ముంబయిలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఉత్సవం ఆరో ఎడిషన్‌లో ప్రధాని ప్రసంగం
October 09th, 02:51 pm
గౌరవ బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్, ఆవిష్కర్తలు, నాయకులు, ఫిన్‌టెక్ రంగ పెట్టుబడిదారులు, సోదరీ సోదరులారా! మీ అందరికీ ముంబయికి హృదయపూర్వక స్వాగతం!ముంబయిలో నిర్వహించిన ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2025’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
October 09th, 02:50 pm
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో నిర్వహిస్తున్న ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2025’ (అంతర్జాతీయ సాంకేతికార్థిక సదస్సు)లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ తొలుత ఆయన హృదయపూర్వక స్వాగతం పలికారు. ముంబయిని ఇంధన, వాణిజ్య నగరంగా, అపార అవకాశాల కూడలిగా శ్రీ మోదీ అభివర్ణించారు. ఈ సందర్భంగా యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) ప్రధానమంత్రి, తన మిత్రుడైన గౌరవనీయ కీర్ స్టార్మర్‌ను ప్రత్యేకంగా స్వాగతిస్తూ- ఈ కార్యక్రమానికి సమయం కేటాయించడంపై కృతజ్ఞతలు తెలిపారు.యూకే ప్రధానితో కలసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటనకు తెలుగు అనువాదం
October 09th, 11:25 am
భారత్‌లో తొలిసారి పర్యటిస్తున్న ప్రధాని కీర్ స్టార్మర్‌కు ముంబయిలో ఈ రోజు స్వాగతం చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను.అక్టోబరు 8,9 తేదీల్లో మహారాష్ట్రలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటన
October 07th, 10:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 8వ, 9వ తేదీల్లో మహారాష్ట్రలో పర్యటిస్తారు. ప్రధానమంత్రి మధ్యాహ్నం సుమారు 3 గంటలకు నవీ ముంబయికి చేరుకొంటారు. కొత్తగా కట్టిన నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆయన పరిశీలిస్తారు. ఆ తరువాత, సుమారు మూడున్నర గంటల వేళకు, ప్రధానమంత్రి నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు ముంబయిలో వివిధ పథకాలను కూడా ప్రారంభించి, జాతికి అంకితమిస్తారు. ఈ సందర్భంగా జనసమూహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.ముంబయి ‘వేవ్స్ సమ్మిట్’లో ప్రధానమంత్రి ప్రసంగం
May 01st, 03:35 pm
వేవ్స్ సమ్మిట్ వేదికపై ఆసీనులైన మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫఢన్‌వీస్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ అశ్వినీ వైష్ణవ్, శ్రీ ఎల్.మురుగన్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ ఏక్‌నాథ్ షిండే, శ్రీ అజిత్ పవార్, ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసిన సృజనాత్మక లోక ప్రముఖులు, వివిధ దేశాల సమాచార-ప్రసార, కమ్యూనికేషన్, కళ-సాంస్కృతిక శాఖల మంత్రులు, రాయబారులు, సృజనాత్మక లోక ప్రసిద్ధులు, ఇతర ప్రముఖులు, మహిళలు, గౌరవనీయ అతిథులారా!వేవ్స్ 2025ను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ
May 01st, 11:15 am
మొట్టమొదటి ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ - వేవ్స్ 2025ను ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకొంటున్న మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అంతర్జాతీయ ప్రతినిధులు, రాయబారులు, సృజనాత్మక రంగానికి చెందిన నిపుణులను స్వాగతిస్తూ.. వేవ్స్ ప్రాధాన్యాన్ని వివరించారు. 100కు పైగా దేశాకు చెందిన కళాకారులు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు కలసి అంతర్జాతీయ స్థాయి ప్రతిభ, సృజనాత్మక వ్యవస్థకు పునాది వేశారని పేర్కొన్నారు. ‘‘వేవ్స్ కేవలం సంక్షిప్త పదం కాదు.. సంస్కృతిని, సృజనాత్మకతను, అంతర్జాతీయ సంబంధాలను సూచించే తరంగం’’ అని వర్ణించారు. అలాగే ఈ సదస్సు సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, కథలు చెప్పడానికి సంబంధించిన విస్తృతమైన ప్రపంచాన్ని ప్రదర్శిస్తుందని ప్రధాని అన్నారు. అదే సమయంలో కళాకారులు, రూపకర్తలకు భాగస్వామ్యాలు పెంచుకొనేందుకు అంతర్జాతీయ స్థాయి వేదికను ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ శుభకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి హాజరైన విశిష్ట అతిథులకు స్వాగతం పలికారు.గుజరాత్, గాంధీనగర్ లో రీ ఇన్వెస్ట్ 2024 కార్యక్రమ ప్రారంభోత్సవ సందర్భంగా ప్రధాని ప్రసంగం
