జనవరి 28న ఒడిశా, ఉత్తరాఖండ్‌లలో ప్రధానమంత్రి పర్యటన
January 27th, 06:44 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 28న ఒడిశాలోనూ, ఉత్తరాఖండ్‌లోనూ పర్యటించనున్నారు. ఉదయం సుమారు 11 గంటలకు ఆయన ‘ఉత్కర్ష్ ఒడిశా-మేక్ ఇన్ ఒడిశా కాన్‌క్లేవ్- 2025’ను భువనేశ్వర్‌లోని జనతా మైదానంలో ప్రారంభిస్తారు. ఆ తరువాత, ఆయన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు వెళ్తారు. అక్కడ సాయంత్రం 6 గంటలకు 38వ నేషనల్ గేమ్స్‌ను ఆయన ప్రారంభించనున్నారు.