భారత్-ఫిజీ సంయుక్త ప్రకటన: పరస్పర స్నేహభావం స్పూర్తిగా భాగస్వామ్యం

August 25th, 01:52 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు.. ఫిజీ రిపబ్లిక్ ప్రధానమంత్రి శ్రీ సితివేని రబుకా భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ నెల 24 నుంచి 26 వరకు ఫిజీ ప్రధాని అధికారిక పర్యటన భారత్‌లో కొనసాగనుంది. ప్రధాని హోదాలో తొలిసారిగా భారత్‌లో పర్యటిస్తున్న శ్రీ రబుకా వెంట ఆయన సతీమణి, ఫిజీ వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ ఆంటోనియో లాలాబలావు, ఫిజీ రిపబ్లిక్ ప్రభుత్వ సీనియర్ అధికారుల ప్రతినిధి బృందం ఉన్నారు.

ఫిజీ ప్రధానితో సంయుక్త పత్రికా ప్రకటన: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇంగ్లిషు పత్రికా ప్రకటనకు తెలుగు అనువాదం

August 25th, 12:30 pm

ఆ కాలంలో, మనం ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ కోఆపరేషన్‌ను (ఎఫ్ఐపీఐసీ) ప్రారంభించాం. ఈ కార్యక్రమం భారత్-ఫిజీ సంబంధాల్ని పటిష్ఠపరచడం ఒక్కటే కాకుండా, పూర్తి పసిఫిక్ రంగంతో మన బంధాలకు ఒక కొత్త శక్తిని కూడా అందించింది. ఈ రోజున, ప్రధాని శ్రీ రాబుకా పర్యటనతో మన సంబంధాలకు ఒక నూతన అధ్యాయాన్ని జత చేస్తున్నాం.

ప్రధానమంత్రి నమీబియా పర్యటనలో జరిగిన ఒప్పందాల జాబితా

July 09th, 08:17 pm

నమీబియాలో ఔత్సాహిక వ్యాపార సంస్థల అభివృద్ధి కేంద్రం ఏర్పాటుపై అవగాహన ఒప్పందం

పర్యావరణం, కాప్-30లతో పాటు ప్రపంచ ఆరోగ్యం అంశాలపై బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సు.. ప్రసంగించిన ప్రధానమంత్రి

July 07th, 11:38 pm

పర్యావరణం, కాప్-30, ప్రపంచ ఆరోగ్యసంరక్షణ’’ అంశాలపై సోమవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలతో పాటు పాలుపంచుకోవాల్సిందంటూ ఆహ్వానాన్ని అందుకున్న దేశాలు కూడా పాల్గొన్నాయి. ప్రపంచ భవిష్యత్తును పరిగణనలోకి తీసుకొని ఇలాంటి అధిక ప్రాధాన్యం కలిగిన అంశాలపై కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు బ్రెజిల్‌కు ఆయన తన ధన్యవాదాలు తెలిపారు. వాతావరణ మార్పును ఇంధన సమస్యల పరిష్కారం అనే ఒకే అంశంతో ముడిపెట్టి చూడడం భారతదేశం దృక్పథం కాదని, జీవనానికి ప్రకృతికి మధ్య సమతూకాన్ని ప్రభావితం చేసే అంశం ఇదని తమ దేశం భావిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. వాతావరణ పరంగా న్యాయాన్ని ఏర్పరచడం అంటే అది ఒక నైతిక బాధ్యత అని, దీనిని తప్పక నిర్వర్తించాల్సిందేనని భారత్ సంకల్పించిందని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. పర్యావరణ సంరక్షణ దిశలో కార్యాచరణను చేపట్టడానికి భారత్ ఎంతో చిత్తశుద్ధితో ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ప్రజానుకూల, భూగ్రహానికి మిత్రపూర్వక ప్రగతిసాధక విధానాలను ప్రోత్సహించడానికి తీసుకొంటున్న వివిధ కార్యక్రమాలను గురించి ఆయన సమగ్రంగా సభకు వివరించారు. ఈ సందర్భంగా మిషన్ లైఫ్ (పర్యావరణ అనుకూల జీవనం), 'ఏక్ పేడ్ మా కే నామ్' (తల్లి పేరు మీద ఒక మొక్కను నాటడం), అంతర్జాతీయ సౌరశక్తి కూటమి, సమర్థవంతమైన విపత్తు సన్నద్ధ కూటమి (కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రేజీలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్), హరిత హైడ్రోజన్ మిషన్, ప్రపంచ జీవ ఇంధన వేదిక, పులుల సంరక్షణ కూటమి (బిగ్ క్యాట్స్ అలయన్స్) తదితర కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.

