అనువాదం: గుజరాత్‌లో జరిగిన 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్'లో ప్రధానమంత్రి ప్రసంగం
January 11th, 12:00 pm
ప్రజాదరణ కలిగిన గౌరవ గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, ఉత్సాహవంతుడైన యువ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వి గారు.. గుజరాత్ ప్రభుత్వ మంత్రులు జితుభాయ్ వాఘాని, అర్జున్‌భాయ్ మోద్వాడియా, డాక్టర్ ప్రద్యుమ్న వాజా, కౌశిక్ భాయ్ వేకారియా.. పార్లమెంటు సభ్యుడు రాజేష్‌భాయ్, ఇతర విశిష్ట అతిథులు, సోదరీసోదరులారా.. ఈ రోజు దేశ నలుమూలలకు చెందిన లక్షలాది మంది ప్రజలు మనతో అనుసంధానమై ఉన్నారు.. వారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ‘సోమనాథుడికి విజయం కలుగుగాక’!!గుజరాత్‌లోని సోమనాథ్‌లో నిర్వహించిన సోమనాథ్ స్వాభిమాన్ పర్వంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 11th, 11:41 am
గుజరాత్‌లోని సోమనాథ్‌లో ఈ రోజు నిర్వహించిన సోమనాథ్ స్వాభిమాన్ పర్వంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సమయం అసాధారణమైనది... ఈ వాతావరణం అసాధారణమైనది... ఈ వేడుక అసాధారణమైనది అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఒక వైపు స్వయంగా మహాదేవుడు... మరోవైపు సూర్యకిరణాలు, మంత్రాల ప్రతిధ్వని, ఉప్పొంగుతున్న భక్తితో కూడిన సముద్రపు అలలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో సోమనాథ్... భక్తులందరి ఉనికితో ఈ సందర్భాన్ని మరింత దివ్యమైనదిగా, గొప్పగా మారుస్తోందని ఆయన పేర్కొన్నారు. సోమనాథ్ ఆలయ ట్రస్ట్ ఛైర్మన్‌గా తనకు సోమనాథ్ స్వాభిమాన్ పర్వంలో చురుగ్గా సేవ చేసే అవకాశం లభించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని శ్రీ మోదీ సంతోషం వ్యక్తం చేశారు. 72 గంటల పాటు నిరంతరాయంగా ఓంకారం జపించడం... 72 గంటల పాటు మంత్ర పఠనం చేయడం అద్భుతమని ఆయన పేర్కొన్నారు. నిన్న సాయంత్రం వెయ్యి డ్రోన్లతో... వేద గురుకులాలకు చెందిన వెయ్యి మంది విద్యార్థులు నిర్వహించిన అద్భుత ప్రదర్శన సోమనాథుని వెయ్యి సంవత్సరాల గాథను ఎంతో చక్కగా వివరించిందన్నారు. 108 అశ్వాలతో సాగిన 'శౌర్య యాత్ర' ఈ రోజు ఆలయానికి చేరుకుందని ఆయన తెలిపారు. మంత్రాలు, భజనలతో భక్తులందరినీ మంత్రముగ్ధులను చేసిన ఈ ప్రదర్శన మాటలకు అతీతమని... కాలం మాత్రమే ఈ అనుభవాన్ని సంగ్రహించగలదని ఆయన వివరించారు. ఈ వేడుక దర్పం, గౌరవం, హుందాతనం, జ్ఞానం, గొప్పతనం, వారసత్వం, ఆధ్యాత్మికత, సాక్షాత్కారం, అనుభవం, ఆనందం, సాన్నిహిత్యాల కలయికగా ఉందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అన్నింటికీ మించి ఇది భగవాన్ మహాదేవుని ఆశీర్వాదాలను కలిగి ఉందని ఆయన స్పష్టం చేశారు.25 మే 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 122 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
May 25th, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం... నేడు యావద్దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంఘటితమై ఉంది. ఆగ్రహంతో ఉంది. సంకల్పబద్ధంగా ఉంది. నేడు ప్రతి భారతీయుడి సంకల్పం ఉగ్రవాదాన్ని అంతం చేయడమే. మిత్రులారా! 'ఆపరేషన్ సిందూర్' సమయంలో మన సైన్యాలు చూపిన పరాక్రమం ప్రతి హిందుస్థానీ శిరస్సును ఉన్నతంగా నిలిపింది. సరిహద్దు దాటి, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంలో మన సైన్యాలు చూపిన ఖచ్చితత్వం, స్పష్టత అద్భుతం. 'ఆపరేషన్ సిందూర్' ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటానికి కొత్త నమ్మకాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది.ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా, వన్యప్రాణుల్ని చూడడానికి ఈ రోజు ఉదయం గిర్ వెళ్లాను.. అది రాజసం ఉట్టిపడే ఆసియా సింహాల ఆవాసమని మనకందరికీ తెలుసు; గిర్ చేరుకోవడంతో నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమంతా కలసి పూర్తి చేసిన పనుల జ్ఞాపకాలెన్నో మదిలో మెదిలాయి: ప్రధానమంత్రి
March 03rd, 12:03 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వన్యప్రాణులను చూడడానికి గిర్ వెళ్లారు. రాచఠీవి ఉట్టిపడే ఆసియా సింహాల నివాసంగా గిర్ సుపరిచితమే.గిర్ ను గురించి, ఆసియా సింహాలను గురించి శ్రీ పరిమళ్ నాథ్ వానీ వ్రాసిన పుస్తకాన్ని అందుకొన్న ప్రధాన మంత్రి
July 31st, 08:10 pm
గిర్ ను గురించి, ఆసియా సింహాలను గురించి రాజ్య సభ సభ్యుడు శ్రీ పరిమళ్ నాథ్ వానీ వ్రాసిన ఒక కాఫీ టేబుల్ బుక్ ‘‘కాల్ ఆఫ్ ద గిర్’’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వీకరించారు.సింహాలసంరక్షణ పట్ల మక్కువ ను కలిగి ఉన్న వారందరికీ ప్రపంచ సింహాల దినం సందర్భం లోఅభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
August 10th, 11:19 am
సింహాల సంరక్షణ పట్ల మక్కువను కలిగి ఉన్న వారందరికీ ప్రపంచ సింహాల దినం సందర్భంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు.