'వికసిత భారత్' సంకల్పం తప్పక నెరవేరుతుంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

December 28th, 11:30 am

ఈ ఏడాది చివరి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, 2025 సంవత్సరంలో జాతీయ భద్రత, క్రీడలు, సైన్స్ ప్రయోగశాలలు మరియు అంతర్జాతీయ వేదికలపై భారతదేశం తనదైన ముద్ర వేసిందని అన్నారు. నవసంకల్పాలతో 2026లో ముందుకు సాగడానికి దేశం సిద్ధంగా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్, క్విజ్ పోటీ, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025 మరియు ఫిట్ ఇండియా ఉద్యమం వంటి యువత కేంద్రీకృత కార్యక్రమాలను కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ప్రజల సమిష్టి ప్రయత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 'మన్ కీ బాత్' ఒక అద్భుతమైన వేదిక: ప్రధాని మోదీ

November 30th, 11:30 am

ఈ నెల మన్ కీ బాత్‌లో, రాజ్యాంగ దినోత్సవ వేడుకలు, వందేమాతరం 150వ వార్షికోత్సవం, అయోధ్యలో ధర్మ ధ్వజ ఆవిష్కరణ, ఐఎన్‌ఎస్ 'మహే' ప్రవేశం మరియు కురుక్షేత్రలో అంతర్జాతీయ గీతా మహోత్సవం వంటి నవంబర్‌లో జరిగిన కీలక సంఘటనలను ప్రధాని మోదీ హైలైట్ చేశారు. రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు & తేనె ఉత్పత్తి, భారతదేశ క్రీడా విజయాలు, మ్యూజియంలు మరియు సహజ వ్యవసాయం వంటి అనేక ముఖ్యమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. కాశీ-తమిళ సంగమంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని ప్రధాని కోరారు.

కోయంబత్తూరులో జరిగిన దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ సదస్సు 2025లో రైతులతో పీఎం సంభాషణ

November 20th, 12:30 pm

ఇవన్నీ విలువ జోడించిన అరటి ఉత్పత్తులే.. ఇవి వ్యర్థాలు.. సార్, ఇది అరటి వ్యర్థాల నుంచి, ఇది అరటి నుంచి తయారు చేసినది సార్

తమిళనాడులోని కోయంబత్తూరులో దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ సదస్సు-2025లో రైతులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటామంతీ

November 20th, 12:16 pm

తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహిస్తున్న దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ సదస్సు - 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రైతులతో మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ఆయన అభివాదం చేస్తూ, అరటి పంట దిగుబడిని పరిశీలించారు. అరటి వ్యర్థాలను ఏం చేస్తారని ఆయన వారిని అడిగారు. దీనికి రైతు సమాధానమిస్తూ, ప్రదర్శనకు పెట్టినవన్నీ అరటి వ్యర్థాల్ని ఉపయోగించి తయారు చేసిన వస్తువులేనన్నారు. వారి ఉత్పాదనలను దేశమంతటా ఆన్‌లైన్లో అమ్ముతున్నారా అని ప్రధానమంత్రి అడిగారు. అవును, అమ్ముతున్నామని రైతు బదులిచ్చారు. తాము ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల (ఎఫ్‌పీఓల)తో పాటు వ్యక్తిగతంగా కూడా పూర్తి తమిళనాడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని ఆ రైతు చెప్పారు. తమ ఉత్పాదనలను ఇంటర్నెట్ ద్వారా అమ్ముతున్నట్లు, ఎగుమతి చేస్తున్నట్లు, దేశవ్యాప్తంగా స్థానిక మార్కెట్లతో పాటు సూపర్‌మార్కెట్లలో కూడా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఒక్కొక్క ఎఫ్‌పీఓలో ఎంత మంది కలిసి పనిచేస్తారని శ్రీ మోదీ అడిగారు. సుమారుగా ఒక వేయి మంది వరకు దీనిలో ఉంటారని రైతు జవాబిచ్చారు. అరటి సాగును ఒకే ప్రాంతంలో చేపడతారా, లేక ఇతర పంటలతో కలిపి సాగు చేస్తారా అని ప్రధాని ప్రశ్నించారు. వివిధ ప్రాంతాలు వేరు వేరు విశిష్ట ఉత్పాదనలలో ప్రావీణ్యాన్ని సంపాదించాయని రైతు వివరణనిస్తూ, తమ వద్ద జీఐ ఉత్పాదనలు కూడా ఉన్నాయని తెలిపారు.

డెహ్రాడూన్‌లో ఉత్తరాఖండ్ ఆవిర్భావ రజతోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

November 09th, 01:00 pm

ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీ గుర్మీత్ సింగ్, శాసనసభ స్పీకర్ సోదరి శ్రీ రీతూ, ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ అజయ్ టమ్టా, రాష్ట్ర మంత్రులు, వేదికను అలంకరించిన ఎంపీలు, మాజీ ముఖ్యమంత్రులు, మమ్మల్ని ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన గౌరవనీయ సాధు జనులు, ఇతర విశిష్ట అతిథులు, సోదరీసోదరులారా!

ఉత్తరాఖండ్‌ రాష్ట్ర అవతరణ రజతోత్సవాన్ని పురస్కరించుకుని డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 09th, 12:30 pm

ఉత్తరాఖండ్‌ రాష్ట్ర అవతరణ రజతోత్సవాన్ని పుస్కరించుకొని డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆయన రూ. 8,140 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. దేవభూమి ఉత్తరాఖండ్ ప్రజలకు శుభాకాంక్షలు, హృదయపూర్వక వందనాలు తెలియజేశారు.

Let’s take a pledge together — Bihar will stay away from Jungle Raj! Once again – NDA Government: PM Modi in Chhapra

October 30th, 11:15 am

In his public rally at Chhapra, Bihar, PM Modi launched a sharp attack on the INDI alliance, stating that the RJD-Congress bloc, driven by vote-bank appeasement and opposed to faith and development, can never respect the beliefs of the people. Highlighting women empowerment, he said NDA initiatives like Drone Didis, Bank Sakhis, Lakhpati Didis have strengthened women across Bihar and this support will be expanded when NDA returns to power.

This election will bring RJD-Congress their biggest defeat ever, and NDA’s biggest victory: PM Modi in Muzaffarpur, Bihar

October 30th, 11:10 am

PM Modi addressed a massive public meeting in Muzaffarpur, Bihar and began by saying that this was his first public meeting after the Chhath Mahaparv. He said Chhath is the pride of Bihar and the nation, a festival celebrated across India and even around the world. PM Modi also launched a campaign to promote Chhath songs across the nation. He said, “The public will choose the best tracks, and their creators will be awarded - boosting the preservation of Chhath tradition.”

PM Modi’s grand rallies electrify Muzaffarpur and Chhapra, Bihar

October 30th, 11:00 am

PM Modi addressed two massive public meetings in Muzaffarpur and Chhapra, Bihar. Beginning his first rally, he noted that this was his first public meeting after the Chhath Mahaparv. He said that Chhath is the pride of Bihar and of the entire nation—a festival celebrated not just across India, but around the world. PM Modi also announced a campaign to promote Chhath songs nationwide, stating, “The public will choose the best tracks, and their creators will be awarded - helping preserve and celebrate the tradition of Chhath.”

29 జూన్ 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 123 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

