ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సదస్సు-2025లో ప్రధానమంత్రి ప్రసంగం

November 03rd, 11:00 am

ఈరోజు జరిగే కార్యక్రమం సైన్స్‌కు సంబంధించింది. అయితే ముందుగా నేను క్రికెట్‌లో భారత్ సాధించిన అద్భుత విజయం గురించి మాట్లాడతాను. యావత్ భారతం తమ క్రికెట్ జట్టు విజయంతో చాలా సంతోషంగా ఉంది. ఇది భారత మహిళల జట్టుకు మొట్టమొదటి ప్రపంచ కప్. మన మహిళా క్రికెట్ జట్టును నేను అభినందిస్తున్నాను. మేం మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం. మీ విజయం దేశవ్యాప్తంగా కోట్లాది మంది యువతకు స్ఫూర్తినిస్తుంది.

ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

November 03rd, 10:30 am

ఈ రోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ (ఈఎస్‌టీఐసీ) 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. దేశ విదేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, పరిశోధనా సంస్థల సభ్యులు, ఇతర విశిష్ట అతిథులకు స్వాగతం పలికారు. ఐసీసీ మహిళ ప్రపంచ కప్‌ 2025లో భారత క్రికెట్ జట్టు సాధించిన అద్భుతమైన విజయంతో దేశమంతా ఆనందంతో ఉప్పొంగిపోయిందన్నారు. తొలిసారి భారత్ మహిళా ప్రపంచ కప్ గెలిచిందంటూ.. దీన్ని సాధించిన మహిళల జట్టుకు అభినందనలు తెలియజేశారు. వారిని చూసి దేశం గర్విస్తోందని, వారు సాధించిన విజయం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది యువతకు స్ఫూర్తినిస్తుందన్నారు.

ఇండియా స్టీల్ 2025 కార్యక్రమంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

April 24th, 02:00 pm

నేటి నుంచి రెండు రోజుల వరకు, భారత్‌లో అభివృద్ధి చెందుతున్న ఉక్కు రంగ సామర్థ్యం, అవకాశాల గురించి విస్తృతమైన చర్చల్లో మనం పాల్గొనబోతున్నాం. దేశాభివృద్ధికి వెన్నెముకగా వికసిత్ భారత్ కు బలమైన పునాదిగా దేశాభివృద్ధిలో నూతన అధ్యాయాన్ని ఈ రంగం లిఖిస్తుంది. ఇండియా స్టీల్ 2025కు మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. నూతన ఆలోచనలు పంచుకోవడానికి, కొత్త భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఓ మంచి వేదికగా నిలుస్తుందని విశ్వసిస్తున్నాను. స్టీలు రంగంలో నూతన అధ్యాయ ప్రారంభానికి ఇది పునాది వేస్తుంది.

ఇండియా స్టీల్ 2025 కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

April 24th, 01:30 pm

ముంబయిలో నిర్వహిస్తున్న ఇండియా స్టీల్ 2025 కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. భారత్‌లో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న, భవిష్యత్తులో విస్తృతంగా అభివృద్ధి చెందడానికి అపారమైన అవకాశాలున్న ఉక్కు రంగంపై ప్రధానంగా దృష్టి సారిస్తూ వచ్చే రెండు రోజులపాటు చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రంగం భారత పురోగతికి పునాది వేస్తుందని, అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేలా భారత మూలాలను బలోపేతం చేస్తుందని, విప్లవాత్మకమైన మార్పుల దిశగా దేశంలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియా స్టీల్- 2025 కార్యక్రమానికి ప్రతి ఒక్కరికీ ఆయన ఆహ్వానం పలికారు. కొత్త ఆలోచనలను పంచుకోవడానికి, కొత్త భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ప్రయోగ వేదికగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ఉక్కు రంగంలో కొత్త అధ్యాయానికి పునాది వేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

ఎంఎస్ఎంఈ రంగంపై నిర్వహించిన బడ్జెట్ అనంతర వెబినార్లు మూడింటిని ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం

March 04th, 01:00 pm

క్యాబినెట్ సహచరులు, ఆర్థిక వ్యవహారాల నిపుణులు, పారిశ్రామికవేత్తలు, సోదర సోదరీమణులారా!

బడ్జెట్ అనంతర వెబినార్లనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

March 04th, 12:30 pm

బడ్జెట్ అనంతర వెబినార్లనుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. వృద్ధి చోదకాలుగా ఎంఎస్ఎంఈలు, తయారీ, ఎగుమతులు, అణు ఇంధన కార్యక్రమాలు, నియంత్రణ, పెట్టుబడి, సులభతర వాణిజ్య సంస్కరణలు అన్న అంశాలపై వెబినార్లను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తయారీ, ఎగుమతులపై బడ్జెట్ అనంతర వెబినార్లకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. తమ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్ అని చెప్తూ, అంచనాలను మించి విస్తరించడం ఇందులోని ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. అనేక రంగాల్లో నిపుణులు ఊహించిన దానికి మించి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ బడ్జెట్ లో తయారీ, ఎగుమతులకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

2022 స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో.. ‘అమృత్ కాల్’లో దేశంలో పరిశోధన – అభివృద్ధి ప్రాధాన్యాన్ని ప్రస్తావించిన ప్రధాని: ‘జై అనుసంధాన్’ నినాదాన్నిచ్చిన ప్రధాని

November 25th, 08:42 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్ పథకానికి ఆమోదం తెలిపింది. నిపుణుల పరిశోధన వ్యాసాలు, పత్రికల్లో ప్రచురణలను ఈ కేంద్ర ప్రభుత్వ పథకం (సెంట్రల్ సెక్టార్ స్కీమ్) దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తుంది. సరళమైన, వినియోగదారీ అనుకూల, పూర్తి సాంకేతిక ప్రక్రియ ద్వారా ఈ పథకాన్ని నిర్వహిస్తారు. ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ పరిశోధన-అభివృద్ధి సంస్థలకు ‘వన్ నేషన్ వన్ సబ్ స్క్రిప్షన్’ సదుపాయం ఉంటుంది.

బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సు ప్రారంభ ప్లీనరీలో ప్రధాన మంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

October 23rd, 05:22 pm

16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును అద్భుతంగా నిర్వహిస్తున్న్నందుకు అధ్యక్షుడు పుతిన్ కు అభినందనలు.

సామాన్య మానవుడి జీవనాన్ని సులభతరం చేయడంలో డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది: ప్రధాని మోదీ

July 09th, 05:35 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌రియు దక్షిణ కొరియా అధ్యక్షులు శ్రీ మూన్ జే ఇన్ నోయెడా లో ఒక భారీ మొబైల్ త‌యారీ యూనిట్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ, భార‌త‌దేశాన్ని ప్ర‌పంచ త‌యారీ కేంద్రంగా తీర్చి దిద్దేందుకు సాగుతున్న ప్ర‌యాణం లో ఇది ఒక ప్ర‌త్యేక సంద‌ర్భం అని, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్య‌క్ర‌మానికి ఇది బ్బలాన్న్ చేకూరుస్తుందన్నారు. స్మార్ట్ ఫోన్ లు, బ్రాడ్ బ్యాండ్‌, ఇంకా స‌మాచార రాశి సంధానం.. వీటి విస్త‌ర‌ణ‌ ను భార‌త‌దేశం లో ఓ డిజిట‌ల్ విప్ల‌వ సంకేతాలు గా ఆయ‌న అభివ‌ర్ణించారు.

నోయెడా లో మొబైల్ త‌యారీ స‌దుపాయాన్ని ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి మ‌రియు కొరియా అధ్య‌క్షులు

July 09th, 05:34 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌రియు కొరియా గ‌ణ‌తంత్రం అధ్యక్షులు శ్రీ మూన్ జే ఇన్ నోయెడా లో శామ్‌సంగ్‌ ఇండియా ఎల‌క్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఒక భారీ మొబైల్ త‌యారీ యూనిట్ ను ఈ రోజు ప్రారంభించారు.