న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రధానమంత్రి ప్రసంగం
January 17th, 11:00 am
నేను గత లోక్‌సభ ఎన్నికలు సమీపంలో ఉన్న సమయంలో మిమ్మల్ని కలుసుకున్నాను. ఆ సమయంలో మీ అందరి నమ్మకం వల్ల వచ్చేసారి కూడా ఇండియా మొబిలిటీ ఎక్స్‌పోకు నేను తప్పకుండా వస్తానని చెప్పాను. దేశం మమ్మల్ని మూడోసారి ఆశీర్వదించింది. మీరంతా మరోసారి నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
January 17th, 10:45 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీ లోని భారత మండపంలో రవాణా కు సంబంధించి దేశంలోనే అతి పెద్ద మొబిలిటీ ఎక్స్ పో- భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ ప్రభుత్వాన్ని వరుసగా మూడోసారి ఎన్నుకున్నందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గత ఏడాది 800 మంది ఎగ్జిబిటర్లు, 2.5 లక్షల మంది సందర్శకులతో పోలిస్తే, నేషనల్ క్యాపిటల్ రీజియన్ లోని మరో రెండు వేదికలపై ఎక్స్ పో జరగడంతో ఈ ఏడాది ఎక్స్ పో పరిమాణం బాగా పెరిగిందని ఆయన అన్నారు. వచ్చే 5 రోజుల్లో అనేక కొత్త వాహనాలను ప్రారంభిస్తారని, ఈ ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో ప్రతినిధులు హాజరవుతారని శ్రీ మోదీ పేర్కొన్నారు. “ఇది భారతదేశంలో మొబిలిటీ భవిష్యత్‌పై గొప్ప సానుకూలతను చూపిస్తుంది” అని ఆయన అన్నారు. ఎగ్జిబిషన్ ను సందర్శించిన సందర్భంగా శ్రీ మోదీ మాట్లాడుతూ, భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ అద్భుతమైనది, భవిష్యత్తుకు సిద్ధంగా ఉంది అని అన్నారు. ప్రతి ఒక్కరికీ తన శుభాకాంక్షలను తెలియజేశారు.గ్లోబల్ పార్ట్ నర్‌శిప్ ఆన్ ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (జిపిఎఐ) వార్షిక శిఖర సమ్మేళనాన్ని డిసెంబరు 12వ తేదీ నాడు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
December 11th, 04:27 pm
గ్లోబల్ పార్ట్‌నర్‌శిప్ ఆన్ ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (జిపిఎఐ) సమిట్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 12 వ తేదీ నాడు సాయంత్రం పూట దాదాపు గా 5 గంటల వేళ లో న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో ప్రారంభించనున్నారు.