్స్ విజయాన్ని ఆయన ప్రశంసించారు మరియు ఆయుష్మాన్ భారత్ పథకం కింద మలేరియా నిర్మూలన మరియు క్యాన్సర్ చికిత్సలో పురోగతి వంటి ముఖ్యమైన ఆరోగ్య పురోగతులను హైలైట్ చేశారు. అదనంగా, ఒడిశాలోని కలహండిలో వ్యవసాయ పరివర్తనను ఆయన ప్రశంసించారు.స్వామిత్వ పథకం ద్వారా 50 లక్షల మందికి పైగా యాజమాన్య పత్రాలను పంపిణీ చేయనున్న ప్రధానమంత్రి
December 26th, 04:50 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 27 మధ్యాహ్నం 12.30 గం.లకు జరిగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పది రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 200 జిల్లాల్లో ఉన్న 46,000 గ్రామాల్లోని యజమానులకు స్వామిత్వ పథకం కింద 50 లక్షల స్థిరాస్థి కార్డులను అందజేస్తారు.గోవా విముక్తి దినోత్సవం ఈరోజే: గోవాకు స్వతంత్రాన్ని సాధించే ఉద్యమంలో పాల్గొన్న మహనీయ మహిళల, పురుషుల ధీరత్వాన్నీ, దృఢ సంకల్పాన్నీ గుర్తుకు తెచ్చుకొందాం: ప్రధానమంత్రి
December 19th, 06:17 pm
గోవా విముక్తి దినోత్సవం ఈ రోజు. ఈ సందర్బంగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. గోవాకు స్వతంత్రాన్ని సాధించడానికి చేపట్టిన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మహనీయ మహిళలు, పురుషులు కనబరిచిన ధైర్య సాహసాలను, దృఢ సంకల్పాన్నీ ఆయన గుర్తుచేసుకొన్నారు.Maharashtra has witnessed the triumph of development, good governance, and genuine social justice: PM Modi
November 23rd, 10:58 pm
Prime Minister Narendra Modi addressed BJP workers at the party headquarters following the BJP-Mahayuti alliance's resounding electoral triumph in Maharashtra. He hailed the victory as a decisive endorsement of good governance, social justice, and development, expressing heartfelt gratitude to the people of Maharashtra for trusting BJP's leadership for the third consecutive time.