June 29th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ అభినందనలు. మీరందరూ యోగా శక్తితో, అంతర్జాతీయ యోగా దినోత్సవ జ్ఞాపకాలతో నిండిపోయి ఉండాలి. ఈసారి కూడా జూన్ 21వ తేదీన, మనదేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది మంది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మీకు గుర్తుందా! ఇది 10 సంవత్సరాల కిందట ప్రారంభమైంది. ఇప్పుడు 10 సంవత్సరాలలో ఈ ధోరణి ప్రతి సంవత్సరం మరింత గొప్పగా మారుతోంది. ఎక్కువ మంది ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగాను అవలంబిస్తున్నారని ఇది సూచిస్తుంది. ఈసారి యోగా దినోత్సవ ఆకర్షణీయమైన చిత్రాలను మనం చాలా చూశాం. విశాఖపట్న సముద్ర తీరంలో మూడు లక్షల మంది కలిసి యోగా చేశారు. మరో అద్భుతమైన దృశ్యం కూడా విశాఖపట్నం నుండే వచ్చింది. రెండు వేలకు పైగా గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేసిన దృశ్యమది. ఊహించుకోండి! ఎంత క్రమశిక్షణ, ఎంత అంకితభావం ఉండి ఉంటుందో! మన నావికాదళ నౌకల్లో కూడా గొప్ప యోగా ప్రదర్శన కనిపించింది. తెలంగాణలో మూడు వేల మంది దివ్యాంగులు కలిసి యోగా శిబిరంలో పాల్గొన్నారు. సాధికారతకు యోగా ఎలా మాధ్యమం అవుతుందో వారు నిరూపించారు. ఢిల్లీ ప్రజలు యోగాను పరిశుభ్రమైన యమునా సంకల్పంతో అనుసంధానించి, యమునా నది ఒడ్డుకు వెళ్లి యోగా చేశారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ వంతెన వద్ద కూడా ప్రజలు యోగా చేశారు. హిమాలయాల మంచు శిఖరాల్లో ఐటీబీపీ సైనికులు చేసిన యోగా కనిపించింది. సాహసం, సాధన కలిసి సాగాయి. గుజరాత్ ప్రజలు కూడా కొత్త చరిత్రను సృష్టించారు. వడ్ నగర్‌లో 2121 మంది కలిసి భుజంగాసనం వేసి కొత్త రికార్డు సృష్టించారు. న్యూయార్క్, లండన్, టోక్యో, పారిస్ మొదలైన ప్రపంచంలోని ప్రతి పెద్ద నగరం నుండి యోగా చిత్రాలు వచ్చాయి. ప్రతి చిత్రంలో ఒక విషయం ప్రత్యేకంగా ఉంది. శాంతి, స్థిరత్వం, సమతుల్యత ఆ చిత్రాల్లో అంతర్భాగంగా ఉన్నాయి. ఈసారి థీమ్ కూడా చాలా ప్రత్యేకమైంది. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్.. అంటే 'ఒక భూమి - ఒక ఆరోగ్యం'. ఇది కేవలం నినాదం కాదు. ఇది 'వసుధైవ కుటుంబకం' అని మనల్ని అనుభూతి చెందించే దిశ. ఈ సంవత్సరం యోగా దినోత్సవ గొప్పతనం ఖచ్చితంగా ఎక్కువ మందిని యోగాను స్వీకరించడానికి ప్రేరేపిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

బీహార్‌లోని కారాకాట్‌లో వివిధ ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

May 30th, 11:29 am

బీహార్ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ప్రజాదరణగల ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ జీతన్ రామ్ మాంఝీ, శ్రీ లల్లన్ సింగ్, శ్రీ గిరిరాజ్ సింగ్, శ్రీ చిరాగ్ పాశ్వాన్, శ్రీ నిత్యానంద్ రాయ్, శ్రీ సతీష్ చంద్ర దూబే, శ్రీ రాజ్‌భూషణ్ చౌదరీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ సామ్రాట్ చౌదరీ, శ్రీ విజయ్ కుమార్ సిన్హా సహా కార్యక్రమానికి హాజరైన ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నా ప్రియ బీహార్ సోదరీసోదరులారా!

బీహార్‌లోని కారాకాట్‌లో రూ.48,520 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

May 30th, 10:53 am

బీహార్లోని కారాకాట్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రూ. 48,520 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. బీహార్ అభివృద్ధిని వేగవంతం చేసే అవకాశం తనకు దక్కిందని, ఈ పవిత్ర భూమిపై రూ. 48,000 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, భూమిపూజ చేశామని పేర్కొన్నారు. తనను ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. బీహార్ పట్ల వారికున్న అభిమానానికి, ప్రేమకు కృతజ్ఞతలు చెప్పారు. అన్ని సందర్భాల్లోనూ వారి మద్దతు తనకు లభించిందని అన్నారు. బీహార్‌లోని మాతృమూర్తులు, సోదరీమణులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

From seafood to tourism and trade, India is building a new ecosystem along the coastal regions: PM Modi in Bhuj, Gujarat

May 26th, 05:00 pm

PM Modi launched multiple development projects in Bhuj, Gujarat. Emphasizing that Kutch has demonstrated the power of hope and relentless effort in achieving remarkable success, the PM recalled the devastating earthquake that once led many to doubt the region’s future. He cited Dhola Vira and Lothal as prime examples of India's rich heritage. He also highlighted the UNESCO recognised Smriti Van memorial.

