ఎల్‌వీఎం3-ఎం6 ద్వారా బ్లూబర్డ్ బ్లాక్-2ను విజయవంతంగా ప్రయోగించిన అంతరిక్ష శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను అభినందించిన ప్రధాని
December 24th, 10:04 am
ఎల్‌వీఎం3-ఎం6 వాహక నౌక ద్వారా అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన అంతరిక్ష శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. భారత భూభాగం అత్యంత బరువైన ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశ పెట్టడం ఇదే తొలిసారి. ఇది భారత అంతరిక్ష ప్రయాణంలో గర్వించదగిన విజయమని, ఆత్మనిర్భర భారత్ దిశగా చేస్తున్న ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు.భద్రతా సహకారంపై భారత్-జపాన్ సంయుక్త ప్రకటన
August 29th, 07:43 pm
భారత్-జపాన్ ప్రభుత్వాలు (ఇకమీదట ఇరుపక్షాలూ), ఉమ్మడి విలువలు, ప్రయోజనాల ఆధారంగా భారత్-జపాన్ రాజకీయ దృక్పథాన్ని, ప్రత్యేక వ్యూహాత్మక, ప్రాపంచిక భాగస్వామ్య లక్ష్యాలను గుర్తుచేసుకోవడం, నిబంధనల ఆధారితమైన అంతర్జాతీయ క్రమాన్ని సమర్థించే ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని స్వేచ్ఛాయుతమైన, అందరికీ అందుబాటులో గల, శాంతియుతమైన, సుసంపన్నమైన, ఎలాంటి ఒత్తిళ్లు లేని ప్రాంతంగా అభివృద్ధి చేయడంలో ఇరుదేశాల కీలక పాత్రను ప్రధానంగా ప్రాస్తావించడం, ఇటీవలి సంవత్సరాల్లో ఇరుదేశాల మధ్య గణనీయ పురోగతిని సాధించిన ద్వైపాక్షిక భద్రతా సహకారం.. ఇరుపక్షాల వ్యూహాత్మక దృక్పథం, పాలసీ ప్రాధాన్యాల పరిణామాలను ప్రస్తావించడం, ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చే వనరులు, సాంకేతిక సామర్థ్యాల పరంగా ఇరుదేశాల సమష్టి బలాలను గుర్తించడం, ఇరుదేశాల జాతీయ భద్రత, నిరంతర ఆర్థికవృద్ధి పరంగా ఆచరణాత్మక సహకారాన్ని పెంపొందించుకోవడానికి కట్టుబడి ఉండటం, ఇండో-పసిఫిక్ ప్రాంతం, ఆ పొరుగున ఉన్న ప్రాంతాలకు సంబంధించిన ఉమ్మడి భద్రతా సమస్యలను పరిష్కరించే విషయంలో మరింత సమన్వయాన్ని సాధించడం, రూల్ ఆఫ్ లా ఆధారంగా అంతర్జాతీయ క్రమాన్ని సమర్థించుటకు కట్టుబడి ఉండటం, ఇరుదేశాల భాగస్వామ్యంలో నూతన దశను ప్రతిబింబిస్తూ భద్రతా సహకారంపై ఈ సంయుక్త ప్రకటనను ఆమోదించాయి. అలాగే కింది అంశాల్లో ఏకాభిప్రాయానికి వచ్చాయి:రానున్న దశాబ్దంపై భారత్-జపాన్ ఉమ్మడి దృక్కోణం: ఎనిమిది లక్ష్యాలతో ప్రత్యేక వ్యూహాత్మక-ప్రపంచ భాగస్వామ్యానికి సారథ్యం
August 29th, 07:11 pm
ఇండో-పసిఫిక్ ప్రాంతంపై భారత్, జపాన్ దేశాలది ఉమ్మడి దృక్కోణం. ఈ ప్రాంతం చట్టబద్ధ పాలన సహిత స్వేచ్ఛ, సౌహార్దం, శాంతి, సౌభాగ్యాలతో ఘర్షణ రహితంగా పురోగమించాలన్నది రెండు దేశాల అభిమతం. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు పరస్పర సహాయకారిగా మెలగుతాయి. వనరులు, సాంకేతికత, ఉత్పత్తి వ్యయం రీత్యా పోటీతత్వంలో రెండింటికీ ప్రత్యేక బలాలున్నాయి. దీంతోపాటు సుదీర్ఘ సుహృద్భావ, చారిత్రక స్నేహబంధం ఉన్నందువల్ల ఇకపైనా జంటగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. రాబోయే దశాబ్దంలో మన దేశాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మార్పులు, అవకాశాలు అందిరానున్నాయి. వీటన్నిటి సద్వినియోగం దిశగా సంయుక్త సారథ్యానికి మేం సిద్ధంగా ఉన్నామని సందర్భంగా ప్రకటిస్తున్నాం. జాతీయ లక్ష్యాల సాధనతో్పాటు మన దేశాలను, భవిష్యత్తరం పౌరులను మునుపటికన్నా చేరువ చేయడానికి మా నాయకత్వం తోడ్పడుతుంది.15th India-Japan Annual Summit Joint Statement: Partnership for Security and Prosperity of our Next Generation
August 29th, 07:06 pm
PM Modi and Japanese PM Ishiba held the delegation-level talks during which they recalled the longstanding friendship between India and Japan. The two Prime Ministers made a series of announcements focusing on three priority areas: bolstering defense and security cooperation, reinforcing economic partnership and deepening people-to-people exchanges.జపాన్ మరియు చైనాలలో ప్రధానమంత్రి పర్యటన
August 22nd, 06:15 pm
జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా మరియు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ 2025 ఆగస్టు 29–30 వరకు జపాన్‌లో మరియు 2025 ఆగస్టు 31–1 సెప్టెంబర్‌లో చైనాలో పర్యటిస్తారు. జపాన్‌లో, ప్రధాని 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు మరియు జపాన్ ప్రధాని ఇషిబాతో చర్చలు జరుపుతారు. చైనాలో, ప్రధాని టియాంజిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు.