మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు- 2025 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

February 24th, 10:35 am

ముందుగా నేను ఇక్కడికి రావడం ఆలస్యమైనందుకు క్షమాపణలు కోరుతున్నాను. 10, 12వ తరగతి విద్యార్థులకు ఈ రోజు పరీక్షలున్నాయని నిన్న నేనిక్కడికి వచ్చినప్పుడు తెలిసింది. వారి పరీక్షల సమయం, రాజ్ భవన్ నుంచి నేను బయలుదేరే సమయం ఒకేసారి ఉన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా రోడ్లను మూసేస్తే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఇబ్బందులు పడతారు. వారికి అసౌకర్యం కలగకుండా విద్యార్థులంతా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నాకే రాజ్ భవన్ నుంచి బయలుదేరాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఆలస్యమైంది. అలా కావాలనే నేను నా ప్రయాణాన్ని 15-20 నిమిషాలు ఆలస్యం చేశాను. ఇది మీకు కొంత అసౌకర్యాన్ని కలిగించింది. నన్ను మన్నించాలని మరోసారి మీ అందరినీ కోరుతున్నాను.

మధ్యప్రదేశ్ భోపాల్ లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు-2025 ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

February 24th, 10:30 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మధ్యప్రదేశ్ భోపాల్ లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్-2025 (జీఐఎస్)ను ప్రారంభించారు. సదస్సుకు ఆలస్యంగా చేరుకున్నందుకు క్షమాపణలు తెలియచేసిన ప్రధాని, బోర్డు పరీక్షలకు హాజరయ్యే 10వ, 12వ తరగతి విద్యార్థులు, తన రాక కోసం ఇదే మార్గంలో చేసే భద్రతాపరమైన ఏర్పాట్ల వల్ల ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఆలస్యంగా బయలుదేరినట్లు చెప్పారు. భోజరాజు పాలించిన ప్రాంతంలో ఏర్పాటైన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు మదుపర్లను, వ్యాపారవేత్తలను ఆహ్వానించడం తనకు గర్వకారణమని శ్రీ మోదీ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వికసిత్ మధ్యప్రదేశ్ కీలకం కాబట్టి నేటి కార్యక్రమం ముఖ్యమైందని ప్రధాని అన్నారు. సదస్సు నిర్వహణ కోసం అద్భుతమైన ఏర్పాట్లను చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా శ్రీ మోదీ అభినందించారు.

ఈనెల 23 నుంచి 25 వరకు మధ్య ప్రదేశ్, బీహార్, అస్సాం రాష్ట్రాల్లో పర్యటించనున్న ప్రధానమంత్రి

February 22nd, 02:05 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈనెల 23 నుంచి 25 వరకు మధ్యప్రదేశ్, బీహార్, అస్సాం రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈమేరకు 23వ తేదీన మధ్యప్రదేశ్‌లోనిచత్తర్‌పూర్ జిల్లాలో మధ్యాహ్నం 2గంటలకు బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు ఆయన శంకుస్థాపన చేస్తారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు భోపాల్‌లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 2025ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఆ తర్వాత, మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రధానమంత్రి బీహార్‌లోని భాగల్‌పూర్‌ చేరుకుని 19వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తారు, అలాగే ఆ రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు. అనంతరం ఆయన సాయంత్రం 6గంటలకు గౌహతి చేరుకుని జూమోయిర్ బినందిని (మెగా జూమోయిర్) 2025 కార్యక్రమానికి హాజరవుతారు. 25వ తేదీ ఉదయం 10:45గంటలకు గౌహతిలో అడ్వాంటేజ్ అస్సాం 2.0 పెట్టుబడి, మౌలిక సదుపాయాల సదస్సు 2025ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.