పర్యావరణం, కాప్-30, ప్రపంచ ఆరోగ్య అంశాలపై ఏర్పాటైన బ్రిక్స్ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

July 07th, 11:13 pm

బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతాల్లో భాగంగా పర్యావరణ, ఆరోగ్య భద్రత అంశాలకు బ్రెజిల్ అత్యధిక ప్రాధాన్యతనివ్వడం నాకు సంతోషం కలిగిస్తోంది. ఇవి పరస్పర సంబంధం గల అంశాలే కాక మానవాళి సంక్షేమానికి, ఉజ్జ్వల భవిష్యత్తుకూ ఎంతో ముఖ్యమైనవి.

ఘనా పార్లమెంటునుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

July 03rd, 03:45 pm

ప్రజాస్వామ్య స్ఫూర్తి, గౌరవం, దృఢత్వంతో తొణికిసలాడే ఘనా దేశాన్ని సందర్శించడం అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను. ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రతినిధిగా, నా వెంట 1.4 బిలియన్ భారతీయుల శుభాకాంక్షలను తీసుకువచ్చాను.

ఘనా పార్లమెంటులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

July 03rd, 03:40 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఘనా పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొలి భారత ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. పార్లమెంట్ స్పీకర్ గౌరవనీయ అల్బన్ కింగ్స్‌ఫోర్డ్ సుమనా బాగ్బిన్ నిర్వహించిన ఈ సమావేశానికి పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వ అధికారులు, ఇరు దేశాల నుంచి విశిష్ట అతిథులు హాజరయ్యారు. ఈ ప్రసంగం భారత్-ఘనా సంబంధాల్లో ఒక ముఖ్యమైన సందర్భంగా నిలిచింది. ఇది రెండు దేశాలను ఏకం చేసే పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించింది.

ఘనా అధ్యక్షునితో సంయుక్త పత్రికా ప్రకటన... ప్రధాని ప్రకటనకు తెలుగు అనువాదం

July 03rd, 12:32 am

మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం అనంతరం భారత ప్రధానమంత్రి ఘనాను సందర్శించారు.

మారిషస్‌లోని భారతీయులతో సమావేశంలోప్రధానమంత్రి ప్రసంగం

March 12th, 06:07 am

పదేళ్ల కిందట ఇదే తేదీన నేను మారిషస్‌ పర్యటనకు వచ్చేనాటికి ఓ వారం ముందే మేం హోలీ పండుగ చేసుకున్నాం. అప్పుడు భారత్‌ నుంచి హోలీ వేడుకల సంరంభాన్ని నాతో మోసుకొచ్చాను. అయితే, ఈసారి వర్ణరంజిత హోలీ సంరంభాన్ని మారిషస్‌ నుంచి మన దేశానికి తీసుకెళ్తాను. ఈ నెల 14వ తేదీన హోలీ కాబట్టి.. వేడుకలకు మరొక రోజు మాత్రమే ఉంది.

మారిషస్‌లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

March 11th, 07:30 pm

మారిషస్ ప్రధాని శ్రీ నవీన్ చంద్ర రాంగులాంతో పాటు భారత్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మారిషస్‌లోని ట్రాయోన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటైన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ సముదాయాన్ని, ఇండియా మిత్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వృత్తినిపుణులు, సామాజిక సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, వ్యాపార రంగ ప్రముఖులు సహా భారతీయ ప్రవాసులు చాలా మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే మారిషస్ మంత్రులు అనేక మందితోపాటు పార్లమెంట్ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రధానమంత్రి ప్రసంగం

January 17th, 11:00 am

నేను గత లోక్‌సభ ఎన్నికలు సమీపంలో ఉన్న సమయంలో మిమ్మల్ని కలుసుకున్నాను. ఆ సమయంలో మీ అందరి నమ్మకం వల్ల వచ్చేసారి కూడా ఇండియా మొబిలిటీ ఎక్స్‌పోకు నేను తప్పకుండా వస్తానని చెప్పాను. దేశం మమ్మల్ని మూడోసారి ఆశీర్వదించింది. మీరంతా మరోసారి నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

January 17th, 10:45 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీ లోని భారత మండపంలో రవాణా కు సంబంధించి దేశంలోనే అతి పెద్ద మొబిలిటీ ఎక్స్ పో- భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ ప్రభుత్వాన్ని వరుసగా మూడోసారి ఎన్నుకున్నందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గత ఏడాది 800 మంది ఎగ్జిబిటర్లు, 2.5 లక్షల మంది సందర్శకులతో పోలిస్తే, నేషనల్ క్యాపిటల్ రీజియన్ లోని మరో రెండు వేదికలపై ఎక్స్ పో జరగడంతో ఈ ఏడాది ఎక్స్ పో పరిమాణం బాగా పెరిగిందని ఆయన అన్నారు. వచ్చే 5 రోజుల్లో అనేక కొత్త వాహనాలను ప్రారంభిస్తారని, ఈ ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో ప్రతినిధులు హాజరవుతారని శ్రీ మోదీ పేర్కొన్నారు. “ఇది భారతదేశంలో మొబిలిటీ భవిష్యత్‌పై గొప్ప సానుకూలతను చూపిస్తుంది” అని ఆయన అన్నారు. ఎగ్జిబిషన్ ను సందర్శించిన సందర్భంగా శ్రీ మోదీ మాట్లాడుతూ, భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ అద్భుతమైనది, భవిష్యత్తుకు సిద్ధంగా ఉంది అని అన్నారు. ప్రతి ఒక్కరికీ తన శుభాకాంక్షలను తెలియజేశారు.

Be it COVID, disasters, or development, India has stood by you as a reliable partner: PM in Guyana

November 21st, 02:15 am

PM Modi and Grenada PM Dickon Mitchell co-chaired the 2nd India-CARICOM Summit in Georgetown. PM Modi expressed solidarity with CARICOM nations for Hurricane Beryl's impact and reaffirmed India's commitment as a reliable partner, focusing on development cooperation aligned with CARICOM's priorities.

భారత్- కరికమ్ రెండో శిఖరాగ్ర సమావేశం

November 21st, 02:00 am

భారత్-కరికమ్ రెండో శిఖరాగ్ర సమావేశాన్ని జార్జ్‌టౌన్‌లో నిన్న నిర్వహించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కరికమ్ కు ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న గ్రెనడా ప్రధాని శ్రీ డికన్ మిషెల్‌లు ఈ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించారు. శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీకి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. భారత్- కరికమ్ తొలి శిఖరాగ్ర సమావేశాన్ని 2019లో న్యూయార్క్‌ లో నిర్వహించారు. గయానా అధ్యక్షుడు, గ్రెనెడా ప్రధానిలకు తోడు శిఖరాగ్ర సమావేశంలో పాలుపంచుకొన్నా వారిలో..

బ్రెజిల్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ

November 20th, 08:05 pm

రియో డి జనీరో లో జరుగుతున్న జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 19న బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాకియో లూలా ద సిల్వా తో సమావేశమయ్యారు. శ్రీ లూలా ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపిన ప్రధాని, జి-20, ఐబీఎస్ఏ (భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా కూటమి) అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలియజేశారు. పేదరికం, క్షుద్బాధల నిర్మూలన కోసం ప్రపంచ స్థాయి సహకార సమితిని ప్రారంభించాలన్న శ్రీ లూలా యోచన పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రీ మోదీ, సంస్థకు భారత్ సంపూర్ణ మద్దతునిస్తుందని వెల్లడించారు. మూడు దేశాల జి-20 ప్రత్యేక బృందం (ట్రోయికా) సభ్య దేశంగా బ్రెజిల్ జి-20 ఎజెండాకు శ్రీ మోదీ సంపూర్ణ మద్దతును తెలిపారు. జి-20 కార్యాచరణ పత్రంలో సుస్థిరాభివృద్ధి, ప్రపంచ పాలనలో సంస్కరణలు వంటి లక్ష్యాలను పేర్కొనడం సహా అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలకు ప్రాముఖ్యాన్నివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వచ్చే యేడాది బ్రెజిల్ చేపట్టనున్న ‘బ్రిక్స్’ సదస్సు, ‘కాప్-30’ అధ్యక్ష బాధ్యతలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ మోదీ, బ్రెజిల్ కు భారత్ సహకారం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.