September 16th, 11:30 am
జర్మనీ ఆర్థిక సహకార మంత్రి , డెన్మార్క్ పరిశ్రమల వ్యాపార మంత్రితో సహా విదేశాల నుండి వచ్చిన విశిష్ట అతిథులూ , నా మంత్రి మండలి సభ్యులు ప్రహ్లాద్ జోషి జీ, శ్రీపాద్ నాయక్ జీ , పలు దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు...గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రపంచ 4వ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు-ప్రదర్శన (రీ-ఇన్వెస్ట్)కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం
September 16th, 11:11 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని గాంధీనగర్‌లోగల మహాత్మా మందిర్‌లో ‘ప్రపంచ 4వ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు-ప్రదర్శన’ (రీ-ఇన్వెస్ట్)ను ప్రారంభించారు. మన దేశం 200 గిగావాట్ల శిలాజేతర ఇంధన స్ధాపిత సామర్థ్యం సాధించడంలో సహకరించిన కీలక భాగస్వాములను ఈ మూడు రోజుల శిఖరాగ్ర సదస్సులో భారత్ సత్కరిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ-ప్రైవేట్ రంగ కంపెనీలు, అంకుర సంస్థలు, ప్రధాన పారిశ్రామిక సంస్థలలో అత్యాధునిక ఆవిష్కరణలతో సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను శ్రీ మోదీ తిలకించారు.ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ లో ప్రధాన మంత్రి ప్రసంగం
August 30th, 12:00 pm
ఇటీవలే జన్మాష్టమిని జరుపుకున్న దేశం ప్రస్తుతం పండుగ వాతావరణం లో ఉంది. మన ఆర్థిక వ్యవస్థలోనూ, మార్కెట్లలోనూ పండుగ వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంబర వాతావరణంలోనే మనం గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నాం, అలాంటి కార్యక్రమానికి కలల నగరమైన ముంబై కంటే మంచి ప్రదేశం ఏముంటుంది. దేశం నలుమూలల నుంచి, ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, స్వాగతం. ఇక్కడికి రాకముందు వివిధ ప్రదర్శనలను సందర్శించే అవకాశం, పలువురు మిత్రులతో మమేకమయ్యే అవకాశం లభించింది. అక్కడ, మన యువత నాయకత్వంలో, భవిష్యత్తు అవకాశాలతో నిండిన కొత్త ఆవిష్కరణల ప్రపంచాన్ని నేను చూశాను. మీ పనికి అనుగుణంగా, మరో మాటలో చెప్పాలంటే: నిజంగా ఒక కొత్త ప్రపంచం ఆవిర్భవిస్తోంది. ఈ ఉత్సవ నిర్వాహకులను, పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను.ముంబైలో గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్(జీఎఫ్ఎఫ్) 2024లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
August 30th, 11:15 am
మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఇవాళ జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్ఎఫ్) 2024లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను సైతం ప్రధానమంత్రి సందర్శించారు. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫిన్‌టెక్ కన్వర్జెన్స్ కౌన్సిల్ కలిసి జీఎఫ్ఎఫ్‌ను సంయుక్తంగా నిర్వహించాయి. ఫిన్‌టెక్ రంగంలో భారత్ సామర్థ్యాలను ప్రదర్శించడంతో పాటు ఈ రంగంలోని కీలక భాగస్వామ్య పక్షాలను ఒక్కచోటకు చేర్చడమే ఈ కార్యక్రమం లక్ష్యం.ఆగస్టు 30న మహారాష్ట్రను సందర్శించనున్న ప్రధానమంత్రి
August 29th, 04:47 pm
మహారాష్ట్ర లోని పాల్‌ఘర్, ముంబయిలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 30వ తేదీన సందర్శించనున్నారు. ఉదయం దాదాపు 11 గంటలకు ప్రధాన మంత్రి ముంబయి లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటరుకు చేరుకొని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జిఎఫ్ఎఫ్) కార్యక్రమంలో పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రధానమంత్రి పాల్‌ఘర్ లోని సిఐడిసిఒ మైదానానికి చేరుకొని, వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభించి, శంకుస్థాపనలు చేస్తారు.