గుజరాత్‌లోని భుజ్‌లో రూ. 53,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

May 26th, 04:45 pm

పవిత్ర భూమి కచ్ లో ఆశాపుర మాత దివ్య ఉనికిని గుర్తు చేస్తూ, శ్రీ మోదీ ఆమెకు నివాళులు అర్పించారు. ఈ ప్రాంతంపై ఆమె నిరంతర ఆశీస్సులకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ, అక్కడి ప్రజలకు కూడా తన గౌరవాన్ని తెలియజేశారు.

బీహార్‌లోని మధుబనిలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ సంబంధిత కార్యక్రమంతో పాటు అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం‌

April 24th, 12:00 pm

నేను నా ప్రసంగాన్ని మొదలుపెట్టడాని కన్నా ముందు, మీకందరికీ ఒక వినతి చేస్తున్నాను... మీరు ఎక్కడ ఉన్న సరే, మీరు కూర్చున్న చోటే.. లేచి నిలబడనక్కర లేదు... మనం కూర్చొని ఉండే, ఈ నెల 22న మనం కోల్పోయిన కుటుంబసభ్యులకు నివాళిని సమర్పిద్దాం... మీరు ఆసీనులై ఉన్న చోటు నుంచే, కొన్ని క్షణాల పాటు మౌనాన్ని పాటించండి... మనం మన ఆరాధ్య దైవాలను స్మరించుకొంటూ, మొన్నటి మృతులందరికీ శ్రద్ధాంజలిని సమర్పిద్దాం. ఇది అయ్యాక, నేను నా నేటి ప్రసంగాన్ని మొదలుపెడతాను.

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్బంగా బీహార్లోని మధుబనిలో

April 24th, 11:50 am

ఈ రోజు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్లోని మధుబనిలో కొన్ని ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పూర్తయిన వాటిని జాతికి అంకితం చేశారు. వీటన్నింటి మొత్తం విలువ రూ.13,480 కోట్లు. పెహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో మరణించినవారి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించాలని కార్యక్రమానికి హాజరైన వారిని ప్రధాని కోరారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా దేశమంతా మిథిల, బీహార్‌తో అనుసంధామైందని అన్నారు. బీహార్ అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల విలువైన విద్యుత్, రైల్వేలు, వసతుల ప్రాజెక్టులను ప్రారంభించామని, శంకుస్థాపనలు చేశామని తెలిపారు. ఇవి బీహార్లో నూతన ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాయని చెప్పారు. ప్రముఖ కవి రాంధారి సింగ్ దినకర్ జీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.

వారణాసిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ సందర్భంగా ప్రధాని ప్రసంగం

April 11th, 11:00 am

ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాధ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, బనాస్ డెయిరీ ఛైర్మన్ శంకర్‌భాయ్ చౌధురి, ఆశీస్సులు అందించడానికి ఇక్కడ పెద్ద సంఖ్యలో హాజరైన నా ప్రియ కుటుంబ సభ్యులందరికీ..

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఉత్తరప్రదేశ్ వారణాసిలో రూ.3,880 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

April 11th, 10:49 am

ఈ రోజు ఉత్తరప్రదేశ్ వారణాసిలో రూ. 3,880 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, కాశీ నగరంతో తనకు గల గాఢానుబంధాన్ని గురించిన అనుభూతులను పంచుకున్నారు. తన కుటుంబ సభ్యులు, ప్రాంత ప్రజలు తనకు అందించిన ఆశీస్సులకు, తనపై కురిపించే ఆదరాభిమానాలకు శ్రీ మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలందించే ప్రేమ తనను రుణగ్రస్తుడిని చేసిందని, తాను కాశీకి, కాశీ తనకు చెందుతుందన్నారు. రేపు హనుమాన్ జన్మోత్సవమని గుర్తు చేస్తూ, కాశీలోని సంకట మోచన మహారాజ్ ను సందర్శించే గౌరవం తనకు దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. హనుమాన్ జన్మోత్సవ పావన సందర్భాన్ని జరుపుకోవడానికి ముందస్తుగా అభివృద్ధిని వేడుక చేసుకునేందుకు కాశీ ప్రజానీకం తరలి రావడం హర్షదాయకమన్నారు.