స్థిరాభివృద్ధి, ఇంధన వినియోగంలో మార్పు అంశాలపై జి20 కార్యక్రమం; ప్రధానమంత్రి ప్రసంగానికి అనువాదం

November 20th, 01:40 am

ఈ రోజు కార్యక్రమానికి ఎంపిక చేసుకొన్న ఇతివృత్తం చాలా సందర్భ శుద్ధిగలదీ, తరువాతి తరం భవిష్యత్తుతో ముడిపడిందీనూ. న్యూ ఢిల్లీలో ఇదివరకు జి20 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించినప్పుడు, స్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీస్) ను త్వరితగతిన సాధించడానికి ‘వారణాసి కార్యచరణ ప్రణాళిక’ను మనం ఆమోదించాం.

స్థిరాభివృద్ధి, ఇంధన వినియోగంలో మార్పు అంశాలపై నిర్వహించిన జి20 కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

November 20th, 01:34 am

స్థిరాభివృద్ధి, ఇంధన వినియోగంలో మార్పు అంశాలపై నిర్వహించిన జి20 కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. జి20 శిఖరాగ్ర సమావేశాన్ని ఇది వరకు న్యూఢిల్లీలో నిర్వహించినప్పుడు 2030కల్లా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడింతలు, ఇంధన సామర్ధ్యాన్ని రెండింతలు చేయాలని జి20 తీర్మానించిందని ఆయన గుర్తు చేశారు. స్థిరాభివృద్ధి సాధనకు సంబంధించిన ఈ ప్రాథమ్యాలను ముందుకు తీసుకు పోవాలని బ్రెజిల్ నిర్ణయించడాన్ని ఆయన స్వాగతించారు.

3వ కౌటిల్య ఆర్థిక సమ్మేళనం -2024 లో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

October 04th, 07:45 pm

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ప్రెసిడెంట్ ఎన్ కె సింగ్ గారు, ఈ సమ్మేళనంలో పాల్గొంటున్న దేశవిదేశాలకు చెందిన ఇతర విశిష్ట అతిథులు, మహిళలు, పెద్దలు!

న్యూఢిల్లీలో 3వ కౌటిల్య ఆర్థిక సమ్మేళనంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 04th, 07:44 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన కౌటిల్య ఆర్థిక సమ్మేళనంలో ప్రసంగించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో ఆర్థిక వృద్ధి సంస్థ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్) నిర్వహించిన కౌటిల్య ఆర్థిక సమ్మేళనంలో హరిత మార్పు కోసం నిధులు సమకూర్చడం, భౌగోళిక ఆర్థిక అనిశ్చితి, వృద్ధిపై ప్రతికూలప్రభావం, సుస్థిరత్వాన్ని పరిరక్షించడానికి విధాన కార్యాచరణ సూత్రాలు వంటి అంశాలపై దృష్టి సారించింది.

గుజ‌రాత్, గాంధీన‌గ‌ర్ లో రీ ఇన్వెస్ట్ 2024 కార్య‌క్ర‌మ ప్రారంభోత్స‌వ సంద‌ర్భంగా ప్ర‌ధాని ప్ర‌సంగం

September 16th, 11:30 am

జర్మనీ ఆర్థిక సహకార మంత్రి , డెన్మార్క్ పరిశ్రమల వ్యాపార మంత్రితో సహా విదేశాల నుండి వ‌చ్చిన‌ విశిష్ట అతిథులూ , నా మంత్రి మండ‌లి స‌భ్యులు ప్రహ్లాద్ జోషి జీ, శ్రీపాద్ నాయక్ జీ , ప‌లు దేశాల నుండి వ‌చ్చిన ప్రతినిధులు...