కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో సహకారంపై భారత్ - జపాన్ సంయుక్త ప్రకటన
July 02nd, 10:14 pm
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు, సమాజాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, పరిశ్రమలూ - వ్యాపారాలూ, పాలన, భద్రతా రంగాల్లో విప్లవాత్మక మార్పులను తెస్తూ.. సర్వోపయోగకర సాంకేతికతగా నేటి కాలాన్ని కృత్రిమ మేధ (ఏఐ) శాసిస్తోందని భారత్, జపాన్ ప్రధానమంత్రులు వ్యాఖ్యానించారు. ఏఐ రూపకల్పన, అభివృద్ధి, విస్తరణ, పాలన అంశాల్లో నేడు మనం తీసుకునే నిర్ణయాలు.. భవిష్యత్తులో ఆవిష్కరణలు, సామాజిక సంక్షేమం, ఆర్థిక భద్రత, ప్రపంచ క్రమంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయని వారు అంగీకరించారు. ఈ అవగాహనే ప్రాతిపదికగా.. ఇరుదేశాల్లో ఆవిష్కరణలనూ, వృద్ధినీ పెంపొందించుకోవడంతోపాటు ఏఐ రంగంలో సామర్థ్యాన్నీ, పోటీతత్వాన్నీ పరస్పరం మెరుగుపరచుకునే దిశగా సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు. తద్వారా సురక్షితమైన, భద్రమైన, విశ్వసనీయ, సమ్మిళిత, మానవుడే కేంద్రంగా ఉండే, సుస్థిరమైన, జవాబుదారీతనంతో కూడిన ఏఐ వ్యవస్థను నిర్మించాలని వారు సంకల్పించారు.మారిషస్ ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి
June 28th, 08:45 pm
మారిషస్ ప్రధాని డాక్టర్ నవీన్ చంద్ర రామ్‌గూలంతో మహేలోని విక్టోరియాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. సీషెల్స్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల నేపథ్యంలో నాయకులు భేటీ అయ్యారు. 2024 నవంబరులో ప్రధానిగా రామ్‌గూలం బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన ప్రధానమంత్రి మోదీతో సమావేశం కావడం ఇది నాలుగోసారి.సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
June 28th, 05:00 pm
ఈ రోజే కొంచెం ముందు నాకు ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్’ పురస్కారాన్ని అందించి నన్ను గౌరవించినందుకు అధ్యక్షుడు ఎర్మినీ గారికి, సీషెల్స్ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతర కృషి చేస్తున్న వారందరికీ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇక్కడికి భారత్‌లోని 140 కోట్ల ప్రజల తరపున ఆత్మీయ శుభాకాంక్షలను, శుభాశీస్సులను తీసుకువచ్చాను.ప్రధానమంత్రి సీషెల్స్ పర్యటన (జూన్ 27-29, 2026)
June 25th, 06:05 pm
సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మిని ఆహ్వానం మేరకు, భారతదేశపు 'మహాసాగర్' దార్శనికతను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ 2026 జూన్ 27-29 తేదీలలో సీషెల్స్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరై, అధ్యక్షుడు హెర్మినితో చర్చలు జరుపుతారు. ఆయన సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించి, ప్రవాస భారతీయులతో కూడా సంభాషిస్తారు.బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, సీనియర్ భద్రతా అధికారులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ భేటీ
June 23rd, 08:06 pm
బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, సీనియర్ భద్రతా అధికారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. ప్రస్తుత ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో బ్రిక్స్ కూటమికి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు.భారత్‌లో సెయింట్-గోబైన్ కార్యకలాపాల విస్తరణపై సీఈవో బెనోయిట్ బాజిన్‌తో చర్చించిన ప్రధాని
June 18th, 06:39 pm
సెయింట్-గోబైన్ సీఈవో శ్రీ బెనోయిట్ బాజిన్‌తో చర్చలపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు బయలుదేరే ముందు ప్రధానమంత్రి అధికారిక ప్రకటన
June 13th, 10:03 am
ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షులు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, స్లోవాక్ రిపబ్లిక్ ప్రధానమంత్రి శ్రీ రాబర్ట్ ఫికోల ఆహ్వానం మేరకు... నేను ఈ నెల 13 నుంచి 18 వరకు ఫ్రాన్స్, స్లోవాక్ రిపబ్లిక్ దేశాల్లో పర్యటించనున్నాను.శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ దేశాల అధినేతలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన ప్రధానమంత్రి
June 10th, 11:50 pm
హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసిన ప్రపంచ దేశాల నాయకులకు, అన్ని వర్గాల ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అభినందనలు ఎంతో ప్రభావితం చేశాయని, భారత్‌కు సేవ చేయటం, దేశాభివృద్ధి ప్రయాణంలో భాగస్వామి కావటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రజల విశ్వాసమే తనకు ఎంతో బలమన్నారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేసేందుకు, 140 కోట్ల మంది భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటానికి, భారతదేశానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయటానికి మరింత అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై… భారత ప్రధానమంత్రిగా అత్యధిక కాలం కొనసాగిన శ్రీ నరేంద్ర మోదీకి ప్రపంచ నాయకుల అభినందనలు
June 09th, 07:32 pm
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, అత్యధిక కాలం భారత ప్రధానమంత్రిగా సేవలందిస్తున్న శ్రీ నరేంద్ర మోదీని ప్రపంచ నేతలు హృదయపూర్వకంగా అభినందించారు. ప్రపంచంలోని వివిధ దేశాల నాయకులు ఆయన పరిణామాత్మక పాలనను, వర్ధమాన దేశాల కోసం చేస్తున్న కృషిని కొనియాడారు. సార్వజనీన, గతిశీల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను రూపొందించడంపై ఆయన దార్శనికతను వారు వేనోళ్ల ప్రశంసించారు.Visit of Prime Minister to France and Slovakia (June 13-18, 2026)
June 09th, 07:20 pm
PM Modi will visit France from 13-14 June 2026 and again from 16-19 June 2026. During his initial visit to France, he will hold discussions with President Emmanuel Macron and jointly inaugurate the 'Bharat Innovates' event. He will then visit Slovakia from 14-16 June 2026 to hold discussions with PM Robert Fico and meet President Peter Pellegrini. The PM will once again visit France to participate in the G7 Summit and the VivaTech Summit.ప్రధానమంత్రితో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలి భేటీ
June 04th, 09:50 pm
వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు శ్రీమతి డెల్సీ రోడ్రిగ్జ్ ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.నార్వే ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా భారత ప్రధానమంత్రి పత్రికా ప్రకటన
May 18th, 04:44 pm
గతేడాదే నేను నార్వేలో పర్యటించాల్సి ఉంది. అయితే, పహల్గాంలో ఉగ్రవాద దాడి కారణంగా ఆ పర్యటనను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ క్లిష్ట సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు నార్వే అండగా నిలిచింది. మన స్నేహబంధం శక్తికి ఇది నిదర్శనం. ఆ మద్దతు, సంఘీభావం పట్ల ఈ రోజు నార్వే పర్యటన సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.టీవీ9 సమ్మిట్-2026లో ప్రధానమంత్రి ప్రసంగం
March 23rd, 08:30 pm
ఇటీవల ఒకటి, రెండు సార్లు టీవీ9 భారత్‌వర్ష్ చూసే అవకాశం వచ్చింది. యుద్ధాలు, క్షిపణి దాడులపై మీరు దృష్టి సారిస్తున్నారు. మీకు కంటెంట్ కూడా విపరీతంగా లభిస్తుంది. టీవీ9కి తగినంత సమాచారాన్ని అందించాలని పెద్ద దేశాలు బలంగా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమైన విషయం ఏంటంటే.. ప్రస్తుతం ప్రపంచం, మునుపెన్నడూ లేనివిధంగా ఆందోళనకర, అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచనలకు కీలకమైన వేదికను టీవీ9 వ్యవస్థ సృష్టించింది. ఈ సదస్సులో భారత్, ప్రపంచం అంశంపై మీరంతా చర్చిస్తున్నారు. ఈ సదస్సును నిర్వహిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతూ.. కార్యక్రమం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా సదస్సుకు విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం.టీవీ9 నెట్‌వర్క్ సమ్మిట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం
March 23rd, 08:00 pm
'భారత్ - ప్రపంచం' ఇతివృత్తంతో టీవీ9 నెట్‌వర్క్ ఈ రోజు నిర్వహించిన సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అసాధారణ, క్లిష్ట పరిస్థితులను ఆయన ప్రస్తావించారు. ఇలాంటి కీలక సమయంలో ఆలోచనల మార్పిడికి ఒక వేదికను సిద్ధం చేసిన టీవీ9 నెట్‌వర్క్‌ను ప్రధాని అభినందించారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితులు అసాధారణమైనవి. అత్యంత క్లిష్టమైనవి. ఇలాంటి సమయంలో ఆలోచనల మార్పిడికి టీవీ9 నెట్‌వర్క్ ఒక ముఖ్యమైన వేదికను సిద్ధం చేసింది” అని శ్రీ మోదీ అన్నారు.నెక్ట్స్ సమ్మిట్ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
March 12th, 10:47 pm
ఇవాళ మార్చి 12వ తేదీ చరిత్రాత్మకమైన రోజు. మార్చి 12, 1930న సబర్మతి ఆశ్రమం నుంచి మహాత్మాగాంధీ దండి యాత్ర ప్రారంభించారు. ఇది భారత స్వాతంత్రోద్యమాన్ని మలుపు తిప్పిన సంఘటన. ఈ ప్రయాణం దేశంలోని ప్రతి మూలను తాకింది. దీని ప్రధాన లక్ష్యం భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించటం. ఈ చరిత్రాత్మక రోజుకు నేటితో 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారతీయులుగా మనం మరో ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. ఆ ప్రయాణమే అభివృద్ధి చెందిన భారత్ (వికసిత్ భారత్) కోసం అడుగులు వేయటం. మన లక్ష్యం ఒకటే. మన గమ్యం ఒకటే - అభివృద్ధి చెందిన భారతదేశం. ఈ లక్ష్యాన్ని చేరుకోవటంలో ఇలాంటి సదస్సుల్లో జరిగే మేధోమధనం, వాటి ద్వారా లభించే సారాంశం కీలక పాత్ర పోషిస్తాయి. నెక్ట్స్ సమ్మిట్ కు ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దేశవిదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన ఎంతో మందిలో పాత మిత్రులు కూడా ఉన్నారు. మీ అందరికీ నా నమస్కారాలు.ఎన్‌ఎక్స్‌టీ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
March 12th, 08:30 pm
చారిత్రాత్మక దండి యాత్ర వార్షికోత్సవం సందర్భంగా ఐటీవీ నెట్‌వర్క్ నిర్వహించిన ఎన్ఎక్స్‌టీ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగించారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి, అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రస్తుత లక్ష్యానికి మధ్య ఉన్న పోలికలను ఆయన వివరించారు. 1930 నాటి దండి యాత్ర దేశాన్ని స్వాతంత్య్రం వైపు ఎలాగైతే ఏకం చేసిందో ప్రస్తుత 'వికసిత భారత్' మిషన్ కూడా 140 కోట్ల భారతీయుల ఉమ్మడి లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. “చారిత్రాత్మక దండి యాత్ర ప్రారంభమై దాదాపు 100 సంవత్సరాలు గడిచిన తరుణంలో నేడు భారతీయులమైన మనం మరోసారి 'వికసిత భారత్' సాధన కోసం ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాం” అని ప్రధాని పేర్కొన్నారు.న్యూస్ 18 రైజింగ్ భారత్ సదస్సులో ప్రధాని ప్రసంగం
February 27th, 08:30 pm
‘రైజింగ్ ఇండియా’ గురించి మీరంతా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అంతర్గత శక్తి గురించి ఎక్కువగా చెబుతున్నారు. సూటిగా చెప్పాలంటే.. స్వభావ సిద్ధమైన దేశ స్వీయ సామర్థ్యాల మీదే మీరు ప్రధానంగా దృష్టి సారించారు. ‘తత్వమసి’ అని మన గ్రంథాలు బోధిస్తున్నాయి. అంటే, మనం ఎక్కడో వెతుకులాడుతున్న దైవిక శక్తి మనలోనే ఉంది. అది మనమే. ఆ శక్తి మనలోనే ఉంది. దాన్ని మనం గుర్తించాలి. గత 11 ఏళ్లలో భారత్ తనలో ఉన్న ఈ అసలైన శక్తిని గుర్తించింది. నేడు ఆ శక్తి ప్రవర్ధమానమయ్యేలా దేశం నిరంతరం పురోగమిస్తోంది.నెట్‌వర్క్ 18 రైజింగ్ భారత్ సదస్సులో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 27th, 08:00 pm
రైజింగ్ భారత్ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రసంగించారు. ‘అంతర్గత శక్తి’ అంశంపై ఆయన ప్రసంగం సాగింది. గత 11 ఏళ్లలో దేశ ప్రయాణం, జాతీయ సామర్థ్యాన్ని తిరిగి పొందడం, ఆర్థిక స్వావలంబన, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం కోసం రూపొందించిన ప్రణాళిక గురించి సుదీర్ఘంగా ప్రసంగించారు.ఇజ్రాయెల్ ప్రధానమంత్రితో కలిసి నిర్వహించిన ఉమ్మడి మీడియా సమావేశంలో భారత ప్రధాని చేసిన ప్రకటన
February 26th, 03:30 pm
తొమ్మిదేళ్ల క్రితం, ఇజ్రాయెల్‌ను సందర్శించిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రిగా నిలిచే గౌరవం నాకు దక్కింది. ఈ చారిత్రక ఇజ్రాయెల్ గడ్డపై మరోసారి అడుగు పెట్టడం నాకు గర్వకారణం. ఇంకా అత్యంత భావోద్వేగపూరితమైన క్షణంగా అనిపిస్తోంది.ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా మారిషస్ ప్రధానమంత్రితో ప్రధానమంత్రి భేటీ
February 20th, 10:13 pm
న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రాంగులాంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. 2025 సెప్టెంబర్ తర్వాత ప్రధానమంత్రి రాంగులాం పదవీ కాలంలో.. భారత్ పర్యటనకు రావటం ఇది రెండో సారి. 09 ఫిబ్రవరి 2026న వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణ తర్వాత ఈ భేటీ జరిగింది.